గూగుల్ మ్యాప్ పై కేసు… ముంబై, నవంబర్ 28, (న్యూస్ పల్స్) Google Map ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ఒక కారు ప్రమాదంలో ముగ్గరు మరణించారు. గూగుల్ మ్యాప్స్ చూస్తూ.. కారుని ఒక బ్రిడ్జి మీద నడుపుతుండగా.. అనుకోకుండా ఆ బ్రడ్జి కొంత భాగం లేదు దీంతో కారు బ్రిడ్జి మీద నుంచి అనూహ్యంగా కింద పడింది. ఈ ప్రమాద సమయంలో కారులో ఉన్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదానకి నలుగురు ప్రభుత్వ ఇంజినీర్లు, గూగుల్ మ్యాప్స్ కంపెనీని బాధ్యులుగా చేస్తూ దతాగంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఉత్తర్ ప్రదేశ్ లోని బరేలి – బుడౌన్ సరిహద్దుల వద్ద ఈ కారు ప్రమాదం జరిగింది. ప్రమాదానికి ముందు ఫరుకాబాద్ జిల్లాకు చెందిన సోదరులు నితిన్ (32), అజిత్ (35), వారి స్నేహితుడు.. మెయిన్…
Read MoreCategory: జాతీయం
National
Pawan Kalyan with Modi | ప్రధానమంత్రి మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం | Eeroju news
ప్రధానమంత్రి మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం న్యూఢిల్లీ, నవంబర్ 27, (న్యూస్ పల్స్) Pawan Kalyan with Modi ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న మోదీని పవన్ కల్యాణ్ అక్కడే కలిసి దాదాపు అరగంట పాటు మాట్లాడారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మొన్న ఢిల్లీ వెళ్లి పవన్… మంగళవారం వివిధ కేంద్రమంత్రులతో సమావేశమయ్యారు. ఇవాళ ప్రధానితో సమావేశమయ్యారు. రాష్ట్ర, దేశ రాజకీయాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న సాయానికి ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, చేపట్టాల్సిన ప్రాజెక్టులపై కూడా చర్చించినట్టు సమాచారం. అంతకు ముందు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌తో సమావేశమయ్యారు. ఎర్రచందనం అమ్మకాలు, ఎగుమతుల ప్రక్రియను…
Read MorePAN card | కొత్త పాన్ కార్డుకు క్యాబినెట్ ఆమోదం! | Eeroju news
కొత్త పాన్ కార్డుకు క్యాబినెట్ ఆమోదం! న్యూఢిల్లీ నవంబర్ 26 PAN card ప్రధాని నరేంద్ర మోడీ క్యాబినెట్ ‘పాన్ 2.0’ కార్డును ప్రవేశపెట్టబోతున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ ప్రకటనతో పౌరులు తాము మళ్లీ కొత్త పాన్ కార్డుకు అప్లయ్ చేయాలా? అని ఆలోచిస్తున్నారు. కానీ అలా చేయనవసరం లేదు. మీ ప్రస్తుత పాన్ కార్డు చెల్లుబాటవుతుంది. సిస్టం డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ కోసం ఈ ‘పాన్ కార్డు 2.0’ ను తేబోతున్నారు.కేంద్ర మంత్రి వైష్ణవ్ కొత్త పాన్ కార్డులను ప్రవేశపెడుతున్నామని ప్రకటించినప్పుడు పాన్ కార్డుకు ‘క్యూఆర్ కోడ్’ ను అప్ గ్రేడ్ చేస్తామన్నారు. ప్రభుత్వం తాలూకు ‘డిజిటల్ ఇండియా విజన్’ కు అనుగుణంగా ఈ కొత్త క్యూఆర్ పాన్ కార్డును ప్రవేశపెట్టబోతున్నారు. దీని ద్వారా ‘పాన్’ను కామన్ బిజినెస్ ఐడెంటిఫయ్యర్ గా చేయబోతున్నారు.…
Read MorePriyanka Gandhi Vadra | ప్రచారం నుంచి ఎంపీ వరకు…. ప్రియాంక గాంధీ | Eeroju news
ప్రచారం నుంచి ఎంపీ వరకు…. ప్రియాంక గాంధీ న్యూఢిల్లీ, నవంబర్ 26, (న్యూస్ పల్స్) Priyanka Gandhi Vadra 2 దశాబ్దాల క్రితం గాంధీ – నెహ్రూ కుటుంబం వారసురాలిగా పాలిటిక్స్‌కు పరిచయమైన ప్రియాంక గాంధీ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలో నిలిచి రికార్డు విజయం అందుకున్నారు. కేరళ వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో సమీప అభ్యర్థిపై 3.94 లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. తన సోదరుడు రాహుల్ గాంధీ సాధించిన 3.64 లక్షల ఓట్ల మెజార్టీని దాటేసి చరిత్ర సృష్టించారు. ప్రచారంలో ప్రజలతో నిరంతరం మమేకమవుతూ ‘తానో ఫైటర్’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బలంగా నిలిచాయి. ‘ప్రజా ప్రతినిధిగా ఈ ప్రయాణం కొత్తేమో కానీ.. ప్రజల తరఫున పోరాటం నాకు కొత్త కాదు. 30 ఏళ్లు గృహిణిగా పిల్లల సంరక్షణ,…
Read MoreStates | ప్రతిపక్షాలు లేని రాష్ట్రాలు… | Eeroju news
ప్రతిపక్షాలు లేని రాష్ట్రాలు… ఆ జాబితాలో చేరిన మహారాష్ట్ర ముంబై, నవంబర్ 25, (న్యూస్ పల్స్) States దేశంలోనే మహారాష్ట్ర ఒక్క రాష్ట్రమే కాదు.. ప్రతిపక్ష నాయకుడు లేని రాష్ట్రాల జాబితాలో ఆంధ్ర ప్రదేశ్, గుజరాత్, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, సిక్కిం లాంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో అధికార పార్టీలు భారీ మెజారిటీతో విజయాన్ని నమోదు చేశాయి. మహారాష్ట్ర రాజీకాయాలు గత అయిదు సంవత్సరాలుగా థ్రిల్లర్ సినిమాకు తలపించే విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికలు ముగిసినా కొన్ని తేలని ప్రశ్నలు అలాగే మిగిలిపోయాయి. ఎన్నికల్లో ఆరు ప్రధాన పార్టీలు రెండు కూటములుగా తలపడ్డాయి. అయితే ఎన్నికల ఫలితాలు మాత్రం వార్ వన్ సైడే అన్నట్లు వెలువడ్డాయి. అధికార మహాయుతి పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించింది. ఈ కూటమిలో బిజేపీ, అజిత్…
Read MoreAjit Pawar | వారిద్దరి అధ్యాయం ముగిసినట్టేనా అజిత్ పవార్ మరియు శరద్ పవార్ | Eeroju news
వారిద్దరి అధ్యాయం ముగిసినట్టేనా అజిత్ పవార్ మరియు శరద్ పవార్ ముంబై, నవంబర్ 25, (న్యూస్ పల్స్) Ajit Pawar మహారాష్ట్ర గెలిచింది. జార్ఖండ్ ఓడిపోయింది. మహారాష్ట్రలోనూ సొంతంగా కాదు కదా.. కూటమి పెట్టుకుంటేనే గెలిచింది కదా.. మహారాష్ట్ర గెలుపు పై కొంతమంది వ్యక్తం చేస్తున్న అభిప్రాయం. అది తప్పు కాదు. వారు ఊహించుకున్నట్టుగా తక్కువది కాదు.. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది.మహారాష్ట్ర ఎన్నికల్లో బిజెపి కూటమి గెలిచింది. షిండే మీద వస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టింది. అజిత్ పవార్ బలాన్ని మరోసారి నిరూపించింది. దేవేంద్ర ఫడ్నవిస్ ను మరోసారి ముఖ్యమంత్రిని చేయబోతోంది.. ఇది మాత్రమేనా.. మొన్నటి పార్లమెంటు ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలను మూటగట్టుకున్న బిజెపికి బూస్ట్ ఇచ్చింది. మోడీషా ద్వయానికి శక్తి ఇచ్చింది. అయితే ఇదే ఫలితం మహారాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటిదాకా తిరుగులేని…
Read MorePawan Kalyan | ఢిల్లీ ఎన్నికల్లోనూ బాబు & పవన్ | Eeroju news
ఢిల్లీ ఎన్నికల్లోనూ బాబు & పవన్ న్యూఢిల్లీ, నవంబర్ 25, (న్యూస్ పల్స్) Pawan Kalyan మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ సాధించిన సంచలన విజయానికి కారణాలేమిటన్నదానిపై అందరూ రకరకాలుగా విశ్లేషిస్తున్నారు.అందరూ ఓ కారణం చెబుతున్నారు. అదేమిటంటే ఎన్డీఏ నేతల ప్రచారం. మహారాష్ట్రతో సంంబధం లేకపోయినప్పటికీ పవన్ కల్యాణ్ లాంటి ఎన్డీఏ నేతలు ప్రచారం చేశారు.చంద్రబాబు రెండు రోజుల ప్రచారం ఆయన సోదరుడి మరణం కారణంగా రద్దు అయింది. కానీ ప్రచారానికి మాత్రం సిద్దమయ్యారు. ఇలా కలసికట్టుగా ప్రచారం చేయడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయని ఇక ముందు ఇదే ట్రెండ్ కొనసాగించాలని ఎన్డీఏ కూటమి నిర్ణయించే అవకాశం ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ ఎన్నికల్లో ఎప్పటికప్పుడు స్వీప్ చేస్తున్న బీజేపీ అసెంబ్లీ ఎన్నికల దగ్గరకు వచ్చే సరికి పూర్తిగా వెనుకబడిపోతోంది. గత మూడు సార్లు అరవింద్…
Read MoreChina | చైనా బోర్డర్ వరకు ట్రైన్ | Eeroju news
చైనా బోర్డర్ వరకు ట్రైన్ ఇటానగర్, నవంబర్ 23, (న్యూస్ పల్స్) China భారతీయ రైల్వే దాదాపు చైనా సరిహద్దుకు చేరుకోనుంది. ప్రణాళిక దాదాపు ముగిసింది. భారతీయ రైల్వే త్వరలో ఉత్తరాఖండ్ మీదుగా చైనా సరిహద్దు వరకు రైళ్లను నడపనుంది. చంపావత్ జిల్లాలోని తనక్‌పూర్ – బాగేశ్వర్ మధ్య ఈ రైలును నిర్మించనున్నారు. 169 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ సర్వే పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ రైలు మార్గం హిమాలయాలలోని పర్వత ప్రాంతం గుండా వెళుతుంది. ఈ రైలు చైనా సరిహద్దుకు సమీపంలోని పితోర్‌గఢ్ – బాగేశ్వర్‌కు చేరుకుంటుంది.ఈ కొత్త రైల్వే లైన్ చాలా కీలకమని భారత రైల్వే అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే పితోర్‌గఢ్ జిల్లా చైనాతో మాత్రమే కాకుండా నేపాల్ అంతర్జాతీయ సరిహద్దుతో కూడా అనుసంధానించబడి ఉంది. తోనక్పూర్ భారతదేశం-నేపాల్ సరిహద్దులో ఉన్న ప్రాంతం.…
Read MoreModi | మోడీనే టార్గెట్ చేసిన ట్రుడో.. | Eeroju news
మోడీనే టార్గెట్ చేసిన ట్రుడో.. న్యూఢిల్లీ, నవంబర్ 22, (న్యూస్ పల్స్) Modi కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్వార్థంతో భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఖలిస్తానీ ఉగ్రవాది, సిక్కు వేర్పాటు వాది అయిన హర్‌దీప్ సింగ్ నిజ్జర్ ఏడాది క్రితం కెనడాలో హత్యకు గురయ్యాడు. ఈ హత్య వెనుక భారత ఏజెంట్ల హత్య ఉందని కెనడా ప్రధాని ట్రూడో ఆరోపించారు. దీనిని భారత్ నాడే ఖండించింది. సాక్షాలు ఉంటే ఇవ్వాలని సూచించింది. ఏడాదిపాటు మౌనంగా ఉన్న కెనడా.. తాజాగా ఈ విషయాన్ని తెరపైకి తెచ్చి.. భారత రాయబారులను విచారణ చేసేందుకు సిద్ధమైంది. వెంటనే అప్రమత్తమైన భారత్.. కెనడాలోని భారత రాయబారులను వెనక్కి పిలిపించింది. భారత్‌లోని కెనడా రాయబారులను ఇక్కడి నుంచి బహిష్కరించింది. దీంతో దౌత్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో…
Read MoreBSNL | బీఎస్ఎన్ఎల్ వైపు ప్రజల చూపు | Eeroju news
బీఎస్ఎన్ఎల్ వైపు ప్రజల చూపు ముంబై, నవంబర్ 22, (న్యూస్ పల్స్) BSNL టారిఫ్‌లను ఖరీదైనవిగా మార్చిన తర్వాత టెలికాం కంపెనీలు నిరంతరం ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ నెల చందాదారుల డేటాను విడుదల చేసింది. ట్రాయ్ విడుదల చేసిన డేటాను చూస్తుంటే, జియో, ఎయిర్ టెల్, ఐడియా కంపెనీల పరిస్థితి చాలా దారుణంగా ఉందని స్పష్టమవుతోంది. మరోవైపు ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ లాభపడుతోంది. సెప్టెంబరు నెలలో టెలికాం కంపెనీలు కోటి మందికి పైగా సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నెలలో భారతీ ఎయిర్‌టెల్ 14 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోగా, వోడాఫోన్ ఐడియా 15 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాల కంటే ముఖేష్ అంబానీకి చెందిన టెలికాం కంపెనీ రిలయన్స్ జియో భారీ నష్టాలను…
Read More