అలోవెరా (కలబంద ) యొక్క ప్రయోజనాలు
Benefits of Aloe Vera
ASVI Health
కలబందలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అందుకే దీన్ని చాలా బ్యూటీ కేర్ ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. ఈ జ్యూస్‌లో విటమిన్లు మరియు మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. కలబందలోని పోషకాలు జుట్టును దృఢంగా ఉంచుతాయి. అలోవెరా జెల్ ను జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు బలంగా మారుతుంది.
చుండ్రు ఈ కలబంద రసాన్ని జుట్టుకు రాసుకుంటే చుండ్రు పోతుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. జుట్టు పెరుగుదల బాగుంటుంది. కలబందలో యాంటీ ఫంగల్ మరియు యాంటీ వైరల్ గుణాలు ఉన్నందున చుండ్రుకు సహజ నివారణ. దీన్ని తలకు పట్టించడం వల్ల చుండ్రు తగ్గుతుంది.
ఎంజైమ్‌లు కలబందలో ఉండే ఎంజైమ్‌లు జుట్టును లోపలి నుండి పోషించడంలో సహాయపడతాయి. దీంతో జుట్టు సిల్కీగా, మెరుస్తూ ఉంటుంది. అలోవెరా జుట్టులోని అదనపు సెబమ్‌ను తొలగిస్తుంది. ఇది జుట్టును ఆయిల్ ఫ్రీగా చేస్తుంది. కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ జెల్‌ను ఏదైనా గాయంపై అప్లై చేయడం వల్ల గాయం వల్ల కలిగే అసౌకర్యం తగ్గుతుంది.
డయాబెటిక్ పేషెంట్లు ఒక గ్లాసు కలబంద రసం తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. కలబంద రసంలో ఆంత్రాక్వినోన్ గ్లైకోసైడ్స్ ఉంటాయి. ఇవి మలబద్ధకం నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఐస్ క్యూబ్ ట్రేలో అలోవెరా జెల్ ఉంచడం ద్వారా జెల్ క్యూబ్స్ తయారు చేస్తారు. సహజమైన కాంతి కోసం వీటిని మీ ముఖంపై సున్నితంగా రుద్దండి.
స్కిన్ అలోవెరా జెల్ ను నేరుగా మీ చర్మంపై అప్లై చేయవచ్చు. దీంతో చర్మం తేమగా మారుతుంది. కలబందలో ఆస్ట్రింజెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. మచ్చలను తగ్గించడంలో ఈ లక్షణాలు అద్భుతంగా పనిచేస్తాయి. చలికాలంలో కలబందను అప్లై చేయడం వల్ల జుట్టుకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఆరోగ్య సమస్యల నుండి కూడా ఉపశమనం పొందుతుంది.