Chilukur Balaji:వీరరాఘవరెడ్డికి క్లీన్ సర్టిఫికెట్:చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు కొవ్వూరి వీర రాఘవ రెడ్డి అలియాస్ రామరాజ్యం వీర రాఘవ రెడ్డి గురించి తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చ అయితే జరుగుతోంది.. రామరాజ్య స్థాపనకు అవసరమైతే ప్రాణాలివ్వడం, ప్రాణాలు తీయడం అనే నినాదంతో సైన్యాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పుకుంటున్న వీరరాఘవ రెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన హంగామా అంతా ఇంతా కాదు.
వీరరాఘవరెడ్డికి క్లీన్ సర్టిఫికెట్
కాకినాడ, ఫిబ్రవరి 18
చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు కొవ్వూరి వీర రాఘవ రెడ్డి అలియాస్ రామరాజ్యం వీర రాఘవ రెడ్డి గురించి తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చ అయితే జరుగుతోంది.. రామరాజ్య స్థాపనకు అవసరమైతే ప్రాణాలివ్వడం, ప్రాణాలు తీయడం అనే నినాదంతో సైన్యాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పుకుంటున్న వీరరాఘవ రెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఇంతకీ వీరరాఘవ రెడ్డిది అసలు ఏ ఊరు.. ఆయన స్వస్థలం ఎక్కడ అనే చర్చ జరుగుతోంది. వీరరాఘవ రెడ్డి స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గం కొప్పవరం. ఈ గ్రామంలో వీర రాఘవరెడ్డి గురించి తెలుసుకునేందుకు ఆ గ్రామ ప్రజలతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుంది. అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో వీరరాఘవ రెడ్డి ఇల్లు ప్రస్తుతం తాళం వేసి ఉంది. ఆయన తల్లిదండ్రులు చిన్న కుమారుడు వద్ద నూజివీడులో ఉంటున్నారని చుట్టుపక్కల వాళ్లు చెప్పారు. వీరరాఘవరెడ్డి చాలా కాలంగా ఆ గ్రామంలో ఉండడం లేదట. గ్రామంలో ఎవ్వరిని కదిపినా వీరాఘవరెడ్డి మంచివాడనే చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వీరరాఘవ రెడ్డి చిన్నతనమంతా కొప్పవరంలోనే గడిపాడు. సుమారు 25 సంవత్సరాల క్రితం గ్రామం నుంచి హైదరబాద్ వెళ్లిపోయారని ఆ గ్రామ సర్పంచ్ బులిమోహన్ రెడ్డి తెలిపారు. వీరరాఘవ రెడ్డి కుటుంబం చాలా పద్దతైన కుటుంబం అని అంటున్నారు. తండ్రి సత్తిరెడ్డి వ్యవసాయదారుడని, తల్లి తల్లి మహాలక్ష్మి హోమ్‌మేకరని వివరించారు. చిలుకూరి బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకునిపై దాడి అనేది జరిగిందో లేదో తెలీదని అన్నారు. అంతరించిపోతున్న హిందూ ధర్మాన్ని పరిరక్షించాలన్నట్టు వీరరాఘవ రెడ్డి వీడియోలను బట్టి అర్ధమవుతుందన్నారు కొప్పవరంవాసులు. గ్రామంలోకి ఆయన ఎప్పడూ రాడని, అయితే ఎవ్వరైనా ఎదైనా సమస్యల్లో ఉన్నట్టు తెలిస్తే మాత్రం సాయం చేసేవాడట. రామరాజ్యం వీరరాఘవ రెడ్డికి చట్టాలపై అవగాహన ఎక్కువగా ఉందని ఆ గ్రామ సర్పంచ్ బులిమోహన్ రెడ్డి తెలిపారు. తను చదువుకున్నది పదోతరగతి వరకేనని తెలుసని, అయితే అక్కడికి వెళ్లాక ఎంత చదువుకున్నాడో తెలియదన్నారు. గ్రామంలో వీరరాఘవ రెడ్డి అనుచరులుగా ఉన్నారా అన్న ప్రశ్నకు ఎవ్వరూ తనతో అంతగా టచ్‌లో లేరన్నారు. తనతో కూడా అతను అందుబాటులో ఉండలేదన్నారు. తన పనేదో తను చూసుకోవడం తప్ప ఇంకేమీ తండ్రికి తెలియదని, తల్లి కూడా అంతే అన్నారు. ఇక సోదరుడు అయితే వ్యాపారం చేసుకుంటున్నాడని, తండ్రి ఐటీసీలో కార్మికునిగా రిటైర్ అయ్యాక ఇక్కడ ఉండడం లేదన్నారు. వీరరాఘవ రెడ్డి వ్యక్తిత్వం గురించి ఏం చెబుతారని ప్రశ్నించగా తనకు తెలిసినంత వరకు ఆయన మంచి వ్యక్తి అని సర్పంచ్ బులిమోహన్ రెడ్డి చెప్పకొచ్చారు.
Read more:Telugu states:నాన్ వెజ్ ప్రియులకు కష్టాలు