Classification between Congress and BJP | కాంగ్రెస్, బీజేపీ మధ్య వర్గీకరణం | Eeroju news

Classification between Congress and BJP

కాంగ్రెస్, బీజేపీ మధ్య వర్గీకరణం

హైదరాబాద్, ఆగస్టు 2, (న్యూస్ పల్స్)

Classification between Congress and BJP

ఎట్టకేలకు మూడు దశాబ్దాల వర్గీకరణ నిరీక్షణకు సుప్రీంకోర్టు తీర్పుతో తెరపడింది. విద్య, ఉపాధి అవకాశాలలో రిజర్వేషన్ల ఉప వర్గీకరణకు మద్దతుగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన తీర్పును ఇచ్చింది. 2004 సంవత్సరంలో ఐదుగురు జడ్జీలతో కూడిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. వాస్తవానికి 2000 సంవత్సరం నుంచి నాలుగేళ్ల పాటు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో వర్గీకరణ అమలు చేస్తూ వచ్చారు. అయితే మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో మాదిగ హక్కుల రిజర్వేషన్ సమితి (ఎంఆర్పీఎస్) వర్గీకరణతో దళితులకు జరుగుతున్న అన్యాయంపై గళమెత్తారు.

ముఖ్యంగా మాదిగలకు అన్యాయం జరుగుతోందని ఆరోపణల నేపథ్యంలో గత ఏడాది మంద కృష్ణ మాదిగకు మోదీ మద్దతునిస్తూ ఎస్సీ వర్గీకరణపై హామీ నివ్వడంతో మోదీకి సపోర్టుగా నిలిచారు మంద కృష్ణ. తెలంగాణలో మాదికగ ఓటు బ్యాంకు ఎక్కువ. కేవలం ఎస్సీ నియోజకవర్గాలలోనే కాకుండా జనరల్ కేటగిరీలోనూ మాదిగల భాగస్వామ్యం ఎక్కువ. గత ఎన్నికలలో బీజేపీ తన ఓటు బ్యాంకును ఈ రకంగా పెంచుకోగలిగింది. అగ్రకులాల మాదిరిగానే దళిత కులాలలోనూ ఎక్కువ, తక్కువ బేధాలు ఉన్నాయి. ఎస్సీలో 59 ఉపకులాలు ఉన్నాయి. మిగిలిన కులాలతో పోలిస్తే మాదిగ జనాభా సంఖ్యే ఎక్కువ.

2004లో అప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజ్యాంగ సవరణ చేయాలని అసెంబ్లీలో తీర్మానించింది. అయితే కేంద్ర ప్రభుత్వం 2007లో ఓ కమిషన్ ఏర్పాటు చేసింది. అప్పడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ దీనిని అంత సీరియస్ గా తీసుకోలేదు. దీనితో మొదటినుంచి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ వస్తున్న మాదిగలు కాంగ్రెస్ ను వ్యతిరేకించడం ఆరంభించారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కూడా కేవలం వంద రోజుల్లో ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరిస్తామని చెప్పి మాట తప్పారు. అప్పటినుంచి పదేళ్లుగా ఎమ్మార్పీఎస్ ఉద్యమాలు చేస్తూ తమ వినతులు వినమని ప్రభుత్వాధినేతలకు చెబుతూ వస్తునే ఉన్నారు. అయితే 2023 ఎన్నికలలో మోదీ ఎస్సీ వర్గీకరణపై కమిటీ వేస్తామని హామీ ఇచ్చారు.

పైగా మాదిగ హక్కుల బిమాండ్లకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. దీనితో మోదీకి మద్దతుగా ఎస్సీలు తమ ఓటును బీజేపీకి వెయ్యాల్సిందిగా మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. తెలుగు రాష్ట్రాలలో వచ్చే ఎన్నికలలో బీజేపీ పాగా వేద్దామని భావిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో మాదిగ ఓటు శాతం ఎక్కువే. అందుకే ఎలాగైనా వారి ఓటు బ్యాంకుతో ఈసారి రెండు తెలుగు రాష్ట్రాలలో పాగా వేద్దామని భావిస్తోంది బీజేపీ. అయితే బీజేపీకి అసలైన పరీక్ష ముందుంది. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని సీఎం చేస్తామని ప్రకటించింది బీజేపీ. అయితే అధికారంలోకి వచ్చే సీట్లు రాబట్టలేకపోయింది. ఇప్పడు బీజేపీ ముందు ఒకటే లక్ష్యం.

తెలంగాణ స్థానిక ఎన్నికలలో ఎస్సీల మద్దతుతో ఎక్కువ శాతం సీట్లు గెలుచుకోవాలని చూస్తోంది. అయితే బీజేపీకి మొదటినుంచి అగ్రకులాలకు మద్దతు ఇస్తుందనే అపవాదు ఉంది. తెలంగాణకు పార్టీ అధ్యక్షుడిగా ఎవరని చేయాలనే అంశంపై తీవ్ర తర్జనభర్జనలు జరుగుతున్నాయి పార్టీలో. బీసీల తరపున ఈటలకి ఇస్తారా లేక డీకే అరుణకి అధ్యక్ష పదవిని కట్టబెడతారా అని ఊహాగానాలు చేస్తున్నాయి. ఇప్పుడు కోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీలను మచ్చిక చేసుకోవాలంటే ఎస్సీ వర్గానికి చెందిన నేతను పార్టీ అధ్యక్షుడిగా చేస్తే రాబోయే ఎన్నికలలో తమ పార్టీకి భారీ మద్దతు లభించినట్లవుతుందని కొందరు సీనియర్లు సూచిస్తున్నారు. కాంగ్రెస్ కూడా అధ్యక్షడి ఎంపికపై డైలమాలో ఉంది. ఇప్పుడు ఈ రెండు పార్టీలు కనీసం ఇప్పుడైనా ఎస్సీ అభ్యర్థికి మద్దతుగా అధ్యక్ష పీఠం అప్పగిస్తాయా? అనేది వెయ్యి డాలర్ల ప్రశ్న.

Classification between Congress and BJP

 

Thats why we dont include MLAs in BJP.. Raghunandan | ఎమ్మెల్యేలను మేము బీజేపీలో అందుకే చేర్చుకోవట్లేదు.. | Eeroju news

Related posts

Leave a Comment