CPS employees | సీపీఎస్ కోసం ఉద్యోగుల ఒత్తిడి | Eeroju news

CPS employees

సీపీఎస్ కోసం ఉద్యోగుల ఒత్తిడి

హైదరాబాద్, సెప్టెంబర్ 20, (న్యూస్ పల్స్)

CPS employees

కాంట్రిబ్యూటరీ పెన్షన్స్ స్కీమ్ విధానం.. ప్రభుత్వ ఉద్యోగుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టివేసిందనే వాదనలు ఉన్నాయి. సుదీర్ఘ కాలం పాటు పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన తరువాత.. వారికి రావాల్సిన భృతి అందటం ప్రశ్నార్ధకంగా మారింది. 2004 సెప్టెంబర్ 1 నుంచి కేంద్ర ప్రభుత్వం అమలులోకి తెచ్చిన సీపీఎస్ విధానాన్ని ఉపాధ్యాయ ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఈ విధానం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి.. అమలు బాధ్యతను ఇచ్చికంగా రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలివేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. జీవో ఎంఎస్ నెంబర్ 653, 654, 655 ద్వారా అమలు చేశారు.

2014లో తెలంగాణ ఏర్పడిన తరువాత.. కేంద్రం తెలంగాణ ప్రభుత్వాన్ని తమ నిర్ణయాన్ని అడిగింది. అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 28 ద్వారా సీపీఎస్ అమలుకు ఓకే చెప్పారు.ఉద్యోగి మూల వేతనం నుంచి 10 శాతాన్ని తీసుకొని.. మ్యాచింగ్ గ్రాంటుగా ప్రభుత్వం మరో 14 శాతం కలిపి.. ఈ మొత్తాన్ని షేర్ మార్కెట్లో పెడుతుంది. ఉద్యోగి పదవి విరమణ పొందిన తరువాత అప్పటి వరకు షేర్ మార్కెట్లో తన ప్రాన్ నెంబర్ పై ఉన్న మొత్తం నుంచి 60 శాతం నగదుగా చేతికి అందించే వీలు ఉంటుంది.

ఈ 60 శాతం పైన 30 శాతం పన్ను విధిస్తారు. మిగిలిన 40 శాతం నగదును షేర్ మార్కెట్లోనే కొనసాగిస్తారు. దానిపై వచ్చే లాభాలను, నష్టాలను ఉద్యోగే అనుభవిస్తూ ఉండాలి. ఈ విధానం ద్వారా ఇప్పటి వరకు పదవి విరమణ పొందిన ఏ ఉద్యోగి కూడా 5 వేల రూపాయలకు మించి పెన్షన్ పొందిన దాఖలాలు లేవు. ఉద్యోగి పొందే పెన్షన్ పూర్తిగా షేర్ మార్కెట్ పైనే ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ విధానాన్ని బలంగా వ్యతిరేకిస్తున్నారు.యూనిఫాడ్ పెన్షన్ స్కీంకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదం పొందింది.

ఇది 2025 ఏప్రిల్ ఒకటి నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలు కాబోతుంది ఈ విధానంలో ఉద్యోగికి అందించే కనీస పెన్షన్ రూ.10 వేలకు అర్హత సాధించాలంటే.. కనీస సర్వీసు 10 సంవత్సరాలు ఉండాలి. పూర్తి పెన్షన్ పొందాలంటే 25 సంవత్సరాల సర్వీసు పూర్తవ్వాలి. అప్పుడు ఉద్యోగికి చివరి మూల వేతనలో సగం పెన్షన్‌గా వర్తిస్తుంది. కానీ.. పీఆర్సీ అమలు వంటివి ఉండవు. కాబట్టి భవిష్యత్‌లో పెన్షన్ పెరుగుదల ఉండదు.యూపీఎస్ విధానంలో కూడా ఉద్యోగి సొమ్మును షేర్ మార్కెట్లో పెట్టడం వల్ల భద్రత ఉండదు.

యూపీఎస్ విధానం అమలు అయితే.. సీపీఎస్, ప్రాన్ అకౌంటెంట్‌లో ఇప్పటికే జమ అయిన డబ్బు ఉద్యోగికి తిరిగి ఇవ్వరు. ఇలా ఏ విధంగా చూసినా సీపీఎస్, యూపీఎస్ విధానాల వల్ల ఉద్యోగికి నష్టమే. లాభం లేదు. అందుకే ఉద్యోగికి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ ఉంది. అప్పుడే ఉద్యోగుల జీవితానికి సామాజిక, ఆర్థిక భద్రత కలుగుతుందని ఉద్యోగులు చెబుతున్నారు.2024 సాధారణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పింది. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఈ హామీతో.. ఉపాధ్యాయ, ఉద్యోగులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు.

CPS employees

 

Actions will be taken if the employees do not come on time | ఉద్యోగులు స‌మ‌యానికి రాకుంటే చ‌ర్య‌లే | Eeroju news

Related posts

Leave a Comment