డుంబ్రిగుడ మండలంలో నూతనంగా నిర్మించిన 516 ఈ హైవే రోడ్డు నిర్మించిన కొద్ది రోజులకే బీటలు వారుతుండడంతోపాటు బిల్లాపుట్టు బ్రిడ్జి వద్ద రోడ్డు దిగిపోతుండడంతో వాహనదారులు పలు ఇబ్బందులు పడుతున్నారు. బిల్లాపుట్టు, కించుమండ మధ్యలో ఇటీవల నిర్మించిన హైవే రోడ్డు బీటలు వారగా , బిల్లాపుట్టు బ్రిడ్జి వద్ద రోడ్డు దిగబడుతుంది. దీన్ని గమనించకుండా వాహనదారులు ప్రయాణిస్తూ ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉందని వాహనదారులు అంటున్నారు. నిర్మించిన కొద్ది రోజులకే రోడ్డు బీటలు వారుతుండడంతో నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని పలువురు అంటున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Read MoreCategory: Uncategorized
జూన్ 22 న జిఎస్ టి మండలి సమావేశం | GST Council meeting on June 22 | Eeroju news
న్యూఢిల్లీ జూన్ 13 వస్తువులు, సేవల పన్ను(జిఎస్ టి) మండలి జూన్ 22 న సమావేశం కావాలని నిర్ణయించింది. ఈ సమావేశం ఈ ఏడాది తొలి సమావేశం కానున్నది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం తెలిపారు. ఈ 53వ జిఎస్ టి కౌన్సిల్ సమావేశం జూన్ 22న న్యూఢిల్లీలో జరుగనుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. జిఎస్ టి కౌన్సిల్ సాధారణంగా ప్రతి మూడు నెలలకోసారి సమావేశం కావల్సి ఉంటుంది. కానీ 2022 నుంచి ఇప్పటి వరకు కేవలం ఆరు సార్లే సమావేశం అయింది. జరుగనున్న జిఎస్ టి కౌన్సిల్ సమావేశం ఏజెండా ఏమిటన్నది తెలియలేదు. అయితే రాష్ట్ర ఆర్థిక మంత్రులు కొన్ని పరోక్ష పన్నులను కేంద్ర బడ్జెట్ లో చేర్చాలని కోరవచ్చని అనుకుంటున్నారు. బెట్టింగ్ వాటి మీద…
Read Moreకేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ | Kishan Reddy assumed responsibility as Union Minister of Coal and Mines | Eeroju news
న్యూ ఢిల్లీ జూన్ 13 ఢిల్లీ శాస్త్రి భవన్‌లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.దేశంలో విద్యుత్ లేకుండా ఏ పనీ కాదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మోడీ హయాంలో కోతలు లేకుండా విద్యుత్ అందిస్తున్నామన్నారు. అధికంగా బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పిత్తి జరుగుతోందని, విద్యుత్ కోతలు లేకుండా ఉండాలంటే బొగ్గు ఉత్పత్తి పెంచాలన్నారు. మనం ఇతర దేశాల నుంచి బొగ్గు దిగుమతి చేసుకుంటున్నామని, రానున్న రోజుల్లో దిగుమతి తగ్గించి దేశీయంగా ఉత్పత్తి పెంచుదామని, ఖనిజాల అన్వేషణ, తవ్వకాల ద్వారా ఉపాధి కల్పనకు కృషి చేస్తామన్నారు.తెలంగాణ భవన్ బయట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి వందనం సమర్పించారు. ఆ తర్వాత.. అమరవీరుల స్తూపం…
Read Moreరేవ్ పార్టీ నటి హేమకు బెయిల్ | Bail for rave party actress Hema | Eeroju news
హైదరాబాద్ ప్రతినిధి, బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టయిన నటి హేమకు స్థానిక కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది.ఆమె నుంచి డ్రగ్స్‌ను జప్తు చేసుకోలేదని, ఘటన జరిగిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఆమె పార్టీలో పాల్గొన్నట్లు చూపే ఆధారాలను బెంగళూరు నేర నియంత్రణ దళం సీసీబీ, న్యాయవాది కోర్టుకు అందజేశారు. వాదనలను విన్న న్యాయమూర్తి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు.
Read Moreకధువా… జల్లెడ పడుతున్న భద్రతా దళాలు | Kadhua… Sifting security forces | Eeroju news
శ్రీనగర్, జూన్ 13, (న్యూస్ పల్స్) జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడుతున్నారు. రియాసీలో బస్సుపై ఉగ్రదాడి తర్వాత వరుసగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. రంగంలోకి దిగిన భద్రతా బలగాలు సైతం ధీటుగా ఉగ్రదాడులను ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం కాల్పులు జరిపిన ఇద్దరు ఉగ్రవాదులు ఇంటింటికీ వెళ్లి మంచినీళ్లు అడుగుతున్నారు.అయితే, అప్రమత్తమైన గ్రామస్థులు వెంటనే తలుపులు వేసుకుని, అధికారులను అప్రమత్తం చేశారని పోలీసు అధికారి తెలిపారు. గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించిన తర్వాత భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఉగ్రదాడిలో కనీసం ఒక ఉగ్రవాది మరణించారు. మరో ఒక పౌరుడు తీవ్రంగా గాయపడ్డారు. మధ్యాహ్నం కథువాలోని సైదా గ్రామం సమీపంలో దాక్కున్న రెండో ఉగ్రవాదిని ఆర్మీ, పోలీసులతో కలిసి సీఆర్పీఎఫ్ హతమార్చింది. ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు, భద్రతా బలగాలపై…
Read More