cement prices | భారీగా పెరిగిన సిమెంట్ ధరలు | Eeroju news

భారీగా పెరిగిన సిమెంట్ ధరలు

భారీగా పెరిగిన సిమెంట్ ధరలు

ముంబై, అక్టోబరు 8, (న్యూస్ పల్స్)

cement prices

దేశంలో నైరుతి రుతుపవనాల సీజన్‌ ముగిసింది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రుతుపవనాలు తిరోగమించాయి. దీంతో, సిమెంట్‌కు డిమాండ్‌ పెరిగి, సిమెంట్‌ ధరలు కూడా పెరిగాయి.ఈ ఏడాది, నైరుతి రుతపవనాల వల్ల దేశవ్యాప్తంగా మంచి వర్షాలు కురిశాయి. చాలా ప్రాంతాలను వరదలు చుట్టుముట్టాయి. ఆ ప్రత్యక్ష ప్రభావం నిర్మాణ కార్యకలాపాలపై పడింది. సాధారణంగానే వర్షాకాలంలో నిర్మాణ పనులు నిదానంగా సాగుతాయి. ఈ ఏడాది నైరుతి సీజన్‌లో వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల మరింత స్లో అయ్యాయి. ఇప్పుడు, మాన్‌సూన్‌ సీజన్‌ ముగియడంతో దేశంలో నిర్మాణ పనులు మళ్లీ ఊపందుకుంటున్నాయి.

దేశవ్యాప్తంగా నివాస గృహాలు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, అపార్ట్‌మెంట్లు, రహదారులు, కర్మాగారాలు, ప్రభుత్వ ప్రాజెక్టులు వంటివి చురుగ్గా ప్రారంభమయ్యాయి. ఫలితంగా సిమెంట్‌కు డిమాండ్‌ బాగా పెరిగింది.డిమాండ్‌ పెరిగే సరికి, సిమెంట్‌ కంపెనీలు రేట్లను కూడా పెంచాయి. ఈసారి, 50 కిలోల సిమెంట్ బస్తా ధర రూ. 10 నుంచి రూ. 30 వరకు పెరిగింది. పెరిగిన రేట్లు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. దీంతో, వ్యక్తిగత నివాసాల నిర్మాణం నుంచి భారీ ప్రాజెక్టుల వరకు నిర్మాణ వ్యయం పెరుగుతోంది.

ఏ నిర్మాణంలోనైనా సిమెంట్‌ది కీలక పాత్ర. సిమెంటు ధర పెరగడంతో నిర్మాణ వ్యయం పెరిగే పరిస్థితి ప్రతి ఏటా కనిపిస్తోంది.వాస్తవానికి, వేసవి కాలంలో నిర్మాణ కార్యక్రమాలు పీక్‌ స్టేజ్‌లో జరుగుతుంటాయి. అయితే, ఈ సంవత్సరం వేసవిలో మన దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడం, దేశవ్యాప్తంగా ఎన్నికల హడావిడి, ఆ తర్వాత వర్షాకాలం ప్రారంభం కావడంతో దేశంలో కొన్ని నెలల పాటు నిర్మాణ కార్యకలాపాలు మందగించాయి. నిర్మాణ కార్యకలాపాలు స్తబ్ధుగా మారడంతో సిమెంట్ డిమాండ్ కూడా తగ్గింది.

ఇది సిమెంట్ రేట్లపై ప్రభావం చూపింది. ఫలితంగా ఈ ఏడాది ప్రథమార్థంలో సిమెంట్ బస్తా ధర పెంపును అన్ని కంపెనీలు వాయిదా వేశాయిగత వారంలో, స్టాక్ మార్కెట్‌లో భారీ పతనంతో దాదాపు అన్ని సిమెంట్ కంపెనీలు దెబ్బతిన్నాయి. శుక్రవారం (04 అక్టోబర్‌ 2024) సెషన్‌లో… అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్‌ ధర 1.99% పడిపోయింది. అంబుజా సిమెంట్ 1.15%, ACC 1.10% తగ్గాయి. KCP 1.26%, JK సిమెంట్‌ 0.14%, శ్రీ సిమెంట్‌ 1.30%, ఇండియా సిమెంట్స్ 0.90%, JK లక్ష్మి సిమెంట్స్ 1.52%, సాగర్ సిమెంట్స్ 1.25%, ఉదయపూర్ సిమెంట్స్ 2% పడిపోయాయి. అన్ని సిమెంట్‌ షేర్లు నష్టాల్లో క్లోజ్‌ అయ్యాయి.

భారీగా పెరిగిన సిమెంట్ ధరలు

Massively increased current consumption | భారీగా పెరిగిన కరెంట్ వినియోగం | Eeroju news

Related posts

Leave a Comment