Complaint to vigilance about corruption and irregularities in TTD | టీటీడీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విజిలెన్స్ కు ఫిర్యాదు.. | Eeroju news

Complaint to vigilance about corruption and irregularities in TTD

టీటీడీలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై విజిలెన్స్ కు ఫిర్యాదు..

వైసీపీ మాజీ మంత్రుల దర్శనాల చిట్టా పై విచారణ జరపాలి..
టీటీడీ ని కాపాడాలి – కిరణ్ రాయల్ 

Complaint to vigilance about corruption and irregularities in TTD

 

శ్రీవారి ట్రస్ట్ నిధులు ఎక్కడికి మళ్లించారని, భక్తులు ఎంత డిపాజిట్ చేశారని, అమోత్తం ఏ సంస్థకు, ఆలయాల నిర్మాణానికి ఇచ్చారని, వాటిపై శ్రీవారి భక్తులకు అనుమానాలు వున్నాయని, తక్షణమే ధర్యాప్తు చేపట్టి నిజా నిజాలు ప్రజలకు తెలియజేయాలని  తిరుపతి స్టేట్ విజిలెన్స్ కార్యాలయం నందు కిరణ్ రాయల్ జనసేన నేతలతో కలిసి ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీవాణి ట్రస్ట్ నిధులలో అవకతవకలు జరిగాయని గతంలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఈ విషయంపై మాట్లాడారని, అవన్నీ కూడా వాస్తవమేనని, గత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత 5 ఏళ్లలో తిరుమలలో శ్రీవాణి ట్రస్ట్, దర్శనాల పేరుతో పెద్ద ఎత్తున అక్రమాలు చేశారని, వాటిమీద పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలని విజిలెన్స్ అధికారులను కోరామన్నారు. అలాగే గత ప్రభుత్వంలో మంత్రులకు ఇచ్చిన సేవా టికెట్లు, విఐపి బ్రేక్ దర్శన టికెట్లు అన్నింటిపై కూడా విచారించి, దర్యాప్తు చేయాలన్నారు. గత 5 సం|| లలో 2019 జూన్ నుంచి 2024 మే వరకు ఇచ్చిన టికెట్లలో దాదాపు కొన్నివేల టికెట్ల మీద అక్రమంగా వ్యాపారాలు జరిగాయన్నారు, దర్శనాల పేరుతో లాబీయింగ్ చేసుకొని దోచుకున్నారని కిరణ్ రాయల్ స్పష్టం చేశారు. వీటన్నిటిపై విచారణ చేసి, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో.. జనసేన నేతలు సుభాషిని, హేమ కుమార్, చందన, ప్రసాద్, దుర్గ, వినోద్, కిషోర్, మనోజ్, షరీఫ్, రాజేంద్ర, ఆది, భాను, లోకేష్, ప్రసాద్,మురళి తదితరులు పాల్గొన్నారు.

 

Complaint to vigilance about corruption and irregularities in TTD

Who has the post of TTD Chairman | టీటీడీ ఛైర్మన్ పదవి ఎవరికి… | Eeroju news

Related posts

Leave a Comment