Chennai:జయలలిత ఆస్తులు తమిళ ప్రభుత్వానికే 4 వేల కోట్లు వరకు ఉంటుందని అంచనా

Jayalalithaa's assets are estimated to be up to 4 thousand crores

Chennai:జయలలిత ఆస్తులు తమిళ ప్రభుత్వానికే 4 వేల కోట్లు వరకు ఉంటుందని అంచనా:తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి దివంగత జయలలితకు సంబంధించిన ఆస్తులను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు సీబీఐ కోర్టు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

జయలలిత ఆస్తులు తమిళ ప్రభుత్వానికే
4 వేల కోట్లు వరకు ఉంటుందని అంచనా

చెన్నై, ఫిబ్రవరి 17
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి దివంగత జయలలితకు సంబంధించిన ఆస్తులను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్లు సీబీఐ కోర్టు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తయ్యింది. ఈ నేపథ్యంలోనే 27 కేజీల జయలలిత బంగారు ఆభరణాలతోపాటు వజ్రాలు, వజ్రాల హారాలు, పచ్చలు, వెండి వస్తువులన్నీ కలిపి 3 భారీ ట్రంకు పెట్టెల్లో బెంగళూరు నుంచి చెన్నైకి చేరుకున్నాయి. ఈ ఆభరాణాల్లో 1.2 కిలోల బంగారు వడ్డానం, 1.5 కిలోల బంగారు ఖడ్గం, బంగారు కిరీటం, బంగారు పెన్ను తదితర వస్తువులు ఉన్నాయి. ట్రెజరీ బాక్సుల్లో మొత్తం రూ.2,20,384 పాత కరెన్సీ నోట్లను కూడా తీసుకొచ్చారు. ఈ నోట్లను తీసుకొని చెల్లుబాటయ్యే కరెన్సీని తమిళనాడు ప్రభుత్వానికి అందజేయాలని ఆర్బీఐని కోర్టు కోరింది. కోర్టు జప్తు చేసిన చీరలు, చెప్పులు ముందుగానే తిరిగి ఇచ్చేసిన విషయం తెలిసిందే.ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలిత 2014లో దోషిగా తేల్చారు. ఆమె ఆస్తులతోపాటు చెన్నై, తంజావూరు, చెంగల్‌పట్టు, తిరువళ్లూరు, తిరువారూరు, తూత్తుకుడిలో 1526.16 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆరు కంపెనీల ఆస్తులను కూడా అధికారులు జప్తు చేశారు. ఆ తర్వాత హైకోర్టు నిర్దోషిగా ప్రకటించింది. అయితే 2016లో రాష్ట్రానికి సంబంధించిన అప్పీలు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండగానే జయలలిత కన్నుమూశారు. జప్తు చేసుకున్న సమయంలో ఈ ఆస్తుల విలువను 913.14 కోట్లుగా అధికారులు మదింపు వేయగా.. అది నేడు కనీసం రూ.4,000 కోట్లుగా ఉండొచ్చని అనధికారికంగా తెలుస్తోంది.

అధికారులు జప్తు చేసినవాటిల్లో పొలాలు, నివాసాలకు సంబంధించిన దస్తావేజులు, 11,300 పట్టు చీరలు, 250 శాలువాలు, 12 రిఫ్రిజిరేటర్లు, 10 టీవీలు, 8 వీసీఆర్‌లు, 740 జతల పాదరక్షలు, 610 వెండి వస్తువులు, 27 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. 7,040 గ్రాముల 468 వజ్రఖచిత బంగారు ఆభరణాలతో కలిపి మొత్తం 1606 వస్తువులను ట్రంకు పెట్టెల్లో తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియ శుక్రవారం జరిగింది. శనివారానికి ఆ రాష్ట్ర అధికారులు సరిచూసుకోవడంతో న్యాయసంబంధ వ్యవహారం పూర్తిగా ముగిసిందని కిరణ్‌ జవళి వివరించారు.బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో ఇప్పటి వరకు జయలలిత ఆస్తులు, పత్రాలను భద్రపరిచారు. 10,000 చీరలు, 750 జతల చెప్పులు, 27 కిలోల బంగారం, వజ్రాభరణాలు, రత్నాలు, 601 కిలోల వెండి వస్తువులు, 1,672 ఎకరాల వ్యవసాయ భూముల పత్రాలు, నివాసాలకు సంబంధించిన దస్తావేజులు, 8,376 పుస్తకాలు తదితరాలను తీసుకు వెళ్లేందుకు భారీ భద్రతతో అధికారులు ఆరు ట్రంకు పెట్టెలు తీసుకువచ్చారు. న్యాయమూర్తి హెచ్‌ఎన్‌ మోహన్‌ సమక్షంలో వాటిని అధికారులకు అప్పగించారు.
మేమే వారసులం.. మాకే ఆస్తులు అప్పగించాలి. తాము జయలలితకు వారసులమని, ఆ ఆస్తులను తమకే అప్పగించాలని జె.దీపక్, జె.దీప అనే వ్యక్తులు వేసుకున్న అర్జీని కర్ణాటక హైకోర్టు ఇదివరకే కొట్టివేసింది. దాన్ని సవాల్‌ చేస్తూ వారు అత్యున్నత సుప్రీకోర్టులో వేసిన పిటిషన్‌నూ అక్కడి ధర్మాసనం కొట్టేసింది. అక్రమాస్తుల కేసు విచారణకు ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు, ఆస్తులు భద్రపరచడం, సిబ్బంది నియామకం తదితరాలకు సంబంధించి తమిళనాడు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.13 కోట్లు కర్ణాటకకు సమకూరినట్లు కర్ణాటక ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కిరణ్‌ జవళి తెలిపారు.

Read more:Mumbai:మార్చి 22 నుంచి ఐపీఎల్

Related posts

Leave a Comment