అధికారుల్లో దడ…….
నెల్లూరు, ఆగస్టు 21, (న్యూస్ పల్స్)
Chief Minister Chandrababu Naidu
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు దడ లేపుతున్నారు. ఆయన పర్యటనలు అంటేనే అధికారులు హడలెత్తిపోతున్నారు. ఎప్పుడు ఏ సమాచారం అడుగుతారో అన్న టెన్షన్ అధికారుల్లో ఉంది. 2014 లో ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టిన చంద్రబాబుకు, ఇప్పటి చంద్రబాబుకు అసలు పొంతనే లేదు. పూర్తిగా వయొలెంట్ గా మారిపోయారు. ఆయన చెప్పినట్లుగానే 1995 నాటి ముఖ్యమంత్రిని నేడు చూస్తారంటూ వార్నింగ్ లు ఇస్తున్నారు. బీకేర్ఫుల్ అంటూ గట్టిగా హెచ్చరికలు జారీ చేస్తూ అధికారులు ఒళ్లు దగ్గరపెట్టుకుని పనిచేయాలంటూ చంద్రబాబు అంటుండటంతో వణికిపోతున్నారుచంద్రబాబు నాయుడు 1995లో ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టినప్పుడు ఆయన దూకుడుగా వెళ్లారు.
ఆకస్మిక తనిఖీలు చేశారు. అధికారులను నిద్ర పోనివ్వ లేదు. దీంతో పాటు సస్పెన్షన్లు కూడా నాడు ఎక్కువ చేశారు. నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని ఆయన నాడు చెబుతూ వైద్యం, విద్యం వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టేవారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు వస్తున్నారంటే గుండెపోటుకు గురైన అధికారులు కూడా అనేక మంది ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆ తర్వాత ఆయన కొంత దూకుడు తగ్గించారు. 1999లో అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిపైనే దృష్టి పెట్టడంతో కొంత అధికారులు మళ్లీ ఊపిరి పీల్చుకున్నారు. కానీ నాటి చంద్రబాబు నాయుడును అధికారులు గుర్తుకు తెచ్చుకుని మరీ భయపడిపోతున్నారు. అయితే నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. నేడు విడిపోయిన ఆంధ్రప్రదేశ్.
తేడా లేకపోయినా ఒక విషయంలో మాత్రం కొంత అధికారులు క్లారిటీ ఇచ్చేందుకు అవస్థలు పడుతున్నారు. నాడు నిధులు పుష్కలంగా ఉండేవి. చెప్పిన పనులు వెంటనే చేసేవారు. ఇచ్చిన ఆదేశాలను వెంటనే అమలు చేసేవారు. కానీ ఇప్పుడు నిధులు లేవు. దీంతో డబ్బులు లేకుండా ఏం చేయాలని అధికారులు ప్రశ్నించే పరిస్థితికి వచ్చింది. అయినా ఆయనను నేరుగా ప్రశ్నించలేక మంత్రులు, ఎమ్మెల్యేలకు తమ గోడును చెప్పుకుంటున్నారు.చంద్రబాబు పాత ముఖ్యమంత్రిగా మారితే తప్పులేదు. కానీ అదే సమయంలో అధికారులు పనులు చేయలేకపోవడానికి గల కారణాలను కూడా ఆయన కనుక్కొని ఫైర్ అయితే బాగుంటుందని అంటున్నారు.
నిన్న నెల్లూరు జిల్లాకు వెళ్లిన చంద్రబాబు అక్కడి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంపై అధికార వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రజల పన్ను సొమ్ముతో జీతాలు తీసుకుంటున్న అధికారులు, ఉద్యోగులు కనీసం సమస్యలను అడ్రెస్ చేయకుండా పట్టించుకోకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడాన్ని టీడీపీ నేతలు తప్పుపడుతున్నారు. చంద్రబాబు వార్నింగ్ ఇచ్చిన దాంట్లో తప్పేముందని, అధికారులు ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేస్తేనే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని అంటున్నారు. మొత్తం మీద చంద్రబాబు జిల్లాల పర్యటనకు వస్తున్నారంటే అధికారుల్లో దడ మొదలయింది.
CM Chandrababu | సీఎం చంద్రబాబు వ్యూహాత్మకంగా అడుగులు | Eeroju news