మైసూరుకు దసరా శోభ
బెంగళూరు, అక్టోబరు 11, (న్యూస్ పల్స్)
Dasara glory to Mysore
ఈసారి దసరాకు మైసూరు వెళ్లారా..? లైఫ్‌టైమ్‌లో ఒక్కసారైనా దసరా పండగను మైసూర్లో చూడాల్సిందే. మైసూరుకెళ్లి దసరాను సెలబ్రేట్ చేసుకున్న ప్రతీవాళ్లూ చెప్పే మాటే ఇది. ఎందుకంటే మైసూర్ అంటే దసరా.. దసరా అంటేనే మైసూరు.. మైసూరులో జరిగే శరన్నవరాత్రులు.. చూడ్డానికి రెండు కళ్లూ సరిపోనంత గొప్ప సంబరం అది. 400 ఏళ్లకు పైగా చరిత్రున్న మహా వేడుక అది..పదిమంది కూడితే పండగ. వందలు-వేలమంది కలగలిస్తే అది ఉత్సవం. మరి.. లక్షల మంది ఒక్కచోట చేరి సంబరమాడితే.. అది మహోత్సవం.
దేశమంతటా దేవీ శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అవన్నీ ఒక ఎత్తయితే.. మైసూరులో జరిగే దసరా ఉత్సవం.. రాయల్ ఫెస్టివల్ ఒక్కటీ ఒక ఎత్తు..జోష్ అన్లిమిటెడ్.. జాయ్ అన్లిమిటెడ్.. సెలబ్రేషన్ అన్లిమిటెడ్.. మస్తీ అన్లిమిటెడ్. ట్రెడిషనల్ ఎంటర్టైన్మెంట్కి పర్ఫెక్ట్ కేరాఫ్ ఏదంటే ఇంకేంటి మైసూరు దసరానే. ఎందుకంటే.. 400 ఏళ్ల నుంచీ కంటిన్యూ ఔతున్నా వన్నె తగ్గని మహా సంప్రదాయం ఇది..కన్నడ నాట నాద హబ్బ.. అంటే రాష్ట్ర పండుగ. దసరా ఉత్సవాలకు అక్కడ జనం ప్రభంజనంలా కదులుతుంది.
అన్ని ఊర్లూ మైసూరు వైపే దారితీస్తాయి. నాటోన్లీ కర్నాటక.. దక్షిణాది ఉత్తరాది ఏకమై.. దేశం యావత్తూ మైసూరు దసరా కోసం కళ్లింత చేసుకుని ఎదురుచూస్తుంది. విజయదశమి నాటికి లక్షలమంది జనంలో కిక్కిరిసిపోతుంది మైసూర్ మహా నగరం..మైసూర్ దసరా ఉత్సవాల క్యాలెండర్ కూడా ప్రభుత్వమే అధికారికంగా ప్రకటించాలి. 2024 దసరా వేడుక అక్టోబర్ 3 ఉదయం 9 గంటలా 15 నిమిషాలకు మొదలై 12వ తేదీ శనివారం అర్థరాత్రి దాకా కొనసాగుతుంది. చాముండి హిల్స్‌లోని చాముండేశ్వరి ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి.
గత ఏడాది రాష్ట్రంలో కరువు పరిస్థితి ఏర్పడ్డా.. రుతుపవనాల ప్రభావంతో వర్షాలు బాగా కురవడంతో రైతాంగం కుదుటపడింది. అందుకే.. ఈ ఏడాది దసరా వేడుకల్ని మునుపటి కంటే ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేసింది కన్నడ సర్కార్. నెలరోజుల ముందునుంచే రిహార్సల్స్ మొదలౌతాయి. మైసూరు నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబౌతుంది. దాదాపు సగం పోలీసు ఫోర్స్ మైసూర్ మహోత్సవ్ మీదే ఫోకస్. సీఎం సిద్ధరామయ్య రెండుసార్లు సన్నాహక సమావేశం నిర్వహించి.. మైసూరు జిల్లా ఇన్చార్జి మంత్రిని అలర్ట్ చేశారు. రాష్ట్ర బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులే ఉంటాయంటే అర్థం చేసుకోవచ్చు మైసూర్ దసరా కన్నడ సర్కారుకు ఎంతటి ప్రతిష్టాత్మకమో.
Indrakiladri mustabu for Dussehra | దసరాకు ఇంద్రకీలాద్రి ముస్తాబు | Eeroju news