ఇంటింటి సర్వేలో తప్పుడు సమాచారమిస్తే కేసులే..!
బీసీ కమిషన్ చైర్మన్
హైదరాబాద్
BC Commission Chairman
ఇంటింటి సర్వేలో ఉద్దేశపూర్వకంగా ఎవరైనా తప్పుడు సమాచారం అందించినా, ఎన్యూమరేటర్లు తప్పుడుగా నమోదు చేసినా క్రిమినల్ చర్యలతోపాటు, కేసులు కూడా నమోదు చేయిస్తామని తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ హెచ్చరించారు.
ఖైరతాబాద్‌లోని కమిషన్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సర్వేకు రాజకీయాలకు అతీతంగా సహకరించాలని కోరారు. సొంత యంత్రాంగం, సిబ్బంది లేకపోవడం, బీసీ కమిషన్ కోరితేనే సర్వే బాధ్యతను ప్లానింగ్ శాఖకు ప్రభుత్వం అప్పగించిందని చెప్పా రు. సమాచార సేకరణకు వచ్చే ఎన్యూమరేటర్లకు పౌరులు సహకరించాలని, సమస్య లు తలెత్తితే కలెక్టర్లు, బీసీ కమిషన్ దృష్టికి తేవాలని సూచించారు.
CM Chandra babu | కేంద్రమంత్రులు… అయితే ఏంటీ.. | Eeroju news