Buffer zone | బఫర్ జోన్ అంటే ఏమిటీ… | Eeroju news

బఫర్ జోన్ అంటే ఏమిటీ.

బఫర్ జోన్ అంటే ఏమిటీ…

హైదరాబాద్, ఆగస్టు 29, (న్యూస్ పల్స్)

Buffer zone

హైదరాబాద్‌ లోని చెరువులు.. కుంటలు.. నాలాల్ని రక్షించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా ఏర్పటు చేసిన సంస్థ హైడ్రా (హైదరాబాద్‌ డిజాస్టర్‌ మేనేజ్‌ మెంట్‌ అండ్‌ ఎసెట్స్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ). తెలంగాణలో ఇప్పుడు ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా హైడ్రా గురించే మాట్లాడుకుంటున్నారు. రెండు నెలలుగా హైడ్రా ఆక్రమణలను తొలగిస్తోంది. ఇప్పటి వరకు 43 ఎకరాలకు పైగా భూమిని రికవరీ చేసింది. కానీ, ప్రముఖ సినీ నటుడు నాగాజ్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చిన తర్వాతనే చాలా మందికి హైడ్రా అంటే తెలిసింది.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఇమేజ్‌ను అమాంతం పెంచేలా చేసింది. ఇప్పటివరకు అధికారంలోకి ఎన్ని ప్రభుత్వాలు వచ్చినప్పటికీ.. వారెవరూ తీసుకోని సాహసోపేతమైన నిర్ణయాల్ని తీసుకుంటూ.. చర్యల్ని చేపట్టిన వైనం చూసినప్పుడు ఎవరో ఒకరు తెగించాలి.. మొత్తం సీన్‌ను మార్చేయాలన్న డైలాగ్‌ గుర్తుకు వస్తుంది. ఇప్పుడా బాధ్యతను రేవంత్‌ రెడ్డి తీసుకున్నారు. చెరువులు.. కుంటల భూముల్లో భారీ భవనాల్ని కట్టేసిన బడా బాబులకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా పేరుతోపాటు.. ఎఫ్‌టీఎల్‌.. బఫర్‌ జోన్‌ అంటూ రెండు మాటలు పదే పదే వినిపిస్తున్నాయి.

ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్‌ అంటే ఎమిటో చాలా మందికి ఇంకా అర్థం కావడం లేదు. ఇంతకూ ఎఫ్‌ టీఎల్‌ అంటే ఏమిటి? బఫర్‌ జోన్‌ అంటే ఏమిటి? రూల్‌ పుస్తకంలో వీటి గురించి ఏముంది? ఈ పరిధిలో ఉండే పట్టా భూమి ఉన్నప్పుడు ఏం చేయాలి? దీనికి నిబంధనలు ఏం చెబుతున్నాయి? అన్న ప్రశ్నలకు సమాధానాల్ని వెతికితే.. సంపూర్ణమైన అవగాహనకు వచ్చే వీలుంది.ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ను ఎఫ్‌టీఎల్‌గా పేర్కొంటారు. అంటే.. చెరువు కట్ట ప్రాంతం. మరింత వివరంగా చెప్పాలంటే.. ఒకర చెరువు నిండు కుండలా ఉన్నప్పుడు.. నీళ్లు ఎక్కడి వరకు వెళుతాయో.. ఆ మొత్తం ప్రాంతాన్ని ఎఫ్‌టీఎల్‌గా పేర్కొంటారు.

మిగిలిన చోట్ల ఎలా ఉన్నా.. హైదరాబాద్‌ మహానగరంలోని పలు ప్రాంతాల్లో చెరువులను ఆనుకొని నిర్మించిన విల్లాలు.. ఇళ్లు.. ప్లాట్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటి వారందరికీ ఇప్పుడు చుక్కలు కనిపించే పరిస్థితి. ఇలాంటి వాటి ఆస్తుల్ని కొనుగోలు చేసే ముందు.. నిర్మాణం ఎఫ్‌టీఎల్‌.. బఫర్‌ జోన్‌ పరిధిలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఆస్తుల్ని కొనకూడదు. ఎందుకుంటే.. ఏదో ఒక రోజు నెత్తి మీదకు తీసుకొచ్చేదే. ఈ మాటకు నిలువెత్తు నిదర్శనంగా సినీ నటుడు నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌. దీని నిర్మాణం ఎఫ్‌టీఎల్‌.. బఫర్‌ జోన్‌.. మిగిలిన పట్టా ల్యాండ్‌లోనూ చేపట్టారు.

ప్రభుత్వానికి చెందిన వివిధ శాఖలు వారు.. ఎన్‌ కన్వెన్షన్‌ నిర్మాణాన్ని అక్రమం అన్న విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో హైడ్రా ఎంట్రీ ఇచ్చేసి.. మొత్తం నిర్మాణాన్ని కూల్చేసింది. ఒకవేళ చెరువుకు సమీపంలో నిర్మాణాన్ని కడితూ నీటిపారుదల శాఖ నుంచి నోఅబ్జెక్షన్‌ పత్రం తీసుకోవాలి. అంతేకాదు.. సంబంధిత మున్సిపల్‌ రెవెన్యూ ఆఫీసర్‌.. జీహెచ్‌ఎంసీ నుంచి క్లియరెన్సు సర్టిఫికేట్‌ తీసుకోవాలి. ఈ మూడింటిలో ఏ ఒక్కటి లేకున్నా.. స్థలాన్ని స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంది. ఈ సందర్భంలో నిర్మాణాన్ని నిర్మించిన వారు కోర్టును ఆశ్రయించినా పెద్దగా ఫలితం ఉండదు.

ఒక బఫర్‌ జోన్‌ అంటే.. నీటి పరివాహక ప్రాంతంగా చెప్పాలి. మరో విధంగా చెప్పాలంటే.. రెండు లేదంటే అంతకంటే ఎక్కువ నీటి వనరులు ఉన్న ప్రాంతాల్ని వేరే చేసే ప్రదేశాన్ని బఫర్‌ జోన్‌ అంటారు. అక్కడ లభించే నీటి వనరు లభ్యత ఆధారంగా బఫర్‌ జోన్‌ పరిధిని డిసైడ్‌ చేస్తారు. ఇవి కూడా ప్రదేశాలను బట్టి.. చెరువులకు అనుగుణంగా బఫర్‌ జోన్‌ పరిధిని నిర్ణయిస్తుంటారు. చెరువుల నుంచి పల్లపు ప్రాంతాలకు నీరు పారటం సహజంగా చోటు చేసుకునేది. దీన్నే అలుగుగా వ్యవహరిస్తుంటారు. చెరువులకు.. పొలాలకు మధ్య ఉన్న ప్రాంతాన్ని బఫర్‌ జోన్‌ అంటారు.

ఉస్మాన్‌ సాగర్‌ కింద ఉన్న భూములన్నీ బఫర్‌ జోన్‌ కిందకే వస్తాయి. ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాల్ని చేపట్టకూడదు. రూల్‌ బుక్‌లో పేర్కొన్న దాని ప్రకారం.. ఎఫ్‌టీఎల్‌ పరిధి నుంచి 30 మీటర్లు.. అంటే, వంద అడుగుల వరకు ఎలాంటి నిర్మాణాల్ని నిర్మించకూడదు. అయితే.. సదరు చెరువు 25 హెక్టార్లు అంతకు మించి విస్తీర్ణంలో ఉంటే 30 మీటర్ల మేరకు ఎలాంటి నిర్మాణం కట్టకూడదు. కావాలంటే.. బఫర్‌ జోన్‌ ప్రాంతంలో వ్యవసాయం చేసుకోవచ్చు.

బఫర్ జోన్ అంటే ఏమిటీ.

 

Unchanged hotels in Hyderabad | హైదరాబాద్ లో మారని హోటల్స్… | Eeroju news

Related posts

Leave a Comment