ఆపరేషన్ గరుడలో దిమ్మ తిరిగే నిజాలు

ఆపరేషన్ గరుడలో దిమ్మ తిరిగే నిజాలు

ఆపరేషన్ గరుడలో దిమ్మ తిరిగే నిజాలు విశాఖపట్టణం, డిసెంబర్ 10, (న్యూస్ పల్స్) ఈ ఏడాది మార్చిలో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ ‘ఆపరేషన్ గరుడ’ చేపట్టి విశాఖపట్నం పోర్టులో 25 టన్నుల ఇనాక్టివ్ డ్రైడ్ ఈస్ట్‌ ఉన్న కంటైనర్‌ని స్వాధీనం చేసుకుంది.డ్రైడ్ ఈస్టులో డ్రగ్స్ సబ్‌స్టాన్స్ ఉన్నట్లు అనుమానం ఉందని, అందుకే ఈ కంటైనర్‌ని సీజ్ చేసి, కేసు నమోదు చేసినట్లు అప్పుడు సీబీఐ పేర్కొంది.ఎనిమిది నెలల తర్వాత.. అంటే డిసెంబర్ మొదటి వారంలో ఈ కంటైనర్‌లో ఉన్నది కేవలం ఇనాక్టివ్ డ్రైడ్ ఈస్ట్ మాత్రమేనని, డ్రగ్స్ కాదని విశాఖ కోర్టు (నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ కోర్టు)కు సీబీఐ రిపోర్టు అందించింది.దీని ఆధారంగా ఆ కంటైనర్‌ను విడుదల చేసినట్లు విశాఖపట్నం కస్టమ్స్ ప్రిన్సిపల్ కమిషనర్ ఎన్.శ్రీధర్ చెప్పారు.ఈ కంటైనర్‌లోని డ్రైడ్ ఈస్ట్‌లో…

Read More

నాగబాబుకు మంత్రి పదవి

నాగబాబుకు మంత్రి పదవి

నాగబాబుకు మంత్రి పదవి విజయవాడ, డిసెంబర్ 10,(న్యూస్ పల్స్) ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబుకు ఏపీ కేబినెట్ లో చోటు దక్కనుందని సమాచారం. నాగబాబును మంత్రివర్గంలోని తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కూటమి పార్టీల పొత్తుల్లో భాగంగా జనసేనకు 4 మంత్రి పదవులు కేటాయించారు.ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సోదరుడు నాగబాబుకు మంత్రి పదవి దక్కనున్నట్లు సమాచారం. ఆయనకు కేబినెట్‌లో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక నిర్ణయం వెలువడనున్నట్లు సమాచారం. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు… పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తారు. ఇటీవల ఎన్నికల్లో నాగబాబు ఎంపీగా పోటీ చేయాలని భావించినా పొత్తుల్లో పోటీ సాధ్యపడలేదు. దీంతో ఆయనను రాజ్యసభకు పంపుతారనే ప్రచారం జరిగింది. ఏపీలో మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ అవ్వగా…జనసేన నుంచి నాగబాబు…

Read More

బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది

బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది

బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది   మెదక్, డిసెంబర్ 9, (న్యూస్ పల్స్) మొన్నటివరకు ఆ నియోజకవర్గం గులాబీ పార్టీలో అంతా ఆయనే చూసుకున్నారు. ఇప్పడు ఆయన్ని కాదని కొత్త ముఖాన్ని తెరపైకి తెచ్చారు. దాంతో ఆ నియోజకవర్గంలో ఒక్కసారిగా గ్రూపు రాజకీయాలకు తెరలేచింది. మొన్నటివరకు సైలెంట్ గా ఉన్నవారు ఇప్పుడు వైలెంట్‌గా మారి సీనియర్ నేతను టార్గెట్ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం. 2014లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పట్లోళ్ల కిష్టారెడ్డి ఆకస్మిక మరణం తర్వాత 2016లో ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భూపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. దాంతో మొదటిసారి నారాయణఖేడ్ లో బీఆర్ఎస్ జెండా ఎగిరింది. ఆ తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ రెండోసారి బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో…

Read More

ఢిల్లీలో పవన్ మ్యూజిక్ పనిచేస్తుందా

ఢిల్లీలో పవన్ మ్యూజిక్ పనిచేస్తుందా

ఢిల్లీలో పవన్ మ్యూజిక్ పనిచేస్తుందా   న్యూఢిల్లీ, డిసెంబర్ 9, (న్యూస్ పల్స్) బిజెపికి ఇన్నాళ్లకు స్టార్ క్యాంపైనర్ దొరికారు జనసేన అధినేత పవన్ రూపంలో. నిన్నటి మహారాష్ట్ర విజయంలో భాగం పంచుకున్నారు పవన్. అందుకే కీలకమైన దేశ రాజధానిలో జనసేన అధినేతను ప్రయోగించడానికి బిజెపి అగ్ర నేతలు సిద్ధమయ్యారు.  మహారాష్ట్ర ఎన్నికల్లో బిజెపి నేతృత్వంలోని మహా యూటీ కూటమి ఘన విజయం సాధించింది.ఇక్కడ బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించింది. మహారాష్ట్రలో మొత్తం 288 అసెంబ్లీ సీట్లకు గాను 122 స్థానాల్లో విజయం సాధించింది.కమలం పార్టీ అభ్యర్థులు విజయభేరీ మోగించారు. 59 సీట్లతో ఏక్ నాథ్ షిండే శివసేన రెండో స్థానంలో నిలిచింది. మహారాష్ట్రను 15 నెలల పాటు పరిపాలించిన కాంగ్రెస్, ఎన్సీపీలు వరుసగా మూడు నాలుగు స్థానాలకు పరిమితం అయ్యాయి. జార్ఖండ్లో మాత్రం బిజెపికి ఎదురు…

Read More

మళ్లీ రైతుల ఆందోళనలు

మళ్లీ రైతుల ఆందోళనలు

మళ్లీ రైతుల ఆందోళనలు న్యూఢిల్లీ, డిసెంబర్ 9, (న్యూస్ పల్స్) రైతులు మరోసారి పోరుబాట పట్టారు. గతంలో రైతు చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు ఏడాదిపాటు పోరాటం చేశారు. తాజాగా పంజాబ్, హర్యానా రైతులు మరోమారు ఉద్యమానికి సిద్ధమయ్యారు. న్యాయమైన డిమాండ్ల సాధనే లక్ష్యంగా చలో ఢిల్లీ పేరుతో పాదయాత్రకు సిద్ధమయ్యారు.పంజాబ్, హర్యానా రైతులు మళ్లీ పోరుబాట పట్టారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం దేశ రాజధాని ఢిల్లీ బాట పట్టారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతోపాటు డిమాండ్లు నెరవేర్చాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే వేలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దులోని శంభుకు చేరుకున్నారు. తాజాగా శంభు, ఖనౌరీ సరిహద్దుల నుంచి రాజధాని ఢిల్లీకి పాదయాత్ర చేయాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. అయితే ఖనౌరి పాయింట్‌ వద్ద ఉన్న రైతులను ఢిల్లీకి…

Read More

వందే భారత్ స్లీపర్ ,,, రెడీ టూ స్టార్ట్…

vande bharat sleeper train

వందే భారత్ స్లీపర్ ,,, రెడీ టూ స్టార్ట్… చెన్నై, డిసెంబర్ 9, (న్యూస్ పల్స్ఁ0 వందేభారత్‌.. ఈ పేరు ఇప్పటికే భారతీయుల నోళ్లలో నానుతోంది. వేగంగా గమ్యస్థానాలకు ప్రయాణికులను చేర్చాలన్న లక్ష్యంతో రైల్వే వందేభారత్‌ రైళ్లను ప్రవేశపెట్టింది. ఇప్పటికే ఈ అత్యాధునిక రైళ్లు పట్టాలపై పరుగులు పెడుతున్నాయిఅత్యాధునిక సౌకర్యాలతో.. ప్రయాణికులను అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేర్చాలన్న లక్ష్యంతో మేకిన్‌ ఇండియాలో భాగంగా భారత ప్రభుత్వం వందే భారత్‌ రైళ్లను తయారు చేయించింది. మూడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ రైళ్లు ఇప్పటికే దేశమంతా పట్టాలపై పరుగులు పెడుతున్నాయి. అత్యాధునిక సౌకర్యాలు ఉండడంతో చార్జీ కాస్త ఎక్కువైనా ప్రయాణికులు ఇబ్బంది పడడం లేదు. దీంతో వందే భారత్‌ సక్సెస్‌ అయింది. ఈ నేపథ్యంలో ఇండియన్‌ రైల్వే కొత్తగా వందే భారత్‌ స్లీపర్‌ను పట్టాలెక్కించబోతోంది. ఇప్పటి వరరకు వందే భారత్‌…

Read More

అనంతలో జేసీ జగడం

జేసీ ప్రభాకర రెడ్డి

అనంతలో జేసీ జగడం అనంతపురం, డిసెంబర్ 9, (న్యూస్ పల్స్) జేసీ ప్రభాకర రెడ్డి సొంత పార్టీ నేతలకే కాదు.. సొంత సామాజికవర్గం నేతలకు కూడా విలన్ గా మారారు. ఆయన పెట్టుకుంటున్న విభేదాలు ఆయనకు మరింత ఇబ్బందిని తెచ్చి పెడతాయంటున్నారు. అనంతపురం జిల్లాలో జేసీ కుటుంబానికి ఒక హిస్టరీ ఉంది. అదే సమయంలో జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో జేసీ వేలు పెట్టడంతో అనేక మంది సొంత పార్టీ అంటే టీడీపీ నేతలే వ్యతిరేకమయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తమ నియోజకవర్గాల్లో వేలు పెట్టడమేంటని పుటపర్లి, అనంతపురం, రాయదుర్గం, కల్యాణదుర్గం, శింగనమల నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నేతలనే తన శత్రువులుగా మార్చుకున్నారు. అక్కడ తన అనుచరులకు అందం ఎక్కించాలన్న ఆశతో ఆయన అక్కడ ఉన్న అసలైన నేతలకు దూరమయ్యారు. అందుకే గత ఎన్నికల్లో జేసీ కుటుంబానికి కేవలం…

Read More

 కొడాలిపై కేసులు తిరగదోడుతున్న పోలీసులు

kodali nani

 కొడాలిపై కేసులు తిరగదోడుతున్న పోలీసులు విజయవాడ, డిసెంబర్  9, (న్యూస్ పల్స్) వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం బూతులతో విపక్ష నేతలపై చెలరేగిపోయిన మాజీ మంత్రి, గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆదేశాల మేరకు అప్పుడప్పుడూ బయటకు వచ్చి కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నా.. ఆయన మాటల్లో ఇది వరకటి ఫైర్ కనిపించడం లేదు. కేసుల భయంతోనే ఆయన సైలెంట్ అవుతున్నారన్నది ఓపెన్ సీక్రేట్టే. కొడాలి నాని సైలంట్ మోడ్లో ఉన్నంత మాత్రాన మంత్రి నారా లోకేష్ రెడ్‌బుక్ ఛాప్టర్లో ఆయన పేజీ చిరిగిపోలేదని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. కొడాలి నాని అనుచరులను పోలీసులు వరుసగా అరెస్టులు చేస్తున్నారు. అధికారంలో ఉండగా ఆ మాజీ మంత్రి గ్యాంగ్ చేసిన అరాచకాలపై పోలీసులు చర్యలు చేపట్టారు. తాజాగా…

Read More

విక్రాంత్ రెడ్డి కోసం గూగుల్ సెర్చ్…

విక్రాంత్ రెడ్డి

విక్రాంత్ రెడ్డి కోసం గూగుల్ సెర్చ్…   కాకినాడ, డిసెంబర్  9, (న్యూస్ పల్స్) విక్రాంత్‌రెడ్డి. గతంలో ఈ పేరు ఎక్కడా వినిపించలేదు కదా. అటు రాజకీయాల్లో కానీ.. ఇటు ఇతర రంగాల్లో కానీ కనిపించని ఆ వ్యక్తే… YS ఫ్యామిలీకి ఆర్థికవనరు అంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే ప్రస్తుతానికి ఈ పేరు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. కాకినాడ పోర్టులో జరిగిన అవకతవకలపై అంశంపైనే ఈ పేరు బలంగా వినిపిస్తోంది. ఇన్నాళ్లూ ఎక్కడా వినిపించన పేరు కోసం.. కొందరు గూగుల్‌ సెర్చ్ చేశారట. మొత్తానికి విక్రాంత్ రెడ్డి ఎవరనే అంశంపై స్పష్టత వచ్చేసింది. ఆయన TTD మాజీ ఛైర్మన్‌, వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి తనయుడు.అసలు విక్రాంత్‌రెడ్డిపై ఉన్న అభియోగాలు ఏంటో ఓ సారి చూద్దాం. కాకినాడ పోర్టు వ్యవహారంలో కేవీ రావుని బెదిరించటమే కాకుండా… ఆయన్ను…

Read More

ఆస్తుల కోసం మంచు ఫ్యామిలీలో గొడవలు

ఆస్తుల కోసం మంచు ఫ్యామిలీలో గొడవలు

ఆస్తుల కోసం మంచు ఫ్యామిలీలో గొడవలు   తిరుపతి, డిసెంబర్ 9, (న్యూస్ పల్స్) టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీ గా గుర్తింపు తెచ్చుకున్న కుటుంబాలలో మంచు మోహన్ బాబు కుటుంబం కూడా ఒకటి. క్రమశిక్షణకు మారుపేరైన ఈ కుటుంబంలో ఆస్తుల విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుతున్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీనికి తోడు మంచుమనోజ్ )రెండో వివాహం చేసుకోవడం ఇష్టంలేని మంచు విష్ణుదంపతులు కూడా మనోజ్ పెళ్లిలో గెస్ట్ గానే వచ్చి వెళ్ళిపోయారు. దీనికి తోడు మంచు విష్ణు.. మనోజ్ అనుచరుడి పైన దాడి చేసినప్పుడు, ఆ వీడియోని మనోజ్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇద్దరి మధ్య గొడవలు ఉన్నాయని అప్పుడు బహిర్గతం అయింది.అయితే ఇప్పుడు తాజాగా మరో వార్త తెరపైకి వచ్చిన…

Read More