తెలంగాణ బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారు? ఈ నియామకం ఎప్పుడు జరుగుతుంది? అనేది ఆశావహులతో పాటు బీజేపీ సీనియర్ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు తెలంగాణ బీజేపీ స్టేట్ ఇంఛార్జ్ సునీల్ బన్సల్ స్వయంగా రంగంలోకి దిగడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది.
బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎవరు..
హైదరాబాద్, జనవరి 6
తెలంగాణ బీజేపీలో రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తారు? ఈ నియామకం ఎప్పుడు జరుగుతుంది? అనేది ఆశావహులతో పాటు బీజేపీ సీనియర్ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు తెలంగాణ బీజేపీ స్టేట్ ఇంఛార్జ్ సునీల్ బన్సల్ స్వయంగా రంగంలోకి దిగడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సునీల్ బన్సల్ ఆ పార్టీ నేతలతో భేటీ కానున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో పాటు బీజేపీ నేతలతో సునీల్ బన్సల్ వరుసగా భేటీ కావడం బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంపై ఆసక్తిని రేపుతోంది. తెలంగాణలో బీజేపీ గెలుపే లక్ష్యంగా జాతీయ నాయకత్వం ప్రణాళికలు రచిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని జాతీయ నాయకత్వం యోచిస్తోంది.ఆదివారం ఉదయం నుండి కూడా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్.. వరుసగా తెలంగాణ బీజేపీ నేతలతో సమావేశం అవుతున్నారు. జాతీయ నాయకత్వం స్వయంగా తెలంగాణపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. బూత్ కమిటీల నుండి రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక వరకు పూర్తిగా తమ కనుసన్నల్లోనే నియామకం జరిగే విధంగా ప్రణాళికలు రచించారు. ఇప్పటికే బూత్ కమిటీలు పూర్తవగా, మండల కమిటీలు దాదాపుగా అన్ని జిల్లాల్లో పూర్తి కావస్తోంది. జిల్లా కమిటీలు కూడా నియమించుకోనున్నారు.గత మూడు రోజులుగా జిల్లాలకు వెళ్లి రాష్ట్ర నాయకత్వం అక్కడ మండల కమిటీలను పూర్తి చేసింది. జిల్లా అధ్యక్షుల ఎంపికపైన కూడా కసరత్తు నడుస్తోంది. ఇదే అంశంపై సునీల్ బన్సల్ ఆయా జిల్లాల ముఖ్య నేతలతో సమావేశం అవుతున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుంది అనే అంశంపై అభిప్రాయాలు సేకరణ చేస్తున్నారు. ప్రతి జిల్లా నుంచి మూడు పేర్లు తీసుకుని, జిల్లా అధ్యక్షుడిగా ఒకరిని ఫైనల్ చేయనున్నారు.వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ.. అందుకు అనుగుణంగా సంస్థాత నిర్మాణం మొదలు పెట్టింది. ముఖ్యంగా 2025లో తీసుకునే నిర్ణయాలు వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో.. కచ్చితమైన నిర్ణయాలు తీసుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది బీజేపీ అగ్ర నాయకత్వం. చిన్న స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పదవులు భర్తీ చేయనుండగా.. వ్యక్తుల ఎంపికపై ప్రత్యేకంగా దృష్టి సారించారు సునీల్ బన్సల్. జిల్లా, మండల అధ్యక్షుల ఎంపికపైనా జాతీయ నాయకత్వం ఫోకస్ పెట్టిందంటే.. ఏ స్థాయిలో తెలంగాణ నాయకత్వంపై బీజేపీ హైకమాండ్ దృష్టి సారించిందో అర్థం చేసుకోవచ్చు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డ, సునీల్ బన్సల్, ఎన్నికల ఇంచార్జ్ అరవింద్ మీనన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రశేఖర్ తివారీలు.. పార్టీ నేతలతో సమావేశం అవుతున్నారు. జిల్లా అధ్యక్షుల ఎంపిక పూర్తి కాగానే, రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపైనా దృష్టి సారించనున్నారు. ఇప్పటికే దానిపై అభిప్రాయ సేకరణ మొదలైనట్లు తెలుస్తోంది. ఈటల రాజేందర్, బండి సంజయ్, అరవింద్, రఘునందన్ రావు, రామచందర్ రావు, మనోహర్ రెడ్డి పేర్లు బీజేపీ అధ్యక్షుడి రేసులో వినిపిస్తున్నాయి.
Read:Hyderabad: ఒత్తిడి నుంచి బయిట పడేదెలా.. రేవంత్ వ్యూహం ఏమిటీ