కోవర్టులు పై వేటు తప్పదా…
విజయవాడ, సెప్టెంబర్ 18, (న్యూస్ పల్స్)
Coverts
ఎన్నికల్లో టిడిపి సూపర్ విక్టరీ సాధించింది. సొంతంగానే 135 స్థానాల్లో విజయం సాధించింది. కూ టమిపరంగా 164 సీట్లను కైవసం చేసుకుంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 100 రోజులు అవుతుంది.ఈనెల 20వ తేదీతో వందరోజుల పాలన పూర్తవుతుంది. దీంతో మూడు పార్టీలు సంబరాలు చేసుకునేందుకు సిద్ధపడుతున్నాయి. అయితే ఇదే క్రమంలో చంద్రబాబు కొన్ని రకాల లోపాలను సరి చేసుకునే పనిలో పడ్డారు. ముఖ్యంగా ఎమ్మెల్యేల పనితీరును మదించనున్నారు. కొందరు వ్యవహరిస్తున్న తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని నివేదికలు వచ్చాయి.
వాటి ప్రకారం దిద్దుబాటు చర్యలకు దిగనున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో కొందరు ఎమ్మెల్యేలకు భారీ షాక్ తగలనున్నట్లు సమాచారం. పార్టీకి వ్యతిరేకంగా,ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా వ్యవహరిస్తున్న వారి పేర్లు ఇప్పటికే చంద్రబాబు టేబుల్ పై ఉన్నట్లు సమాచారం.కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలతో పాటు బిజెపి, జనసేన ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేశారు. ప్రజలు ఎంతో నమ్మకంతో అధికారాన్ని అప్పగించారని.. దానిని దుర్వినియోగం చేయవద్దని హితవు పలికారు.
పవన్ సైతం అదే విషయాన్ని చెప్పుకొచ్చారు. చివరకు తాను తప్పు చేసిన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే కూటమి అధినేతలుగా చంద్రబాబు, పవన్ కీలక సూచనలు చేసినా కొందరు ఎమ్మెల్యేలు పెడచెవిన పెట్టినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. అటువంటి వారందరికీ ఇప్పటికే హెచ్చరికలు పంపారని..ఇప్పుడు నేరుగా మరోసారి హెచ్చరించనున్నట్లు సమాచారం. ఓ ముగ్గురు ఎమ్మెల్యేలపై వ్యతిరేకంగా నివేదికలు వచ్చినట్లు తెలుస్తోంది. ఓ మహిళ ఎమ్మెల్యే భర్త ఆగడాలు ఎక్కువయ్యాయని.. మరో ఎమ్మెల్యే వైసీపీ శ్రేణులకు అధిక ప్రాధాన్యమిస్తున్నారని… మరొకరు ఇసుక ఆగడాల్లో ఎక్కువగా తల దూర్చుతున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. దీనిపై పార్టీ పరంగా కూడా చంద్రబాబు నివేదికలు తెప్పించుకున్నట్లు సమాచారం. మరోసారి వారిని సుతిమెత్తగా హెచ్చరించనున్నట్లు తెలుస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.ఈనెల 18న క్యాబినెట్ మీటింగ్ ఉంటుంది. 20న వందరోజుల పాలన పూర్తవుతుంది. అందుకే ముందుగా ఎమ్మెల్యేలకు కీలకమైన సూచనలు చేసి సంబరాలకు పిలుపు ఇవ్వనున్నారు.
Terrible Strange Noises From The Well | బావి నుంచి భీకరంగా వింత శబ్దాలు.. ఏముందా అని వెళ్లి చూడగా..