– డేంజర్ జోన్ లో ఢిల్లీ న్యూఢిల్లీ, డిసెంబర్ 20, (న్యూస్ పల్స్) దేశ రాజధానిని పొంగమంచు, కాలుష్యం ఇబ్బంది పెడుతున్నాయి. నెల రోజులుగా ఇబ్బంది పడుతున్న ఢిల్లీ వాసులను మూడు రోజులుగా పరిస్థితులు మరింత కష్టంగా, కఠినంగా మార్చాయి. మారిన వాతావరణం, పడిపోతున్న ఉష్ణోగ్రతలు ఊపిరి సడలకుండా చేస్తున్నాయి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం, ఢిల్లీలో మొత్తం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉదయం 7:15 గంటలకు 442 వద్ద నమోదైంది, జాతీయ రాజధానిలోని అనేక ప్రాంతాలు 400 నుంచి 500 మధ్య స్థాయిలను నమోదు చేస్తున్నాయి.పొగ మంచు కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో విజిబిలిటీ 300 మీటర్లకు పడిపోయిన తర్వాత తక్కువ–విజిబిలిటీ విధానాలతో ప్రాంతం అంతటా దృశ్యమానత గణనీయంగా తగ్గింది. ఆనంద్ విహార్ (481), అశోక్ విహార్ (461), బురారీ క్రాసింగ్ (483), మరియు నెహ్రూ…
Read MoreCategory: జాతీయం
National
BJP : బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు రామ్ మాధవా.. కిషనా…
– బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు రామ్ మాధవా.. కిషనా… హైదరాబాద్, డిసెంబర్ 20, (న్యూస్ పల్స్) తెలుగు నేతలకు మరో అరుదైన చాన్స్. బిజెపి జాతీయ అధ్యక్షుడిగా ఇద్దరి పేర్లను పరిగణలోకి తీసుకుంది బిజెపి హై కమాండ్. అయితే ఏపీకి చెందిన నేతకు దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం.బిజెపి జాతీయ అధ్యక్షుడు మారనున్నారు. ప్రస్తుతం జేపీ నడ్డా జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. వచ్చే ఏడాది ఆయన మార్పు అనివార్యంగా తెలుస్తోంది. కొత్త అధ్యక్షుడిని నియమించుకోవాల్సిన అవసరం ఉంది. మరోసారి జెపి నడ్డాకు అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఈ తరుణంలో రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ప్రముఖంగా శివరాజ్ సింగ్ చౌహన్ పేరు వినిపించింది. అయితే ఈసారి దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారని తెలుస్తోంది. బిజెపి దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేకంగా…
Read Moreఈవీఎంల వ్యవహారంపై ఏకాకిగా కాంగ్రెస్
ఈవీఎంల వ్యవహారంపై ఏకాకిగా కాంగ్రెస్ న్యూఢిల్లీ, డిసెంబర్ 20, (న్యూస్ పల్స్) ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ అంటేనే ఓ భారీ కసరత్తు. అటూ ఇటుగా 100 కోట్ల జనాభా పాల్గొనే ఈ ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడం చూసి ప్రపంచ దేశాలే నివ్వెరపోతుంటాయి. ఇదంతా ఒకెత్తయితే.. దేశంలో జరిగే ఎన్నికల్లో గెలిచిన ప్రతిసారీ సంబరాలు చేసుకుని తమ ఘనతగా చాటుకునే కాంగ్రెస్ పార్టీ.. ఓడినప్పుడు మాత్రం ఈవీఎం ‘గోల్‌మాల్’ అంటూ గోల చేస్తోంది. ఆ పార్టీకి ఇది కొత్తేమీ కాదు. కానీ ఈసారి కనీసం మిత్రపక్షాల నుంచి మద్ధతు లభించకపోగా.. కాంగ్రెస్ తీరును తప్పుబడుతూ మిత్రపక్షాలే తలంటేస్తున్నాయి. మొన్న జమ్ము-కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (JKNC), నిన్న తృణమూల్ కాంగ్రెస్ (TMC)లు కాంగ్రెస్ వాదనను తప్పుబట్టాయి. దీంతో ఈవీఎం గోల్‌మాల్ ఆరోపణల విషయంలో…
Read MoreJemili Elections : జేపీసీలో ముగ్గురు ఏపీవాళ్లు
జేపీసీలో ముగ్గురు ఏపీవాళ్లు న్యూఢిల్లీ, డిసెంబర్ 19, (న్యూస్ పల్స్) దేశవ్యాప్తంగా ఇప్పుడు జమిలి ఫీవర్ నడుస్తోంది. ఏకకాలంలో సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలన్నదే జమిలి లక్ష్యం. ఇప్పటికే కేంద్ర క్యాబినెట్ ఆమోదం లభించింది దీనికి. పార్లమెంట్ ఉభయ సభల ముందుకు వచ్చింది జమిలి బిల్లు. అయితే ఈ బిల్లును ఆమోదించాలని భావిస్తున్న కేంద్రం సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. 21 మంది లోక్సభ ఎంపీలు, పదిమంది రాజ్యసభ ఎంపీలతో సహా మొత్తం 31 మందితో జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. లోక్సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించి ఈ కమిటీ పరిశీలించనుంది. అయితే ఈ 31 మంది ఎంపీల్లో .. ముగ్గురు ఏపీకి చెందిన వారు ఉండడం విశేషం. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదనను కేంద్ర న్యాయశాఖ మంత్రి…
Read MoreZakir Hussain : ప్రముఖ తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ కన్నుమూత
ప్రముఖ తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్ కన్నుమూత న్యూ డిల్లీ డిసెంబర్ 16 ప్రముఖ తబలా విద్వాంసుడు ఉస్తాద్ జాకీర్ హుస్సేన్(73) కన్నుమూత. అనారోగ్య కారణాలతో అమెరికా, శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు సోమవారం వెల్లడించారు. తీవ్రమైన గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న హుస్సేన్‌ను అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో ఆసుపత్రిలో చేర్పించారు. గత రెండు వారాలుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఐసీయూకి తరలించినట్లు అతని స్నేహితుడు ఫ్లూటిస్ట్ రాకేష్ చౌరాసియా తెలిపారు. ఈ క్రమంలోనే ఇవాళ తెల్లవారుజామున హుస్సేన్ చనిపోయినట్లు తెలిపారు.కాగా, జాకీర్ హుస్సేన్.. ఆరు దశాబ్దాల పాటు సాగిన తన కెరీర్‌లో అనేక మంది ప్రఖ్యాత భారతీయ, అంతర్జాతీయ కళాకారులతో కలిసి పనిచేశారు. తన కెరీర్‌లో మొత్తం నాలుగు గ్రామీ అవార్డులను అందుకున్నారు. ఈ…
Read MoreGoogle search : 2024 లో గూగుల్ టాప్ 10 సెర్చ్…
2024 లో గూగుల్ టాప్ 10 సెర్చ్… హైదరాబాద్, డిసెంబర్ 11, (న్యూస్ పల్స్) రోజూ గూగుల్‌లో ఏదో ఒక విషయం గురించి సెర్చ్ చేస్తూనే ఉంటాం. కేవలం మనమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఏదో ఒక విషయం గురించి అందరూ సెర్చ్ చేస్తూనే ఉంటారు. పొరపాటున మనకి ఏదైనా సందేహం వస్తే చాలు.. ఒక్క క్షణం ఆలోచించకుండా గూగుల్‌నే అడుగుతాం. కనీసం పక్కన ఎవరు ఉన్నా కూడా వారిని అడగం. ఎందుకంటే గూగుల్ అయితే అసలు తప్పు చెప్పకుండా కరెక్ట్ చెబుతాదని భావిస్తారు. అయితే గూగుల్ ప్రతీ ఏడాది ఎక్కువగా ఏ విషయాలు సెర్చ్ చేశారో విడుదల చేస్తుంది. ఈ ఏడాది మరో 26 రోజుల్లో పూర్తి కావస్తుంది. ఈ క్రమంలో 2024లో ఇండియన్స్ ఎక్కువగా గూగుల్‌లో ఏ విషయాలు గురించి సెర్చ్ చేశారో.. ఆ…
Read Moreఢిల్లీలో పవన్ మ్యూజిక్ పనిచేస్తుందా
ఢిల్లీలో పవన్ మ్యూజిక్ పనిచేస్తుందా న్యూఢిల్లీ, డిసెంబర్ 9, (న్యూస్ పల్స్) బిజెపికి ఇన్నాళ్లకు స్టార్ క్యాంపైనర్ దొరికారు జనసేన అధినేత పవన్ రూపంలో. నిన్నటి మహారాష్ట్ర విజయంలో భాగం పంచుకున్నారు పవన్. అందుకే కీలకమైన దేశ రాజధానిలో జనసేన అధినేతను ప్రయోగించడానికి బిజెపి అగ్ర నేతలు సిద్ధమయ్యారు. మహారాష్ట్ర ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని మహా యూటీ కూటమి ఘన విజయం సాధించింది.ఇక్కడ బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించింది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ సీట్లకు గాను 122 స్థానాల్లో విజయం సాధించింది.కమలం పార్టీ అభ్యర్థులు విజయభేరీ మోగించారు. 59 సీట్లతో ఏక్ నాథ్ షిండే శివసేన రెండో స్థానంలో నిలిచింది. మహారాష్ట్రను 15 నెలల పాటు పరిపాలించిన కాంగ్రెస్, ఎన్సీపీలు వరుసగా మూడు నాలుగు స్థానాలకు పరిమితం అయ్యాయి. జార్ఖండ్లో మాత్రం బిజెపికి ఎదురు…
Read Moreమళ్లీ రైతుల ఆందోళనలు
మళ్లీ రైతుల ఆందోళనలు న్యూఢిల్లీ, డిసెంబర్ 9, (న్యూస్ పల్స్) రైతులు మరోసారి పోరుబాట పట్టారు. గతంలో రైతు చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు ఏడాదిపాటు పోరాటం చేశారు. తాజాగా పంజాబ్, హర్యానా రైతులు మరోమారు ఉద్యమానికి సిద్ధమయ్యారు. న్యాయమైన డిమాండ్ల సాధనే లక్ష్యంగా చలో ఢిల్లీ పేరుతో పాదయాత్రకు సిద్ధమయ్యారు.పంజాబ్, హర్యానా రైతులు మళ్లీ పోరుబాట పట్టారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం దేశ రాజధాని ఢిల్లీ బాట పట్టారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతోపాటు డిమాండ్లు నెరవేర్చాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దులోని శంభుకు చేరుకున్నారు. తాజాగా శంభు, ఖనౌరీ సరిహద్దుల నుంచి రాజధాని ఢిల్లీకి పాదయాత్ర చేయాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. అయితే ఖనౌరి పాయింట్ వద్ద ఉన్న రైతులను ఢిల్లీకి…
Read MoreGoogle Map | గూగుల్ మ్యాప్ పై కేసు… | Eeroju news
గూగుల్ మ్యాప్ పై కేసు… ముంబై, నవంబర్ 28, (న్యూస్ పల్స్) Google Map ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల ఒక కారు ప్రమాదంలో ముగ్గరు మరణించారు. గూగుల్ మ్యాప్స్ చూస్తూ.. కారుని ఒక బ్రిడ్జి మీద నడుపుతుండగా.. అనుకోకుండా ఆ బ్రడ్జి కొంత భాగం లేదు దీంతో కారు బ్రిడ్జి మీద నుంచి అనూహ్యంగా కింద పడింది. ఈ ప్రమాద సమయంలో కారులో ఉన్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదానకి నలుగురు ప్రభుత్వ ఇంజినీర్లు, గూగుల్ మ్యాప్స్ కంపెనీని బాధ్యులుగా చేస్తూ దతాగంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు.ఉత్తర్ ప్రదేశ్ లోని బరేలి – బుడౌన్ సరిహద్దుల వద్ద ఈ కారు ప్రమాదం జరిగింది. ప్రమాదానికి ముందు ఫరుకాబాద్ జిల్లాకు చెందిన సోదరులు నితిన్ (32), అజిత్ (35), వారి స్నేహితుడు.. మెయిన్…
Read MorePawan Kalyan with Modi | ప్రధానమంత్రి మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం | Eeroju news
ప్రధానమంత్రి మోదీతో పవన్ కల్యాణ్ సమావేశం న్యూఢిల్లీ, నవంబర్ 27, (న్యూస్ పల్స్) Pawan Kalyan with Modi ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న మోదీని పవన్ కల్యాణ్ అక్కడే కలిసి దాదాపు అరగంట పాటు మాట్లాడారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మొన్న ఢిల్లీ వెళ్లి పవన్… మంగళవారం వివిధ కేంద్రమంత్రులతో సమావేశమయ్యారు. ఇవాళ ప్రధానితో సమావేశమయ్యారు. రాష్ట్ర, దేశ రాజకీయాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న సాయానికి ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, చేపట్టాల్సిన ప్రాజెక్టులపై కూడా చర్చించినట్టు సమాచారం. అంతకు ముందు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్‌తో సమావేశమయ్యారు. ఎర్రచందనం అమ్మకాలు, ఎగుమతుల ప్రక్రియను…
Read More