CM Revanth Reddy | బీఆర్ఎస్ సర్కారు 5 వేల పాఠశాలలను మూసివేసింది | Eeroju news

CM Revanth Reddy

బీఆర్ఎస్ సర్కారు 5 వేల పాఠశాలలను మూసివేసింది

సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్

CM Revanth Reddy

బిఆర్ఎస్ సర్కారు 5వేల పాఠశాలలను మూసివేసిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కొందుర్గులో ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ. ముందుగా తెలంగాణ ప్రజలందరికీ సీఎం రేవంత్ రెడ్డి దసరా శుభాకాంక్షలు. విజయదశమి సందర్భంగా విజయం సాధించాలని కోరుకుంటున్నాను.

తెలంగాణలో విద్యా వ్యవసస్థను ప్రక్షాళన చేస్తున్నాం. 7 లక్షల కోట్లు అప్పు చేసిన కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలలను బాగు చేయలేదన్నారు. నాణ్యమైన విద్యనందించాలనే లక్ష్యంతో పని చేస్తున్నాను. బదిలీలు, ప్రమోషన్లు టీచర్లకు అవకాశం కల్పించారు. 34వేల మంది టీచర్లను బదిలీలు.. 21వేల మంది ప్రమోషన్లు ఇచ్చి ప్రభుత్వం పట్ల విశ్వాసం కల్పించామని తెలిపారు.

పదేళ్లలో విద్యాకోసం 10వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. పీవీ నరసింహారావు ముందు చూపుతో రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చారు. ఏ దొరలు పేదలకు విద్యను వైద్యాన్ని దూరం చేసిర్రో, నువ్వు కూడా అలా చేద్దామనుకుంటున్నావా, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ అని ప్రశ్నించారు. ఒక్కో లైబ్రరీలో 6oవేల పుస్తకాలు, 5వేల కంప్యూటర్లుంటాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 5వేల పాఠశాలలను మూసి వేసింది. దళితులను, గిరిజనులను విద్యకు దూరం చేయడమే.

ప్రపంచాన్నే ఏలే శక్తి, సామర్థ్యాలు, తెలివితేటలు తెలంగాణ ప్రజలకు ఉంది. తెలంగాణలో ఉన్న ప్రతీ పేదవాడికి నాణ్యమైన విద్యనందించాలని మా ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. ఎవ్వరితోనైనా చెలగాటం ఆడొచ్చు.. కానీ టీచర్లతో చెలగాటం ఆడకూడదు. వారు తలుచుకుంటే.. ప్రభుత్వాలే కూలిపోతాయి. తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత విద్యాశాఖను తన వద్దనే ఉంచుకొని విద్యాశాఖను ప్రక్షాళన చేసి. అధికారుల సలహాలు తీసుకొని 34వేల మంది టీచర్లను బదిలీలు. 21వేల మంది ప్రమోషన్లు ఇచ్చి ప్రభుత్వం పట్ల విశ్వాసం కల్పించామని తెలిపారు.

CM Revanth Reddy

 

Revanth Reddy | రుణమాఫీపై రేవంత్ క్లారిటీ | Eeroju news

Related posts

Leave a Comment