Coriander Seeds Benefits | రాత్రంతా ధనియాలను నానబెట్టి, ఉదయాన్నే ఆ నీరు తాగండి.. | ASVI Health

Coriander Seeds Benefits

రాత్రంతా ధనియాలను నానబెట్టి, ఉదయాన్నే ఆ నీరు తాగండి..

Coriander Seeds Benefits

ASVI Health

వంట గదిలో ఉండే వస్తువుల్లో ధనియాలు ప్రధానమైంది. దాదాపు అన్ని వంటకాల్లో ధనియాలను ఉపయోగిస్తుంటారు. ధనియాల్లోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే మన పూర్వీకులు ధనియాలను ఆహారంలో ఒక భాగం చేశారు. అయితే కేవలం వంటల్లో ఉపయోగించే ధనియాల పొడితో మాత్రమే కాకుండా. ధనియాలను నానబెట్టిన నీరు తీసుకోవడం…

వంట గదిలో ఉండే వస్తువుల్లో ధనియాలు ప్రధానమైంది. దాదాపు అన్ని వంటకాల్లో ధనియాలను ఉపయోగిస్తుంటారు. ధనియాల్లోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే మన పూర్వీకులు ధనియాలను ఆహారంలో ఒక భాగం చేశారు. అయితే కేవలం వంటల్లో ఉపయోగించే ధనియాల పొడితో మాత్రమే కాకుండా. ధనియాలను నానబెట్టిన నీరు తీసుకోవడం వల్ల కూడా ఎన్నో ఉపయోగాలు ఉంటాయని మీకు తెలుసా.? ధనియాలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఆ నీటిని ఉదయాన్నే తాగితే ఎన్నో ప్రయజనాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

coriander seeds benefits

* బరువు తగ్గాలనుకునే వారికి ఈ డ్రిండ్ ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ధనియాల నీటితో జీవక్రియ మెరుగవుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలకు చెక్‌ పెట్టొచ్చు. మెటబాలిజం రేటు పెరుగుతుంది. దీంతో బరువు తగ్గడంలో ఎంతో ఉపయోగపడుతుంది. తీసుకున్న ఆహారం బాగా జీర్ణమవుతుంది.

* ధనియాల్లో విటమిన్‌ కె, విటమిన్‌ సి, విటమిన్‌ ఏ పుష్కలంగా లభిస్తుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యానికి ఎంతో మంచిది. జుట్టు రాలుడు సమస్య నుంచి బయటపడాలంటే ప్రతీ రోజూ ధనియాలు నానబెట్టిన నీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు.

Spectacular Benefits Of Coriander Seeds

* డయాబెటిస్‌ బాధితులకు కూడా ధనియాల నీరు ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రక్తంలో షుగర్‌ లెవల్స్‌ ఎక్కువగా ఉండేవారు ప్రతీ రోజూ ఉదయం నానబెట్టిన ధనియాల నీటిని తీసుకుంటే షుగర్‌ లెవల్స్‌ అదుపులో ఉంటాయి.

* ప్రతీరోజూ ఉదయం నానబెట్టిన ధనియాల నీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ రాడికల్ కి వ్యతిరేకంగా పోరాడుతాయి. ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరుస్తాయి.

Coriander Seeds: Health And Beauty Benefits - Century Spices & Snacks

* వర్షాకాలం వచ్చే సీజనల్‌ వ్యాధులైన జలుబు ,దగ్గు వంటి సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే రోజూ ధనియాల నీటిని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

* కిడ్నీ సమస్యలతో బాధపడేవారికి కూడా ధనియాల నీరు బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ సమస్యలు ఉన్నవారు ధనియాల నీటిని ఉదయం పరగడుపున తీసుకోవాలి.

Coriander Seeds Benefits

 

Papaya for Digestion | అజీర్తి నుంచి తక్షణ ఉపశమనం పొందాలా? ఈ పండు ముక్కలు కాసిన్ని తింటేసరి | ASVI Health

Related posts

Leave a Comment