బీట్రూట్లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు
Beetroot has many health benefits
బీట్రూట్ అంటే చాలా మందికి ఇష్టం ఉండదు. పచ్చిగా తినడానికి మరియు రసం త్రాగడానికి వారు ఒక అడుగు వెనక్కి వేస్తారు. కానీ బీట్రూట్లో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బీట్రూట్ గురించి తెలిస్తే అందరూ తినకుండా ఉండలేరు. అయితే బీట్రూట్ తినడానికి ఇష్టపడని వారు కనీసం ఉదయం పూట దాని రసాన్ని తాగాలి. దీని వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రక్తహీనతకు బీట్ రూట్ జ్యూస్ మంచి మందు. ఇది త్వరగా రక్తాన్ని తయారు చేయడానికి సహాయపడుతుంది. రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. ఇక రోజంతా నీరసంగా ఉన్నవారు ఉదయాన్నే బీట్రూట్ జ్యూస్ తాగితే రోజంతా ఎనర్జిటిక్గా ఉండటమే కాకుండా చాలా ఎనర్జీని పొందుతారు. అంతేకాదు బీట్రూట్ వల్ల యాక్టివ్గా ఉంటారు. ఏ పని చేయాలన్నా ఉత్సాహంగా ఉంటారు.
Beetroot Benefits
బీట్రూట్ అధిక రక్తపోటుకు కూడా మంచి ఔషధం. బీట్రూట్లో ఉండే పొటాషియం హైబీపీని అదుపులో ఉంచుతుంది. ఇది గుండె జబ్బులను కూడా నివారిస్తుంది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు బీట్ రూట్ జ్యూస్ తాగితే మంచి ఫలితాలు వస్తాయి. ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. అంతేకాదు జ్యూస్ తాగడం వల్ల బరువు కూడా తగ్గుతారు.
ఈ బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల గర్భిణీ స్త్రీలకు చాలా మేలు జరుగుతుంది. బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల పుట్టబోయే బిడ్డకు ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా లభిస్తుంది. కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎదుగుదలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. కాలేయ సమస్యలతో బాధపడేవారు రోజూ బీట్రూట్ జ్యూస్ తాగడం చాలా మంచిది. బీట్ రూట్ కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. కాలేయం నుండి వ్యర్థ పదార్థాలను తొలగిస్తుంది.
బీట్రూట్ జ్యూస్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగవుతుందని శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఐరన్ లోపం ఉన్నవారు రక్తహీనతతో బాధపడుతుంటారు. ఈ బీట్రూట్ ఇనుమును పెంచుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి కూడా పెరుగుతుంది. చాలా మంది డిప్రెషన్తో బాధపడుతున్నారు. అలాంటి వారు బీట్రూట్ ముక్కలను తింటే లేదా దాని రసం తాగితే ప్రయోజనం ఉంటుంది. నీరసం పోయి శక్తి వస్తుంది.
బీట్రూట్లో శరీరానికి అవసరమైన అనేక విటమిన్లు ఉంటాయి. విటమిన్ బి మరియు సి లభిస్తాయి. బీట్రూట్లో కాల్షియం మరియు మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇందులో పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. కాలేయాన్ని శుభ్రపరచడానికి బీట్రూట్ చాలా ఉపయోగపడుతుంది. చర్మ సంబంధిత వ్యాధులను కూడా నివారిస్తుంది. ఎముకలను దృఢంగా ఉంచే శక్తి కూడా బీట్ రూట్ కు ఉంది.