మణుగూరు మున్సిపాలిటీ ,మండలంలో గంజాయి, డ్రగ్స్ దందా జోరుగా సాగుతున్నది మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో మండలంలో మారుమూల పల్లెలో కూడా గంజాయి ,డ్రగ్స్ క్రయవిక్రయాలు జరుగుతున్నాయి.
మణుగూరులో గంజాయి దందా.
కొమ్ముగూడెం ,కొత్త కొండాపురంలో జోరుగా విక్రయాలు
ప్రాణాలు కోల్పోతున్న యువత..
భయోందాలను లో తల్లిదండ్రులు..
భద్రాద్రి
మణుగూరు మున్సిపాలిటీ ,మండలంలో గంజాయి, డ్రగ్స్ దందా జోరుగా సాగుతున్నది మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో మండలంలో మారుమూల పల్లెలో కూడా గంజాయి ,డ్రగ్స్ క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. మారుమూల పల్లెల్లో కూడా గంజాయి సరఫరా చేయబడుతుంది. ప్రధానంగా గోదావరి పరిహార ప్రాంత గ్రామాలలో అమాయకులైన యువకులు బలవుతున్నారు రెండు రోజుల క్రితం కొమరం దిలీప్(18) అనారోగ్యంతో మరణించాడు మొదట డ్రగ్స్ తీసుకున్న కొంతకాలానికి మెదడులో నరాలు దెబ్బతిన్నాయని దాని కారణంగా పిట్స్ కూడా వచ్చాయని తల్లిదండ్రులు తెలిపారు అనంతరం సీరియస్ కావడంతో భద్రాచలం ప్రభుత్వ డాక్టర్ల సలహా మేరకు తరలించారు మెరుగైన వైద్యం కొరకు హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు వైద్యం పొందుతూ దిలీప్ కుమార్ మరణించాడు అతనికి ఊపిరితిత్తులు ఇతర అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని డాక్టర్లు తెలిపారని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా ఏడ్చారు గత కొంతకాలంగా తరచూ మత్తులో ఉండేవాడని ఇంట్లో ఎవరైనా మందలించిన విచిత్రంగా ప్రవర్తించేవాడని తండ్రి శ్రీను తెలిపాడు ఈ విషయంపై క్షేత్రస్థాయిలో పరిశీలించగా కొమ్ముగూడెం ,కొత్త కొండాపురం గ్రామాలలో, మణుగూరు లోని ఇతర ప్రాంతాలలో బెల్ట్ షాపుల పేరుతో గంజాయి, ఇతర డ్రగ్స్ విపరీతంగా విక్రయం చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు పక్కనే ఉన్న శివాలయంలో రాత్రి బస చేసే కొందరు స్వాములు విక్రయిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు అంతేకాకుండా గోదావరి ఆవలి వడ్డున ఉన్న చతిస్గడ్ మరి ఇతర ప్రాంతాల నుంచి నిత్యం సరకు సరఫరా కొనసాగుతుందని కొందరు యువకులు పేర్కొన్నారు కొందరు వికలాంగులు ట్రై మోటార్స్ సైకిల్ వాహనాల ద్వారా బెల్ట్ షాపులకు కొన్ని షాపుల పేరుతో నడిపే వారికి చేరవేస్తున్నారని సమాచారం , డ్రగ్స్ , గంజాయి వ్యాపారంగా జోరుగా సాగుతుందని ప్రజల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని , యువత యువకులు మత్తమందుకు అలవాటు పడుతున్నారని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు గత రెండు సంవత్సరాల క్రితం ఆనాటి పోలీసులు రెండు గ్రామాల యువకులను సమావేశపరిచి మత్తుమందుకు అలవాటు పడకూడదని చెడు అలవాట్లో దూరంగా ఉండాలని కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ కొందరు కొంతకాలం తర్వాత గంజాయి డ్రగ్స్ దందా నిర్వహించేవారు యువతను ప్రోత్సహిస్తూ యువతను బలి చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి గతంలో మణుగూరు గాంధీ బొమ్మ సెంటర్లో మత్తుమందు కారణంగానే తీవ్ర ఘర్షణ జరిగి ఆస్తి నష్టం ప్రాణ నష్టాలు జరిగాయి శివలింగాపురం, పివి కాలనీ వరకు ఈ గంజాయి ఇక్కడ కొనసాగుతూనే ఉన్నాయని ఎప్పటినుండో ఆరోపణలు ఉన్నాయి పోలీసులు రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో సరైన నిఘా లేకపోవడం కారణంగానే ఇలా జరుగుతుందని ప్రజలు ప్రజాసంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
Read:Chhattisgarh:బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్