China | చైనా బోర్డర్ వరకు ట్రైన్ | Eeroju news

చైనా బోర్డర్ వరకు ట్రైన్

చైనా బోర్డర్ వరకు ట్రైన్ ఇటానగర్, నవంబర్ 23, (న్యూస్ పల్స్) China భారతీయ రైల్వే దాదాపు చైనా సరిహద్దుకు చేరుకోనుంది. ప్రణాళిక దాదాపు ముగిసింది. భారతీయ రైల్వే త్వరలో ఉత్తరాఖండ్ మీదుగా చైనా సరిహద్దు వరకు రైళ్లను నడపనుంది. చంపావత్ జిల్లాలోని తనక్‌పూర్ – బాగేశ్వర్ మధ్య ఈ రైలును నిర్మించనున్నారు. 169 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ సర్వే పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ రైలు మార్గం హిమాలయాలలోని పర్వత ప్రాంతం గుండా వెళుతుంది. ఈ రైలు చైనా సరిహద్దుకు సమీపంలోని పితోర్‌గఢ్ – బాగేశ్వర్‌కు చేరుకుంటుంది.ఈ కొత్త రైల్వే లైన్ చాలా కీలకమని భారత రైల్వే అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే పితోర్‌గఢ్ జిల్లా చైనాతో మాత్రమే కాకుండా నేపాల్ అంతర్జాతీయ సరిహద్దుతో కూడా అనుసంధానించబడి ఉంది. తోనక్పూర్ భారతదేశం-నేపాల్ సరిహద్దులో ఉన్న ప్రాంతం.…

Read More

Modi | మోడీనే టార్గెట్ చేసిన ట్రుడో.. | Eeroju news

మోడీనే టార్గెట్ చేసిన ట్రుడో..

మోడీనే టార్గెట్ చేసిన ట్రుడో.. న్యూఢిల్లీ, నవంబర్ 22, (న్యూస్ పల్స్) Modi కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో స్వార్థంతో భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఖలిస్తానీ ఉగ్రవాది, సిక్కు వేర్పాటు వాది అయిన హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ ఏడాది క్రితం కెనడాలో హత్యకు గురయ్యాడు. ఈ హత్య వెనుక భారత ఏజెంట్ల హత్య ఉందని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపించారు. దీనిని భారత్‌ నాడే ఖండించింది. సాక్షాలు ఉంటే ఇవ్వాలని సూచించింది. ఏడాదిపాటు మౌనంగా ఉన్న కెనడా.. తాజాగా ఈ విషయాన్ని తెరపైకి తెచ్చి.. భారత రాయబారులను విచారణ చేసేందుకు సిద్ధమైంది. వెంటనే అప్రమత్తమైన భారత్‌.. కెనడాలోని భారత రాయబారులను వెనక్కి పిలిపించింది. భారత్‌లోని కెనడా రాయబారులను ఇక్కడి నుంచి బహిష్కరించింది. దీంతో దౌత్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో…

Read More

BSNL | బీఎస్ఎన్ఎల్ వైపు ప్రజల చూపు | Eeroju news

బీఎస్ఎన్ఎల్ వైపు ప్రజల చూపు

బీఎస్ఎన్ఎల్ వైపు ప్రజల చూపు ముంబై, నవంబర్ 22, (న్యూస్ పల్స్) BSNL టారిఫ్‌లను ఖరీదైనవిగా మార్చిన తర్వాత టెలికాం కంపెనీలు నిరంతరం ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ నెల చందాదారుల డేటాను విడుదల చేసింది. ట్రాయ్‌ విడుదల చేసిన డేటాను చూస్తుంటే, జియో, ఎయిర్ టెల్, ఐడియా కంపెనీల పరిస్థితి చాలా దారుణంగా ఉందని స్పష్టమవుతోంది. మరోవైపు ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ లాభపడుతోంది. సెప్టెంబరు నెలలో టెలికాం కంపెనీలు కోటి మందికి పైగా సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నెలలో భారతీ ఎయిర్‌టెల్ 14 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోగా, వోడాఫోన్‌ ఐడియా 15 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాల కంటే ముఖేష్ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ రిలయన్స్ జియో భారీ నష్టాలను…

Read More

Ration cards | 5 కోట్ల రేషన్ కార్డులు రద్దు | Eeroju news

5 కోట్ల రేషన్ కార్డులు రద్దు

5 కోట్ల రేషన్ కార్డులు రద్దు న్యూఢిల్లీ, నవంబర్ 21, (న్యూస్ పల్స్): Ration cards ప్రజా పంపిణీ వ్యవస్థలో ఆధార్, ఈ కేవైసీ వెరిఫికేషన్ విధానాన్ని కేంద్రం తెరపైకి తీసుకువచ్చింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 5.8 కోట్ల నకిలీ రేషన్ కార్డులను కేంద్రం తొలగించింది. అయితే ఇప్పటివరకు దాము 80.6 కోట్ల మందికి లబ్ధి కలిగిస్తున్నామని స్పష్టం చేసింది. ఆహార భద్రత విషయంలో ప్రపంచానికే బెంచ్ మార్క్ లాగా నిలిచామని కేంద్రం స్పష్టం చేసింది. ఇప్పటివరకు 20.4 కోట్ల రేషన్ కార్డులను డిజిటలైజ్ చేసామని వివరించింది. వన్ నేషన్, వన్ రేషన్ కార్డు విధానం ద్వారా దేశంలో ఎక్కడైనా ప్రజలకు రేషన్ తీసుకుని అవకాశాన్ని కల్పించామని కేంద్రం పేర్కొంది. “కోవిడ్ కాలంలో దేశ ప్రజలకు ఉచితంగా బియ్యం ఇవ్వడాన్ని ప్రారంభించాం. కోవిడ్ ముగిసిపోయినప్పటికీ దానిని…

Read More

Pawan kalyan | పవన్ సభలకు పోటెత్తున్న జనం | Eeroju news

పవన్ సభలకు పోటెత్తున్న జనం

పవన్ సభలకు పోటెత్తున్న జనం ముంబై, నవంబర్ 18, (న్యూస్ పల్స్) Pawan kalyan జనసేన అధినేత పవన్ కల్యాణ్ మహారాష్ట్రలో రెండు రోజుల ప్రచారానికి వెళ్లారు. తొలి రోజు మూడు సభల్లో ప్రసంగించారు. తెలుగు మూలాలున్న ఓటర్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ ప్రచారం ప్లాన్ చేశారు. ఆయా జిల్లాలకు ఎన్నికల ఇంచార్జులుగా తెలుగు రాష్ట్రాల నేతలనే నియమించారు. గత నెల రోజులుగా వారు అక్కడ పని చేసుకుంటున్నారు. నాందేడ్ కు విష్ణువర్ధన్ రెడ్డి.. మరఠ్వాడాకు మధుకర్ ఇంచార్జులుగా వ్యవహరిస్తున్నారు. వీరు ఇంచార్జులుగా ఉన్న చోటనే పవన్ ప్రచారం చేస్తున్నారు. ప్రచారానికి వచ్చిన పవన్ కల్యాణ్‌కు ఏపీ బీజేపీ నేతలే స్వాగతం పలికారు. ఆయన ప్రసంగాలు కొద్దిగా మరాఠీతో పాటు తెలుగులోనే సాగాయి. పవన్ ప్రసంగాలకు అక్కడి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది.పవన్…

Read More

Chandra Babu | చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దు | Eeroju news

చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దు

చంద్రబాబు మహారాష్ట్ర పర్యటన రద్దు ముంబై, నవంబర్ 16, (న్యూస్ పల్స్) Chandra Babu ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ, మహారాష్ట్రలో కార్యక్రమాలను అకస్మాత్తుగా రద్దు చేసుకున్నారు. ఆయన సోదరుడు, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు ఆరోగ్యం విషమించడంతో తన కార్యక్రమాలను చంద్రబాబు రద్దు చేసుకున్నారని అధికారులు తెలిపారు. రామ్మూర్తి నాయుడు హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రామ్మూర్తి నాయుడు కుమారుడే టాలీవుడ్ నటుడు నారా రోహిత్ అని అందరికీ తెలిసిందే. చంద్రబాబు శుక్రవారం నాడు ఢిల్లీకి వెళ్లారు. అక్కడ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం అయ్యారు. ఏపీకి నిధులకు సంబంధించి పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలవాల్సి ఉంది. అనంతరం షెడ్యూల్ ప్రకారం మహారాష్ట్రకు వచ్చి ఎన్నికల ప్రచారంలో సైతం చంద్రబాబు పాల్గొనాలి. కానీ తమ్ముడు…

Read More

PM Narendra Modi | 3 దేశాల పర్యటనకు ప్రధాని | Eeroju news

3 దేశాల పర్యటనకు ప్రధాని

3 దేశాల పర్యటనకు ప్రధాని న్యూఢిల్లీ, నవంబర్ 15, (న్యూస్ పల్స్) PM Narendra Modi భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ నవంబర్‌ 16 నుంచి 21 వరకూ మూడు దేశాల్లో పర్యటించనున్నారు. నైజీరియా, బ్రెజిల్తో పాటు గయానా దేశాల్లో పర్యటిస్తారు. నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్‌ టినుబు ఆహ్వానం మేరకు ఆ దేశానికి వెళ్తున్నారు. 16 – 17 తేదీల్లో నైజీరియాలో పర్యటిస్తారు. 17 ఏళ్లలో భారత ప్రధాని నైజీరియాలో పర్యటించడం ఇదే తొలిసారి. పర్యటనలో భాగంగా నైజీరియాలోని భారతీయుల్ని ఉద్దేశించి మోదీ ప్రసంగించే అవకాశం ఉంది. నైజీరిలో భారతీయులు పలు రంగాల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వ్యాపారాల్లోనూ ఉన్నారు. నైజీరియా పర్యటన తర్వాత బ్రెజిల్ వెళ్తారు. నవంబర్ 18, 19 తేదీల్లో బ్రెజిల్‌లోని రియోడిజనీరో నగరంలో జీ-20 సదస్సు జరుగుతుంది. ఈ సమ్మిట్‌లో ప్రధాని మోదీ…

Read More

AP CM | ఢిల్లీకి చంద్రబాబు | Eeroju news

ఢిల్లీకి చంద్రబాబు

ఢిల్లీకి చంద్రబాబు న్యూఢిల్లీ, నవంబర్ 14, (న్యూస్ పల్స్) AP CM ఏపీ సీఎం చంద్రబాబునాయుడు శుక్రవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. చంద్రబాబు పర్యటనకు ఏపీ భవన్ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఢిల్లీ నుంచి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి కూడా చంద్రబాబు వెళ్లే అవకాశం ఉంది. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌లతో చంద్రబాబు సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. అమరావతికి ప్రపంచ బ్యాంకు , ఏడీబి రుణాలపై సంతకాలు జరిగాయి. ముందస్తుగా పనులు ప్రారంభించడానికి అవసరమైన అడ్వాన్సులను విడుదల చేయాలని చంద్రబాబు కోరే అవకాశం ఉంది. ఏపీకి కేంద్రం ఇటీవల పలు రకాల నిధులు, పెట్టుబడుల ప్రకటనలు చేసింది. వాటిని ఫాలో అప్ చేసే అవకాశం ఉంది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని…

Read More

Pakistan | పాకిస్తాన్ లో పెట్రో బాంబు… | Eeroju news

పాకిస్తాన్ లో పెట్రో బాంబు...

పాకిస్తాన్ లో పెట్రో బాంబు… లాహోర్, నవంబర్ 14, (న్యూస్ పల్స్) Pakistan పాకిస్థాన్ ద్రవ్యోల్బణం బంధంలోకి జారిపోతున్నట్లు కనిపిస్తోంది. ఇది అక్కడ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. మరికొద్ది రోజుల్లో పెట్రోల్, హైస్పీడ్ డీజిల్ (హెచ్‌ఎస్‌డి) ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని పాక్ మీడియా ఇటీవల పేర్కొంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పెరగడం, పెట్రోల్‌పై దిగుమతి ప్రీమియం కారణంగా లీటరుకు రూ.4 నుంచి రూ.5 వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్రోల్, హెచ్‌ఎస్‌డి ధరలు బ్యారెల్‌కు సుమారు 1.7డాలర్లు, 4.4డాలర్ల మేర పెరిగాయి. ఇది కాకుండా, పెట్రోల్‌పై దిగుమతి ప్రీమియం బ్యారెల్‌కు దాదాపు 1డాలర్ పెరిగి బ్యారెల్‌కు 9.80డాలర్లకి చేరుకుంది. అయితే హెచ్ఎస్డీ లో ఈ ప్రీమియం బ్యారెల్‌కు 5డాలర్ల స్థాయిలో స్థిరంగా ఉంది.అంతకుముందు అక్టోబర్ 31న ప్రభుత్వం…

Read More

Onion rates hike | ఉల్లి… లొల్లి… | Eeroju news

ఉల్లి... లొల్లి...

ఉల్లి… లొల్లి… ముంబై, నవంబర్ 11, (న్యూస్ పల్స్) Onion rates hike కొంత కాలంగా నిత్యవసర ధరలు కొండెక్కి కూర్చున్నాయి. అసలే అత్తెసరు ఆదాయంతో ఈసురోమంటూ కుటుంబాన్ని ఈదే సామాన్యుడు ఈ పెరిగిన ధరలతో బెంబేలెత్తిపోతున్నాడు. బియ్యం, పప్పు, ఉప్పుల ధరలు అందనంత ఎత్తులో ఉన్నాయి. దీనికి తోడు నిన్నమొన్నటి వరకు కురిసిన వర్షాలకు పంటలు కూడా వరునుడు ఎత్తుకుపోయాడు. దీంతో నిత్యవసర సరుకుల ధరలు మరింత పైపైకి ఎగబాకుతున్నాయి. ఓ పక్క పెరిగిన ధరలతో అల్లాడిపోతుంటే.. మరోవైపు టమాట, ఉల్లి ధరలు కూడా ఠారెత్తిస్తున్నాయి. వారం క్రితం కాస్త పర్లేదు అనేంతగా రూ. వందకు 4 కేజీల వరకు విక్రయించిన వ్యాపారులు హఠాత్తుగా ధరలు పెంచేశారు. కేవలం వారం రోజుల్లోనే రెండు సార్లు ధరలు పైకెగబాకాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా పలు…

Read More