Bhole Baba Properties | 100 కోట్ల భోలే బాబా | Eeroju news

Bhole Baba

100 కోట్ల భోలే బాబా

న్యూడిల్లీ, జూలై 6, (న్యూస్ పల్స్)

Bhole Baba Properties

యూపీలోని హాథ్రస్ జిల్లాలో జూలై 2న భోలే బాబా నిర్వహించిన సత్సంగ్ లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం విధితమే. ఇంకా అనేకమంది తీవ్రగాయాల పాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల కుటుంబాలు ఇప్పటికీ గుండెలవిసేలా రోధిస్తున్నాయి. తల్లిదండ్రుల్ని పోగొట్టుకున్న పిల్లలు, పిల్లల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులు.. అనాధలుగా మిగిలారు. తాజాగా బాధిత కుటుంబాలను కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ పరామర్శించారు.

ఈ ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరుగుతున్నదని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. అయితే.. ఘోర దుర్ఘటనకు కారణమైన భోలే బాలా అలియాస్ సూరజ్ పాల్ సింగ్ అలియాస్ నారాయణ్ సాకార్ ఎక్కడున్నాడో ఇంతవరకూ పోలీసులకు తెలియలేదు. భోలే బాబా ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు ఘటనకు బాధ్యుల్ని చేస్తూ.. ఆరుగురిని అరెస్ట్ చేశారు. తాజాగా భోలే బాబా ఆస్తులకు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఆయన ఆస్తులు, విలాసాలపై ఒక నేషనల్ మీడియా వెల్లడించిన విషయాలు చూస్తే.. ఎవ్వరికైనా దిమ్మతిరగాల్సిందే.ఆశ్రమంలోని విశ్వసనీయ వర్గాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. భోలే బాబాకు దేశంలో 2 ఆశ్రమాలున్నట్లు గుర్తించారు. దేశవ్యాప్తంగా ఉన్న ఆస్తుల విలువ రూ.100 కోట్ల పైమాటే. సెక్యూరిటీ విషయానికొస్తే.. ప్రజల్లోకి వచ్చేటపుడు 16 మంది వ్యక్తిగత సిబ్బంది ఉంటారు. ఆయన కారుకు ముందు 350 సీసీ బైక్ లపై వెళ్తూ.. రూట్ క్లియర్ చేస్తారు. ఆయన వెనుక 5 నుంచి 30 కార్లతో కాన్వాయ్ ఉంటుంది.మెయిన్ పురిలో ఉన్న ఒక ఆశ్రమంలోనే భోలే బాబా నివాసం.

ఆ ఆశ్రమాన్ని హరినగర్ గా పిలుస్తారు. సుమారుగా 13 ఎకరాల్లో నిర్మించారు. భోలే బాబా, అతని భార్య కోసం 6 విలాసవంతమైన గదులుంటాయట. ఆశ్రమం ఎంట్రన్స్ లో దానికి వారాళాలిచ్చిన 200 మంది భక్తుల పేర్లు కనిపిస్తాయని.. రూ.10 వేల నుంచి రూ.2.5 లక్షల వరకూ విరాళమిచ్చిన దాతలపేర్లను రాయించారని సమాచారం. ఇదిలా ఉంటే.. ఇటావాలో మరొక ఆశ్రమ నిర్మాణం కూడా చేపట్టారు. ఇంకా తవ్వితే భోలే బాబాకు ఎన్ని ఆస్తులున్నాయో, ఎంతమంది బినామీలుగా ఉన్నారో, ఆయన ఎవరికి బినామీగా ఉన్నారో కూడా తెలిసే అవకాశాలు లేకపోలేదు.

 

Bhole Baba

 

 

We are working for the welfare of construction workers MLA Bolishetti guarantee | భవననిర్మాణ కార్మికుల సంక్షేమానికి కృషిచేస్తా | Eeroju news

Related posts

Leave a Comment