– రణరంగంగా మారిన అసెంబ్లీ హైదరాబాద్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ఆరో రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. వాయిదా తీర్మానంపై బీఆర్ఎస్ నేతలు చర్చకు పట్టుపట్టారు . ఈ ఫార్ములా కార్ రేసింగ్పై చర్చ కోసం బీఆర్ఎస్ నేతలు వాయిదా తీర్మానం ఇచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై అక్రమ కేసు పెట్టారంటూ నల్ల బ్యాడ్జీలతో మండలికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వచ్చారు. సభలో ఫార్ములా- ఈ అంశంపైన వెంటనే సభలో చర్చకు బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. నల్ల బ్యాడ్జీలు, ఫ్లకార్డ్లతో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 420కాంగ్రెస్ ఇచ్చిన బూటకపు హామీలను ప్రశ్నించినందుకే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ఫార్ములా- ఈ పైన కేసు అక్రమం అంటూ ప్లకార్డుల ప్రదర్శన, నినాదాలు చేశారు. దీంతో అసెంబ్లీ రణరంగంగా…
Read MoreCategory: వార్తలు
వార్తలు, news-updates
Charlapalli Railway Station : 28న చర్లపల్లి రైల్వేస్టేషన్ ప్రారంభం
– 28న చర్లపల్లి రైల్వేస్టేషన్ ప్రారంభం హైదరాబాద్, డిసెంబర్ 20, (న్యూస్ పల్స్) చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 28న కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కిషన్‌రెడ్డి దీన్ని ప్రారంభించనున్నారు. దాదాపు రూ.430 కోట్ల వ్యయంతో చర్లపల్లి టెర్మినల్‌ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. ఇక్కడ ప్రయాణికులకు ఉచిత వైఫై సదుపాయం కల్పించనున్నారు.ఇక్కడ ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, ప్రయాణికుల కోసం వెయిటింగ్ ఏసీ, నాన్ ఏసీ హాల్స్, రిజర్వేషన్ కౌంటర్లు, టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రెండు ఎంఎంటీఎస్ ప్లాట్‌ఫాంలతో కలిపి 9 ప్లాట్‌ఫాంలు, 2 ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలు, 6 ఎస్కలేటర్లు నిర్మించారు.చర్లపల్లి టెర్మినల్ ప్రారంభమైన తర్వాత 50 రైళ్లు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించనున్నాయి. ప్రతిరోజూ దాదాపు 50 వేల మంది ప్రయాణికులు రాకపోకలు…
Read MoreDelhi Air Pollution : డేంజర్ జోన్ లో ఢిల్లీ
– డేంజర్ జోన్ లో ఢిల్లీ న్యూఢిల్లీ, డిసెంబర్ 20, (న్యూస్ పల్స్) దేశ రాజధానిని పొంగమంచు, కాలుష్యం ఇబ్బంది పెడుతున్నాయి. నెల రోజులుగా ఇబ్బంది పడుతున్న ఢిల్లీ వాసులను మూడు రోజులుగా పరిస్థితులు మరింత కష్టంగా, కఠినంగా మార్చాయి. మారిన వాతావరణం, పడిపోతున్న ఉష్ణోగ్రతలు ఊపిరి సడలకుండా చేస్తున్నాయి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం, ఢిల్లీలో మొత్తం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉదయం 7:15 గంటలకు 442 వద్ద నమోదైంది, జాతీయ రాజధానిలోని అనేక ప్రాంతాలు 400 నుంచి 500 మధ్య స్థాయిలను నమోదు చేస్తున్నాయి.పొగ మంచు కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో విజిబిలిటీ 300 మీటర్లకు పడిపోయిన తర్వాత తక్కువ–విజిబిలిటీ విధానాలతో ప్రాంతం అంతటా దృశ్యమానత గణనీయంగా తగ్గింది. ఆనంద్ విహార్ (481), అశోక్ విహార్ (461), బురారీ క్రాసింగ్ (483), మరియు నెహ్రూ…
Read MoreBJP : బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు రామ్ మాధవా.. కిషనా…
– బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు రామ్ మాధవా.. కిషనా… హైదరాబాద్, డిసెంబర్ 20, (న్యూస్ పల్స్) తెలుగు నేతలకు మరో అరుదైన చాన్స్. బిజెపి జాతీయ అధ్యక్షుడిగా ఇద్దరి పేర్లను పరిగణలోకి తీసుకుంది బిజెపి హై కమాండ్. అయితే ఏపీకి చెందిన నేతకు దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం.బిజెపి జాతీయ అధ్యక్షుడు మారనున్నారు. ప్రస్తుతం జేపీ నడ్డా జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. వచ్చే ఏడాది ఆయన మార్పు అనివార్యంగా తెలుస్తోంది. కొత్త అధ్యక్షుడిని నియమించుకోవాల్సిన అవసరం ఉంది. మరోసారి జెపి నడ్డాకు అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఈ తరుణంలో రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ప్రముఖంగా శివరాజ్ సింగ్ చౌహన్ పేరు వినిపించింది. అయితే ఈసారి దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వ్యక్తులకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారని తెలుస్తోంది. బిజెపి దక్షిణాది రాష్ట్రాలపై ప్రత్యేకంగా…
Read MorePawan Kalyan : సినిమాల కోసం పవన్ శాఖలు త్యాగం
-సినిమాల కోసం పవన్ శాఖలు త్యాగం హైదరాబాద్, డిసెంబర్ 20, (న్యూస్ పల్స్) గత ఏడాది కాలంగా రాజకీయాలకే పరిమితం అయ్యారు పవన్ కళ్యాణ్.సంక్రాంతికి ఎన్నికల ప్రచారంలోకి దిగిన పవన్.. ఇప్పటివరకు పూర్తిస్థాయిలో సినిమాలపై దృష్టి పెట్టలేదు. ఇప్పుడు నాగబాబు వచ్చిన తరువాత రిలాక్స్ కావాలని భావిస్తున్నారు. మెగా బ్రదర్ నాగబాబు ఎప్పుడు మంత్రివర్గంలోకి వెళ్తారు? ఆయనకు ఇచ్చే శాఖలు ఏంటి? హోంశాఖ ఇస్తారా? సినిమాటోగ్రఫీ శాఖ కేటాయిస్తారా? ఇలా బలమైన చర్చ నడుస్తోంది. మరోవైపు మార్చి వరకు మంత్రి పదవి దక్కే ఛాన్స్ లేదని కూడా ప్రచారం నడుస్తోంది. నేరుగా మంత్రిగా కంటే.. ఎమ్మెల్సీ అయిన తరువాత మంత్రి పదవి ఇవ్వాలని పవన్ పట్టుబడుతున్నట్లు సమాచారం. మరోవైపు నాగబాబు కొద్ది రోజుల్లోనే మంత్రి పదవి తీసుకుంటారని కూడా ప్రచారం నడుస్తోంది. పవన్ కళ్యాణ్ పెండింగ్ సినిమాలపై…
Read Moreఈవీఎంల వ్యవహారంపై ఏకాకిగా కాంగ్రెస్
ఈవీఎంల వ్యవహారంపై ఏకాకిగా కాంగ్రెస్ న్యూఢిల్లీ, డిసెంబర్ 20, (న్యూస్ పల్స్) ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ అంటేనే ఓ భారీ కసరత్తు. అటూ ఇటుగా 100 కోట్ల జనాభా పాల్గొనే ఈ ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడం చూసి ప్రపంచ దేశాలే నివ్వెరపోతుంటాయి. ఇదంతా ఒకెత్తయితే.. దేశంలో జరిగే ఎన్నికల్లో గెలిచిన ప్రతిసారీ సంబరాలు చేసుకుని తమ ఘనతగా చాటుకునే కాంగ్రెస్ పార్టీ.. ఓడినప్పుడు మాత్రం ఈవీఎం ‘గోల్‌మాల్’ అంటూ గోల చేస్తోంది. ఆ పార్టీకి ఇది కొత్తేమీ కాదు. కానీ ఈసారి కనీసం మిత్రపక్షాల నుంచి మద్ధతు లభించకపోగా.. కాంగ్రెస్ తీరును తప్పుబడుతూ మిత్రపక్షాలే తలంటేస్తున్నాయి. మొన్న జమ్ము-కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ (JKNC), నిన్న తృణమూల్ కాంగ్రెస్ (TMC)లు కాంగ్రెస్ వాదనను తప్పుబట్టాయి. దీంతో ఈవీఎం గోల్‌మాల్ ఆరోపణల విషయంలో…
Read Moreysrcp : ఐప్యాక్… పేకప్…
-ఐప్యాక్… పేకప్… విజయవాడ, డిసెంబర్ 20, (న్యూస్ పల్స్) వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు 2019లో అధికారాన్ని తెచ్చిపెట్టిన ఐ ప్యాక్ సంస్థ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్యాకప్ చెప్పేసింది. ఐ ప్యాక్ సంస్థ బీహార్ కు చెందిన ప్రశాంత్ కిషోర్ దే అయినప్పటికీ ఆయన 2019 ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన బీహార్ రాజకీయాలకు పరిమితమయ్యారు. దీంతో ఐప్యాక్ సంస్థలో పనిచేసిన వారు దానిని నిర్వహిస్తున్నారు. 2024 ఎన్నికలకు కూడా వైఎస్ జగన్ మరోసారి గెలిచేందుకు ఐప్యాక్ సంస్థను కొనసాగించారు. ఐప్యాక్ సంస్థకు రుషిరాజ్ నేతృత్వం వహించారు. ఐదేళ్ల పాటు ఐప్యాక్ సంస్థ వైసీపీకి సేవలందించింది. అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచారం వరకూ, సోషల్ మీడియాలో ప్రచారం వరకూ అంతా తానే అయి ఐప్యాక్ సంస్థ జగన్ కు అనుకూలంగా పనిచేసింది ఎన్నికల పోలింగ్ జరిగిన…
Read MoreKCR : కాళేశ్వరం విచారణ-అన్ని వేళ్లు కేసీఆర్ వైపే
– కాళేశ్వరం విచారణ-అన్ని వేళ్లు కేసీఆర్ వైపే హైదరాబాద్, డిసెంబర్ 19, (న్యూస్ పల్స్) కాళేశ్వరం ప్రాజెక్టును కట్టాలన్నది అప్పటి సీఎంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయమేనని, మేడిగడ్డ సహా మూడు బ్యారేజీల ఎంపిక కూడా ఆయనదేనని రిటైర్డ్ చీఫ్ సెక్రెటరీ ఎస్‌కే జోషి స్పష్టం చేశారు. వార్షిక బడ్జెట్‌లో నీటిపారుదల శాఖకు చేసిన కేటాయింపులతో పాటు సప్లిమెంటరీ పేరుతో నిధులు విడుదలయ్యేవన్నారు. భారీ ప్రాజెక్టుకు అవసరమైన ఆర్థిక వనరులు కష్టసాధ్యం కావడంతో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాల్సి వచ్చిందన్నారు. జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని ఎంక్వయిరీ కమిషన్ బుధవారం నిర్వహించిన క్రాస్ ఎగ్జామినేషన్‌లో భాగంగా ఈ విషయాలు వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో తుమ్మిడిహట్టి దగగర ప్రాణహిత ప్రాజెక్టు కట్టాలనే నిర్ణయం జరిగిందని, నీటి లభ్యత లేదని కేంద్ర జల సంఘం ఇచ్చిన…
Read MoreCancer Vaccine : క్యాన్సర్ కు వ్యాక్సిన్
క్యాన్సర్ కు వ్యాక్సిన్… మాస్కో, డిసెంబర్ 19, (న్యూస్ పల్స్) మారుతున్న జీవన శైలి.. ఉరుకుల పరుగుల జీవితం.. ఆహారంలో మార్పుల కారణంగా వ్యాధులు మనల్ని చుట్టుముడుతున్నాయి. కొత్త కొత్త వైరస్‌లు పుట్టుకొస్తున్నాయి. కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులతోపాటు క్యాన్సర్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఒకప్పుడు ఇంటి పంట.. ఇంట్లో వండిన వంటను మాత్రమే తినేవారు. రసాయనాలు లేని పంటలు పండించేవారు. ఎలాంటి విషతుల్యం కాని పాలు తాగేవారు. నిల్వ చేయని మాంసం తినేవారు. దీంతో అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులు తక్కువగా వచ్చేవి. కానీ, మారుతున్న కాలంతో జీవన శైలిలోనూ మార్పులు వస్తున్నాయి. వ్యవసాయంలో రసాయనాల వినియోగం విపరీతంగా పెరిగింది. పాలను రసాయనాలతో నిల్వ చేస్తున్నారు. వాటినే మనం తాగుతున్నాం. ఇక మాసం కూడా ఫ్రీజ్ చేసి అమ్ముతున్నారు. ఇలా అన్ని ఆహార పదార్థాలు కలుషితం…
Read MoreJemili Elections : జేపీసీలో ముగ్గురు ఏపీవాళ్లు
జేపీసీలో ముగ్గురు ఏపీవాళ్లు న్యూఢిల్లీ, డిసెంబర్ 19, (న్యూస్ పల్స్) దేశవ్యాప్తంగా ఇప్పుడు జమిలి ఫీవర్ నడుస్తోంది. ఏకకాలంలో సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలన్నదే జమిలి లక్ష్యం. ఇప్పటికే కేంద్ర క్యాబినెట్ ఆమోదం లభించింది దీనికి. పార్లమెంట్ ఉభయ సభల ముందుకు వచ్చింది జమిలి బిల్లు. అయితే ఈ బిల్లును ఆమోదించాలని భావిస్తున్న కేంద్రం సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. 21 మంది లోక్సభ ఎంపీలు, పదిమంది రాజ్యసభ ఎంపీలతో సహా మొత్తం 31 మందితో జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. లోక్సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించి ఈ కమిటీ పరిశీలించనుంది. అయితే ఈ 31 మంది ఎంపీల్లో .. ముగ్గురు ఏపీకి చెందిన వారు ఉండడం విశేషం. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదనను కేంద్ర న్యాయశాఖ మంత్రి…
Read More