Brahmotsavam from October 4 | అక్టోబరు 4 నుంచి బ్రహ్మోత్సవాలు | Eeroju news

Brahmotsavam from October 4

అక్టోబరు 4 నుంచి బ్రహ్మోత్సవాలు

తిరుమల, ఆగస్టు 21 (న్యూస్ పల్స్)

Brahmotsavam from October 4

తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు నవహ్నిక సాలకట్ల వాలను వైభవంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం అంకురార్పణతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు ఉంటాయి.

వాహన సేవల వివరాలు :

4 అక్టోబర్‌ 2024: సాయంత్రం 5:45 నుంచి 6 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 9  గంటలకు పెద్ద శేష వాహనం.
5 అక్టోబర్‌ 2024: ఉదయం 8  గంటలకు చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు స్నపనం, రాత్రి 7 గంటలకు హంస వాహనం సేవ ఉంటుంది.
6 అక్టోబర్‌ 2024: ఉదయం 8 గంటలకు సింహ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు ముత్యపు పందిరి వాహనంలో శ్రీనివాసుడు ఊరేగనున్నాడు.
7 అక్టోబర్‌ 2024: ఉదయం 8 గంటలకు కల్పవృక్షం వాహనం, మధ్యాహ్నం 1 గంటకు స్నపనం, రాత్రి 7 గంటలకు సర్వ భూపాల వాహనంపై దర్శనమియ్యనున్నాడు.
8 అక్టోబర్‌ 2024: ఉదయం 8 గంటలకు మోహినీ అవతారం, సాయంత్రం 6:30 నుంచి రాత్రి 11:30 గంటల వరకు గరుడ వాహన సేవ ఉంటుంది. దీని కోసం తిరుమల దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
9 అక్టోబర్‌ 2024: ఉదయం 8 గంటలకు హనుమంత వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం, రాత్రి 7 గంటలకు గజ వాహనంపై అభయం ఇవ్వనున్న శ్రీనివాసుడు.
10 అక్టోబర్‌ 2024: ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనం ఉంటుంది.
11 అక్టోబర్‌ 2024: ఉదయం 7 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహన సేవ ఉంటుంది.
12 అక్టోబర్‌ 2024: ఉదయం 6 నుంచి 9 వరకు చక్రస్నానం,  రాత్రి 8:30 నుంచి 10:30 వరకు ద్వాజావరోహణంతో వేడుకలు ముగుస్తాయి.

Brahmotsavam from October 4

 

Gokulashtami Asthanam on 27th August and Utlotsavam on 28th in Tirumala | తిరుమలలో ఆగస్టు 27న గోకులాష్టమి ఆస్థానం, 28న ఉట్లోత్సవం | Eeroju news

Related posts

Leave a Comment