రాష్ట్ర వ్యాప్తంగా పాఠ్య పుస్తకాల పంపిణీకి బ్రేక్..? బుక్స్ వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆదేశాలు | Break for the distribution of textbooks across the state..? The education department orders to take back the book | Eeroju news

హైదరాబాద్

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్య పుస్తకాల పంపిణీ కొత్త గందరగోళానికి దారి తీసింది. రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం పాఠశాలలు పున: ప్రారంభం కావడంతో ఆయా జిల్లాల్లో అధికారులు, ఉపాధ్యాయులు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్య పుస్తకాలు వాటితో పాటు వర్క్ బుక్‌లను కూడా పంపిణీ చేశారు. ఈ క్రమంలోనే పుస్తకాల్లో ప్రచురణకు సంబంధించి కొత్త వివాదం తలెత్తింది.

పుస్తకాల్లోని మొదటి పేజీలో ఉండే ముందుమాట మార్చుకుండానే విద్యాశాఖ పుస్తకాలను ముద్రించినట్లుగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఆ విషయం కాస్త వివాదాస్పదం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పుస్తకాల పంపిణీని నిలిపివేసి, ఇప్పటి వరకు పంపిణీ చేసిన పుస్తకాలను కూడా వెనక్కి తీసుకోవాలని విద్యాశాఖ ఆయా జిల్లాల డీఈవోలకు సమాచారం అందజేసింది.

Related posts

Leave a Comment