చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దు
ముంబై, నవంబర్ 16, (న్యూస్ పల్స్)
Chandra Babu
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ, మహారాష్ట్రలో కార్యక్రమాలను అకస్మాత్తుగా రద్దు చేసుకున్నారు. ఆయన సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విషమించడంతో తన కార్యక్రమాలను చంద్రబాబు రద్దు చేసుకున్నారని అధికారులు తెలిపారు. రామ్మూర్తి నాయుడు హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రామ్మూర్తి నాయుడు కుమారుడే టాలీవుడ్ నటుడు నారా రోహిత్ అని అందరికీ తెలిసిందే. చంద్రబాబు శుక్రవారం నాడు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం అయ్యారు.
ఏపీకి నిధులకు సంబంధించి పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలవాల్సి ఉంది. అనంతరం షెడ్యూల్ ప్రకారం మహారాష్ట్రకు వచ్చి ఎన్నికల ప్రచారంలో సైతం చంద్రబాబు పాల్గొనాలి. కానీ తమ్ముడు రామ్మోహన్ నాయుడు ఆరోగ్యం విషమించినట్లు కుటుంబం నుంచి సమాచారం అందుకున్న చంద్రబాబు తన పర్యటన మధ్యలోనే నిలిపివేసి ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు,అంతకుముందే చిన్నాన్న రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని సమాచారం అందడంతో ఏపీ మంత్రి నారా లోకేష్ హైదరాబాద్ కు బయలుదేరారు. అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని లోకేష్ విజయవాడ నుంచి హైదరాబాద్ కు వచ్చారు.
Ys Sharmila Vs Ys Jagan | చంద్రబాబు అసెంబ్లీకి రానప్పుడు ఎక్కడున్నావ్ షర్మిల ? | FBTV NEWS