ప్రజాస్వామ్యంలో ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం సాద్యం కాదు
కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే
న్యూ డిల్లీ సెప్టెంబర్ 19
Congress chief Mallikarjun Kharge
జమిలి ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. జమిలి ఎన్నికలపై కోవింద్ కమిటీ సమర్పించిన నివేదికకు కేంద్ర క్యాబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. ఒకే దేశం ఒకే ఎన్నికపై కోవింద్ కమిటీ సిఫార్సులకు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో ఖర్గే మాట్లాడుతూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయంతో తాము విభేదిస్తున్నామని, ప్రజాస్వామ్యంలో ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం పనిచేయదని స్పష్టం చేశారు.
మన ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే అవసరమైనప్పుడు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉందని ఖర్గే పేర్కొన్నారు. కాగా, వన్ నేషన్-వన్ ఎలక్షన్ ప్రక్రియకు ఇవాళ కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో వన్ నేషన్-వన్ ఎలక్షన్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిండ్ కమిటీ అందజేసిన రిపోర్టుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.ఎట్టి పరిస్థితుల్లోనైనా జమిలి ఎన్నికలు నిర్వహించి తీరుతామని ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షా పేర్కొన్న విషయం తెలిసిందే.
రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ వన్ నేషన్-వన్ ఎలక్షన్ ప్రతిపాదన చేసింది. సెప్టెంబర్‌లో ఆ ప్యానెల్ ఏర్పాటైంది. లోక్‌సభ ఎన్నికలకు ముందే కోవింద్ ప్యానెల్ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. న్యాయశాఖ ఆ రిపోర్టును ఇవాళ కేంద్ర క్యాబినెట్ ముందు ప్రవేశపెట్టింది. వంద రోజుల మోదీ సర్కార్ పాలన సందర్భంగా ఈ రిపోర్టును ముందుకు తీసుకువచ్చారు.
Jagan is getting closer to Congress | కాంగ్రెస్ కు దగ్గరవుతున్న జగన్ | Eeroju news