మన్ కీ బాత్ తరహా ప్రోగ్రామ్ కు చంద్రబాబు ప్లాన్
గుంటూరు, నవంబర్ 22, (న్యూస్ పల్స్)
CM Chandrababu Naidu in Mann Ki Baat
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వినూత్న తరహా కార్యక్రమాలతో ప్రజలతో మమేకం అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న ‘మన్ కీ బాత్’ తరహాలోనే రాష్ట్రంలో కూడా ప్రజలతో నేరుగా చంద్రబాబు మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమాన్ని సంక్రాంతి నుంచి ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. గతంలో 1995 -2004 మధ్య ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో చంద్రబాబు నాయుడు ‘డయల్ యువర్ సీఎం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం అప్పట్లో సంచలనంగా మారింది. ప్రజలు నేరుగా సీఎంకు ఫోన్ చేసి తమ సమస్యలను వివరించేవారు.
సంక్రాంతి నుంచి ఏపీలో మన్ కీ బాత్, డయల్ యువర్ సీఎం కార్యక్రమాల కలయిక ద్వారా ప్రజలతో మమేకం అయ్యేందుకు సీఎం చంద్రబాబు ప్రణాళికలు చేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆడియో గానీ, వీడియో విధానంలో గానీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.ఇదిలాఉంటే.. సీఎం చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. సంఘ విద్రోహశక్తుల ఆట కట్టిస్తామని, సామాజిక మాధ్యమాల ద్వారా ఏ ఆడబిడ్డను అవమానించేలా వ్యవహరించినా అదే వారికి చివరి రోజవుతుందని హెచ్చరించారు.
ఇష్టానుసారం వ్యక్తిత్వ హననం చేస్తే ఉపేక్షించమని అన్నారు. అదేవిధంగా పంచాయతీలకు రూ. 999 కోట్లు విడుదల చేశామని, త్వరలో రూ. 1,100 కోట్లు రాబోతున్నాయని చంద్రబాబు చెప్పారు. ఒకేరోజు రాష్ట్ర వ్యాప్తంగా 16వేల గ్రామ సభలు పెట్టాం. రూ. 4,500 కోట్లతో 30వేల పనులు చేపట్టాం. సంక్రాంతికి ముందే పనులు పూర్తి చేస్తామని చంద్రబాబు అసెంబ్లీ వేదికగా చెప్పారు.
Modi and Chandrababu | మోడీ తర్వాత పవర్ ఫుల్ చంద్రబాబే… | Eeroju news