Bhupalpalli:మహాశివరాత్రి ఏర్పాట్లు చేయండి. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

District Collector Rahul Sharma

Bhupalpalli:మహాశివరాత్రి ఏర్పాట్లు చేయండి. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ: మహా శివరాత్రి సందర్బంగా కాళేశ్వరం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు క్షలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు.గురువారం ఐడిఓసి కార్యాలయంలో మహాశివరాత్రి వేడుకలపై దేవాదాయ, రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, ఆర్ డబ్ల్యూఎస్, వైద్య, ఇరిగేషన్,మత్స్య, విద్యుత్, ఆబ్కారీ, సింగరేణి, ఆర్టీసీ తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

మహాశివరాత్రి ఏర్పాట్లు చేయండి.

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.

జయశంకర్ భూపాలపల్లి,

మహా శివరాత్రి సందర్బంగా కాళేశ్వరం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు క్షలుగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు.గురువారం ఐడిఓసి కార్యాలయంలో మహాశివరాత్రి వేడుకలపై దేవాదాయ, రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, ఆర్ డబ్ల్యూఎస్, వైద్య, ఇరిగేషన్,మత్స్య, విద్యుత్, ఆబ్కారీ, సింగరేణి, ఆర్టీసీ తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీన కాళేశ్వర శ్రీ ముక్తేశ్వర స్వామి దేవాలయంలో జరిగే మహా శివరాత్రి వేడుకలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నదని అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. మహా శివరాత్రి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు దేవాలయాలను దర్శించుకునే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ నియంత్రణ, పరిశుభ్రమైన త్రాగునీటి సరఫరా, వైద్యం, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులకు సూచించారు. భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ఆలయ ప్రాంగణాల్లో పారిశుధ్య పనులు క్రమం తప్పకుండా నిర్వహించాలని పేర్కొన్నారు. కుంభాభి షేకం మహోత్సవాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు బాగా చేశారని సంబంధిత శాఖల అధికారులను, సిబ్బందిని అభినందించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని, అత్యవసర సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా నియంత్రణ చేయాలని, ప్రమాద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలని, అలాగే గజ ఈతగాళ్ళు ను అందుబాటులో ఉంచాలని సూచించారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున మన డిపో నుండే కాకుండా ఇతర డిపోల నుండి అధికంగా బస్సులు నడపాలని డిఎం కు సూచించారు. సింగరేణి సంస్థ ద్వారా రెస్క్యూ టీము ఏర్పాటు చేయాలని తెలిపారు. పండుగ రోజుల్లో 48 గంటలు మద్యం విక్రయాలు నిలుపుదల చేయాలని, పటిష్ట పర్యవేక్షణ చేయాలని ఆబ్కారీ అధికారు లను ఆదేశించారు. తాత్కాలిక. మరుగుదొడ్లు,భక్తులు బట్టలు మార్చుకునే గదులు ఏర్పాటు చేయాలని ఇరిగేషన్ అధికారు లను ఆదేశించారు. అభిషేకం దర్శన సమయంలో భక్తులు క్రమ పద్ధతి పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. దేవాలయాన్ని విద్యుద్దీ కరణ, పూలతో ముస్తాబు చేయాలని దేవస్థానం అధికారులకు సూచించారు. వాహనాలు క్రమబద్దీకరణకు పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసి నిర్దేశించిన ప్రాంతంలో భక్తులు వాహనాలు నిలుపుదల చేయు విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పటిష్ట పోలిస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. అనంతరం మహా శివరాత్రి గోడ పత్రికను ఆవిష్కరించారు.ఈ సమావేశంలో సింగరేణి జిఎం రాజేశ్వర రెడ్డి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిపిఓ నారాయణ రావు, విద్యుత్ శాఖ ఎస్ ఈ మల్చూర్ నాయక్, మత్స్య శాఖ అధికారి అవినాష్, దేవస్థానం ఈఓ మహేష్ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Read more:Bhadradri:ఇల్లందు డిపో చెత్త బస్సులు.. ప్రయాణికుల బేజారు..

Related posts

Leave a Comment