సిద్దిపేట జూన్ 13
అత్యవసర పరిస్థితుల్లో మరొకరి ప్రాణం పోసేది రక్తదానం. దీనిని కృత్రిమంగా ఉత్పత్తి చేయడం సాధ్యపడదు. రక్తదానం ఒక పవిత్ర కార్యo. పోయిన ప్రాణాలను మనము ఎలాగో తీసుకురాలేము. చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడే ప్రాణాలను ఒక్కోసారి సాటి మనిషి రక్తముతో కాపాడగల ము. ఇది రక్త దానము తోనే సాధ్యం. పుట్టినరోజులు, పెళ్లిరోజులు చేసుకుంటూ బంధుమిత్రులకు విందు ఇవ్వడం కంటే ఇలాంటి రోజులలో రక్తదానం చేయడం గొప్ప సంతృప్తినిస్తుంది. అయితే దురదృష్టవశాత్తు రక్తదానంపై ప్రజలలో ఇంకా సరైన అవగాహన లేదు. ఎన్నో అపోహలు వెంటాడుతున్నాయి.
రక్తదానం విషయంలో స్త్రీ పురుషుల అన్న తేడా లేదు. ఇద్దరూ రక్తదానానికి అర్హులే. అయితే కారణాలు ఏమైతేనేం రక్తదానం విషయంలో ఒక్క మన దేశంలోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా కూడా స్త్రీలు కొంతవరకు ముందుకు రావటం లేదు. ఈ పరిస్థితి ఇలా ఉంటే ప్రపంచంలోని దాదాపు 13 దేశాలలో స్త్రీలు చేసిన రక్తదానం, పురుషుల రక్తదాన స్థాయిని మించి పోయింది. ఉదాహరణకు స్త్రీల రక్తదానం జింబాబ్వేలో 54.9 శాతముగా, Thailand 51.6 శాతముగా, Republic మోల్డోవా లో 71%, జార్జియాలో 57.2% న్యూజిలాండ్ లో 51.6% గా, అమెరికాలో 50.1% గా ఎస్టోనియాలో 50.2%, అజర్బైజాన్ లో 59.8% గా ఉంది. ఈ దేశాలలో రక్తదానం విషయంలో స్త్రీలు చూపిస్తున్న చొరవ, ఉత్సాహాన్ని ప్రపంచంలోని పలు దేశాలు ఆదర్శంగా తీసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా మనదేశంలో ఈ విషయంలో ఉన్న అపోహలను తొలగించడం ద్వారానే ఫలితాలు లభిస్తాయి అని చెప్పాలి.
మన దేశములో రక్తదాన ఉద్యమంలో ఆశించినస్థాయిలో పాల్గొనకపోవడనికి ఒక కారణం రక్తహీనత. సరైన పోషకాహారం అందకపోవటం వల్ల రక్తహీనత అనే సమస్య కలుగుతున్నది.స్త్రీలలో ప్రకృతికి సంబంధించిన మరో అంశం కూడా రక్తహీనతకు దారి తీస్తున్నది. స్త్రీల నెలసరి లో రక్తం కోల్పోవడం కూడా రక్తహీనతకు దారి తీస్తున్నది. అలాగే ప్రసవ సమయంలో స్త్రీలు దాదాపు 700 మిల్లీ లీటర్ల వరకు రక్తాన్ని కోల్పోతున్నట్లు నిపుణులు తున్నారు.ఇలాంటి కారణాలు ఉన్నప్పటికీ పురుషులతో పాటు స్త్రీలు కూడా సమానంగా రక్తదాన ఉద్యమంలో పాల్గొనటానికి అవకాశం ఉన్నట్లు ప్రపంచంలోని అనేక దేశాలు రుజువు చేస్తున్నాయి. ఆరోగ్యవంతులైన వ్యక్తులు ప్రతి మూడు నెలలకొకసారి రక్తదానం నిరభ్యంతరంగా చేయవచ్చు. స్త్రీలు కనీసం సంవత్సరానికి ఒకసారైనా రక్తదానం చేయడానికి ముందుకు వస్తే మరో ప్రాణాన్ని బతికించిన వారవుతారు.
ఇటీవల పలు కళాశాలల్లో ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు నిర్వహిస్తున్న రక్తదాన శిబిరాల లో విద్యార్థిని, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనడం కొంతవరకు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నది. అలాగే వివిధ సంస్థలు ముఖ్యంగా సాఫ్ట్ వేర్ సంస్థల్లోని మహిళా ఉద్యోగులు కూడా రక్తదానo కోసం ముందుకు వస్తుండటం ఆహ్వానించదగ్గ పరిణామం.