Congress Route Map on Jobs | ఉద్యోగాలపై కాంగ్రెస్ రూట్ మ్యాప్ | Eeroju news

ఉద్యోగాలపై  కాంగ్రెస్ రూట్ మ్యాప్

ఉద్యోగాలపై  కాంగ్రెస్ రూట్ మ్యాప్

హైదరాబాద్, జూలై 15  (న్యూస్ పల్స్)

Congress Route Map on Jobs

తెలంగాణ రాకముందు ఏళ్లుగా పోరాటం.. తెలంగాణ వచ్చాక కూడా పదేళ్లుగా పోరాటం.. దేనికి ఉద్యోగాల కోసం. ఉన్న ఇంటిని విడిచి.. కోచింగ్ సెంటర్లకు వేలల్లో ఫీజులు కట్టి.. సగం తిని.. తినకా చెట్ల కింద కూర్చొని చదివేది ఎందుకు.. ? నోటిఫికేషన్లు పడతాయని.. కానీ ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు వచ్చి ఉద్యోగాలు సాధించే సమయం వచ్చే సరికి మళ్లీ అవే ఆందోళనలు. ఈసారి నోటిఫికేషన్లను వాయిదా వేయాలని.. ఇదేక్కడి లాజిక్.. ? మనం ఇన్నేళ్లుగా పోరాటాలు చేసింది ఈ ఉద్యోగాల కోసమే కదా.. తీరా చేతి వరకు వచ్చాక మళ్లీ వాయిదాలు వేస్తూ పోతే.. పరీక్షలు నిర్వహించేది ఎప్పుడు? ఫలితాలు వచ్చేదెప్పుడు? అందుకే ఈ విషయంలో ఎక్కడా తగ్గేది లేదంటున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఏదీ ఏమైనా నోటిఫికేషన్‌ ప్రకారం నిర్వహించి తీరుతామంటున్నారు.

కొందరి రాజకీయ కుట్రకు నిరుద్యోగులు బలి కావొద్దని సూచిస్తున్నారు.పుస్తకాల్లో ఉన్న చదువులు.. బయట మార్కెట్‌లో సమాజానికి అసలేమైనా సంబంధం ఉందా? ఈ చదువులు చదివి బయటికి వచ్చిన వారికి ఉద్యోగాలు వస్తున్నాయా? ప్రతి ఏటా లక్షలాది మంది చేతుల్లో సర్టిఫికేట్లు ఉంటున్నాయి తప్పా.. వారిలో పనితనం ఉంటుందా? ఇవే ప్రశ్నలను సూటిగా వేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.. క్వాలిటీ ఎడ్యుకేషన్‌పై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.కాలేజీలంటే ఏంటి.. ? ఉన్నత విద్యతో పాటు.. ప్రపంచానికి తగ్గట్టుగా అవసరమైన స్కిల్స్‌ను తయారు చేసే సంస్థలు.. విద్యా సంస్థలు.. కానీ బాధించాల్సిన విషయం ఏంటంటే.. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు అన్ని కూడా నిరుద్యోగ కర్మాగారాలుగా మారాయి.

ఇదే విషయాన్ని చెప్పారు రేవంత్ రెడ్డి. ఇంజనీరింగ్ కాలేజీలన్ని నిరుద్యోగులను తయారు చేసే కర్మాగారాలుగా మారొద్దన్నారు ఆయన. అంతేకాదు.. ప్రపంచంలో అద్భుతాలు సృష్టించింది ఇంజనీర్లే అని. సీవిల్ అండ్ ఐటీపై ఇంజనీరింగ్ కాలేజేస్ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.ఇంజనీరింగ్ అంటే కేవలం కంప్యూటర్ సైన్స్ మాత్రమే కాదు.. సివిల్, మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులను కూడా కాలేజీలు ప్రోత్సహించాల్సిదే. స్కిల్ డెవలప్‌మెంట్‌లో భాగంగా టాటా భాగస్వామ్యంతో 2వేల 400 కోట్లతో ప్రభుత్వం ఐటీఐల రూపురేఖలను మారుస్తుంది. నిజానికి కాలేజీలకు ఓ విజన్ ఉండాలి.

ప్రస్తుతం ఫార్మా, ఐటీ తరువాత నెక్ట్స్‌ ప్రపంచాన్ని ఏలబోయేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. కాబట్టి కాలేజీలన్ని కూడా AIపై ఫోకస్ చేయాలని సూచించారు రేవంత్.. ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని.. అలా చేసేందుకు తమ సహాకారం ఎప్పుడూ ఉంటుందని కాలేజీలకు సూచించారు రేవంత్. లెటెస్ట్‌గా జరుగుతున్న నిరుద్యోగ సమస్యలపై కూడా రేవంత్ రియాక్ట్ అయ్యారు. పదేళ్లు ఉద్యోగాల భర్తీ చేయాలని నిరుద్యోగ యువత కోట్లాడిన యువత. ఇప్పుడు పరీక్షల వాయిదా కోసం కొన్ని రాజకీయ శక్తులు, కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఆమరణ దీక్షలు చేయడంపై తీవ్రంగా స్పందించారు.

నిరుద్యోగులను తప్పుదోవ పట్టించేందుకు ఎవరెన్ని కుట్రలు, ప్రయత్నాలు చేసినా వారి మంచి కోసం తాము ఎప్పుడూ పోరాడుతూనే ఉంటామని త్వరలోనే జాబ్ క్యాలెండర్ ను తీసుకురాబోతున్నామని యూపీఎస్సీ తరహాలో ప్రతీ ఏటా క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామని మరోసారి క్లారిటీ ఇచ్చారు. మొత్తంగా చూస్తే.. ఉద్యోగాలు కల్పించే విషయంలో తాము ఎక్కడా వెనక్కి తగ్గడం లేదని రేవంత్ క్లారిటీ ఇచ్చారు. అదేవిధంగా.. ఉద్యోగాలు సాధించాలంటే.. సరైన స్కిల్స్‌ నేర్చుకోవాలని ఆ స్కిల్స్‌ను నేర్పే కాలేజీలు పటిష్టంగా ఉండాలని చెబుతున్నారు. నిరుద్యోగాన్ని రూపుమాపాలంటే.. మొదట ప్రపంచ అవసరాలకు తగ్గట్టుగా సిలబస్‌ను మార్చాలి. అలా మార్చితేనే భవిష్యత్తు తరాలకు మేలు జరుగుతుందనేది సీఎం రేవంత్ ఆలోచన.

 

ఉద్యోగాలపై  కాంగ్రెస్ రూట్ మ్యాప్

 

ఇచ్చిన మాట ప్రకారం ఉపాధ్యయ ఖాళీలు నింపాలి | According to the given word, Upadhyaya should fill the blanks | Eeroju news

 

 

Related posts

Leave a Comment