CRDA : 20 పనులకు సీఆర్డీయే ఆమోదం

20 పనులకు సీఆర్డీయే ఆమోదం

20 పనులకు సీఆర్డీయే ఆమోదం

విజయవాడ. డిసెంబర్ 11, (న్యూస్ పల్స్)
అమరావతి రాజధాని పనులు తిరిగి ప్రారంభం కానున్నాయి. రాజధానిలో చేపట్టనున్న 20 సివిల్ పనులకు రూ.11,467 కోట్లు వ్యయానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ఇచ్చే రుణం నుంచి ఈ పనులు చేపట్టనున్నారు. కూటమి సర్కార్ అమరావతి రాజధానిని తిరిగి పట్టాలెక్కిస్తుంది. ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తి కాగా…తాజాగా రాజధాని అమరావతిలో చేపట్టాల్సిన పలు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఆర్డీఏ ఆమోదించిన 20 సివిల్‌ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అమరావతిలో చేపట్టనున్న 20 సివిల్ పనులకు రూ. 11,467 కోట్ల వ్యయం అవుతుందని ప్రభుత్వం జీవోలో పేర్కొంది.అమరావతి అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ సంయుక్తంగా రూ.15 వేల కోట్ల రుణం ఇవ్వనున్నాయి. ఈ రుణంతో అమరావతి పనులు చేపట్టేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ముందుగా గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు, ఉద్యోగుల నివాస అపార్ట్‌మెంట్లు, ఐఏఎస్ అధికారులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాసాల నిర్మాణాలు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇందుకు పూర్తిగా నిధుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. జడ్జిలు, మంత్రులు, సీనియర్ ఐఏఎస్ అధికారుల ఇండ్ల నిర్మాణానికి నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. దీంతో పాటు సచివాలయ టవర్లు, అసెంబ్లీ, ఇతర మౌలిక సదుపాయాలకు కోసం ఈ నిధులు వినియోగించనున్నారు.అమరావతిలో కొండవీటి వాగు, పాలవాగు వెడల్పు పెంచడంతో పాటు శాఖమూరు, నీరు కొండవద్ద రిజర్వాయర్ నిర్మాణానికి రూ.1585 కోట్లు ఖర్చు చేయనున్నారు. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టులో భాగంగా 12 టవర్లతో 1200 అపార్ట్ మెంట్లు నిర్మించనున్నారు. ఇందుకు రూ.984 కోట్లు కేటాయించనున్నారు.

అమరావతి పరిధిలోని వరద కాలువలు, డ్రెయిన్లు, నీటి సరఫరా, సీవరేజీ, యుటిలిటీ డక్టులు, ఫుట్ పాత్ లు, సైకిల్ ట్రాక్ ల ఏర్పాటుకు నిధులను ఖర్చుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధాని పరిధిలోని 20 సివిల్ పనులకు రూ.11,467 కోట్లు వ్యయం చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.ఆంధ్రప్రదేశ్ సీఆర్డీఏ ప్రాజెక్టు బిల్డింగ్ డిజైన్ ఎంపిక కోసం అధికారులు ఓటింగ్ నిర్వహించారు. ఇటీవల ఓటింగ్ గడువు ముగిసింది. ఎక్కువమంది 4వ డిజైన్‌కు మద్దతు తెలిపారు. అయితే ఓటింగ్ విషయంలో అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గడువును అధికారులు పొడిగించారు. మరింత మందిని ప్రజారాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం చేయడం కోసం.. ఈనెల 14వ తేదీ వరకు ఓటింగ్ గడువు పెంచారు. ఇంకా ఓటింగ్‌లో పాల్గొనని వారు ఏపీ సీఆర్డీఏ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి నచ్చిన డిజైన్‌ను ఎంపిక చేయాలని అధికారులు కోరారు. 06 అమరావతిలో నిర్మించ తలపెట్టిన ఏపీ సీఆర్డీఏ భవనం ఎలా ఉండాలనే దానిపై.. అధికారులు అభిప్రాయ సేకరణ నిర్వహించారు. దీనికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. సీఆర్డీఏ వెబ్‌సైట్ ద్వారా ఓటింగ్‌ నిర్వహించగా.. వారం రోజుల్లో 9,756 మంది తమ అభిప్రాయాన్ని చెప్పారు. 4వ డిజైన్‌కు 3 వేల 354 మంది ఓటు వేశారు. ప్రజల అభిప్రాయాలను అధికారులు సీఆర్డీఏ వెబ్‌సైట్‌లో ఉంచారు.

Read :  బెజవాడలో ఇళ్లు బంగారు బాతు గుడ్లే…

Related posts

Leave a Comment