వైఎస్ఆర్ ఆస్తుల వివాదం.. నోరు విప్పిన నారాయణ
విజయవాడ, అక్టోబరు 30, (న్యూస్ పల్స్)
CPI Narayana
ఏపీలో రాజకీయాలు వైఎస్ఆర్ ఆస్తుల చుట్టూనే తిరుగుతున్నాయి. రెండు వారాలుగా ఇదే అంశం ట్రెండింగ్ అవుతోంది. మంగళవారం విజయమ్మ బహిరంగ లేఖతో జరుగుతున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్ పడినట్లయ్యింది.లేటెస్ట్‌గా ఆస్తుల వివాదంపై సీపీఐ నారాయణ రియాక్ట్ అయ్యారు. ఆస్తుల వివాదాన్ని ఒక్క సామెతతో సరిపెట్టారాశాయన. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు.
ఇది అన్నా-చెల్లి వ్యవహారమని, దీన్ని రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదన్నారు.బయటవాళ్లు దీనిపై అనవసరంగా నోరు పారేసుకోవడం మంచిది కాదని, అన్నాచెల్లి ఇద్దరు తెలివైన వాళ్లని, పరిష్కారం చేసుకుంటారన్నారు. ఈ విషయంలో వారికి ఎవరూ సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, అంతవరకు వస్తే విజయమ్మ ఇన్వాల్వ్ అవుతారన్నది తన ఓపీనియన్ గా చెప్పుకొచ్చారు సీపీఐ నారాయణ.
వైఎస్ఆర్ ఆస్తుల వ్యవహారంలో తొలుత వైసీపీ నేతలు నోరు ఎత్తారు. ఆ తర్వాత టీడీపీ వాళ్లు దాన్ని కౌంటర్ చేయడం మొలుపెట్టింది. దీంతో ఇటు వైసీపీ.. అటు టీడీపీ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది.. చివరకు రాజకీయ రంగు పులుముకుందిజగన్-షర్మిల ఆస్తుల వివాదాన్ని రాజకీయ కోణంలో చూడడం మొదలుపెట్టారు.
ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకునే వరకు వెళ్లింది. ఈలోగా మంగళవారం విజయమ్మ రాష్ట్ర ప్రజలకు లేఖ రాయడం, దానికి వైసీపీ కౌంటరివ్వడం జరిగిపోయింది. ఈ వ్యవహారాన్ని తేల్చేది న్యాయస్థానమేనని బదులిచ్చింది వైసీపీ. దీంతో ఈ వ్యవహారానికి దాదాపు ఫుల్‌స్టాప్ పడినట్టేనని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Jagan and YS Sharmila | జగన్ – షర్మిల మధ్య రాజీ.. | Eeroju news