Bhadradri:ఇల్లందు డిపో చెత్త బస్సులు.. ప్రయాణికుల బేజారు..

Bhadradri Kothagudem

Bhadradri:ఇల్లందు డిపో చెత్త బస్సులు.. ప్రయాణికుల బేజారు..:ఆర్టీసీ ప్రవేశపెట్టిన చెత్త బస్సులు ఎక్కలేక ప్రయాణికులు బేజారవుతున్నారు. బస్సు విరిగిపోతుందా అన్నంత భయం వేస్తోందని ప్రయాణికులు తెలుపుతున్నారు. బస్సు రన్నింగ్లో బాడీ అంతా ఊగిపోతోంది. బస్సు అద్దాలు, టాప్, బడబడా టప టప శబ్దాలతో చెవులు చిల్లులు పడుతున్నాయి. రోడ్లమీద గుంతలు, స్పీడ్ బ్రేకర్లు దాటుతున్న సందర్భాలలో ప్రయాణికులను లేపి ఎత్తేస్తోంది. దీంతో గర్భిణీలు, వృద్ధులు, వికలాంగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తల, కడుపు, బాడీ నొప్పలు వస్తున్నాయి అని అంటున్నారు.

ఇల్లందు డిపో చెత్త బస్సులు..
ప్రయాణికుల బేజారు..

భద్రాద్రి కొత్తగూడెం

ఆర్టీసీ ప్రవేశపెట్టిన చెత్త బస్సులు ఎక్కలేక ప్రయాణికులు బేజారవుతున్నారు. బస్సు విరిగిపోతుందా అన్నంత భయం వేస్తోందని ప్రయాణికులు తెలుపుతున్నారు. బస్సు రన్నింగ్లో బాడీ అంతా ఊగిపోతోంది. బస్సు అద్దాలు, టాప్, బడబడా టప టప శబ్దాలతో చెవులు చిల్లులు పడుతున్నాయి. రోడ్లమీద గుంతలు, స్పీడ్ బ్రేకర్లు దాటుతున్న సందర్భాలలో ప్రయాణికులను లేపి ఎత్తేస్తోంది. దీంతో గర్భిణీలు, వృద్ధులు, వికలాంగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తల, కడుపు, బాడీ నొప్పలు వస్తున్నాయి అని అంటున్నారు. ప్రయాణికులు. చెత్త బస్సులు, డొక్కు బస్సులు ఎక్కిన సందర్భాలలో కొందరికి తల తిరుగుతూ వాంతులు కూడా చేసుకుంటున్నారు. దీనికి తోడు బస్సులు మధ్యలో బ్రేక్ డౌన్కు గురై మోరాయిస్తున్నాయి. ఇల్లందు బస్సు డిపో నుండి బస్సు రిపేర్ చేసే వరకు కొన్ని గంటల పాటు ప్రయాణికులు వేచి చూడాల్సిన పరిస్థితి దాపురిస్తోంది. ఈ డొక్కు చెత్త బస్సులకే ఎక్స్ప్రెస్ బోర్డులు. కొత్త బస్సులు ప్రవేశపెట్టాలని సీపీఐ(ఎం)తో పాటు ఇతర రాజకీయ పార్టీలు బస్ డిపో ఎదుట ధర్నాలు చేసి వినతిపత్రాలు సమర్పించినప్పటికీ సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. డిపో చెకప్కే పరిమిత మౌతున్న ఆర్ఎం, డిఎం నెలకోసారి ఇల్లందు బస్సు డిపోకు వస్తూ చెకప్లకే ఖమ్మం ఆర్ఎం కొత్తగూడెం డిఎంలు పరిమితం అవుతున్నారని ప్రజలు, రాజకీయ పార్టీల నేతలు అంటున్నారు. ఏడాది పొడవునా డిపో ఆదాయ వ్యయాలు, సిబ్బంది పని విధానం, రికార్డుల పరిశీలనకేనా సందర్శనలు అంటున్నారు పట్టణ ప్రజలు, కొత్త బస్సులు, కొత్త రూట్లు, బస్సు డిపోలో డీజిల్ బంక్ ఏర్పాటు, ప్రయాణికులు, మహిళా కండక్టర్లు సిబ్బందికి సౌకర్యాల ఏర్పాటుపై శ్రద్ద పెట్టడం లేదనే విమర్షలు వినిపిస్తున్నాయి.

తక్షణం కొత్త బస్సులు ప్రవేశపెట్టాలి సీపీఐ (ఎం) జిల్లా కమిటీ సభ్యులు అబ్దుల్ నబీ

పాత చెత్త, డొక్కు బస్సులు తొలగించి తక్షణం కొత్త బస్సులు ప్రవేశపెట్టి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు అబ్దుల్ నబీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బస్ డిపో ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయినప్పటికీ సమస్యలు తీర్చడంలో అధికారులు విఫలమవుతున్నారని అన్నారు. ఊగిపోతున్న బస్సులకు కనీసం రిపేరు కూడా చేయడం లేదని ఈ డొక్కు బస్సులే అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్నాయన్నారు.
మేము ఉద్యోగులమే ఏమీ చేయలేం మూడు నెలలు ఓపిక పట్టండి కొత్త బస్సులు వస్తాయి డిప్యూటీ ఆర్ఎం భవాని ప్రసాద్ పాత చెత్త, డొక్కు బస్సులు, ప్రయాణికుల అవస్థలపై ఆర్ఎం సరిరాం నాయకన్ను నవతెలంగాణ ఫోన్లో సంప్రదించగా మీటింగ్లో ఉన్నాను సమస్యలు డిప్యూటీ ఆర్ఎం భవాని ప్రసాద్ దృష్టికి తీసుకెళ్ళమని చెప్పారు. సమస్యల వారి దృష్టికి తీసుకువెళ్లగా సమస్యలు ఉన్నాయి. మేము ఏమి చేయలేం, మేము ఉద్యోగులమే. రాజకీయ నాయకులం కాదు. అర్జెంటుగా బస్సులు కొనలేము పెట్టలేము. పాతవి రిప్లేస్మెంట్ చేసి కొత్త వాటికి ప్రతి పాదనలు పంపాం. అంతా ఆర్టీసీ హెడ్ ఆఫీస్ నుంచే నిర్ణయాలు కావాలి, మూడు నాలుగు నెలలు పడుతుంది. ఓపిక పట్టాలని అన్నారు.

Read more:Mumbai:చిక్కుల్లో మొనాలిసా

Related posts

Leave a Comment