Banjara festival | అనంతలో బంజరాలు పండుగ సందడి | Eeroju news

Banjara festival

అనంతలో బంజరాలు పండుగ సందడి

అనంతపురం, సెప్టెంబర్ 18, (న్యూస్ పల్స్)

Banjara festival

విలక్షణం... బంజారాల జీవితం | Banjara Seethla Bonalu Festival | Sakshiసింధు నాగరికత నుంచి సనాతన సంస్కృతి సాంప్రదాయాలను.. సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు బంజారాలు. తెలంగాణలో బతుకమ్మ పండుగ తరహాలో గిరిజన తండాలో పల్లెదనం ఉట్టిపడేలా పూర్వీకుల నుంచి వస్తున్న తమ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు. బంజారాలు హర్యాలీ తీజ్ పండుగ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. బంజారా కళలను కనుమరుగు కాకుండా వాటికి జీవం పోస్తూ నేటికీ వారి ఆచార సాంప్రదాయాలను అనుసరిస్తూ ఉన్నారు. రాను రానూ మారుతున్న కాలానుగుణంగా బంజారాల తీజ్ పండుగను అక్కడక్కడ ఘనంగా నిర్వహించుకుంటున్నారు.

ప్రస్తుతం అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం రూపా నాయక్ తండాలో ఈ ఉత్సవాలను 11 రోజులపాటు ఘనంగా నిర్వహించనున్నారు. విశిష్ట చరిత్ర కలిగిన తీజ్ ఉత్సవాలను కన్యలు పండుగ జరపాలని గ్రామ పెద్ద ఇంటికి వెళతారు. గ్రామపెద్ద కుల గోత్రం వారిని సమావేశపరిచి తీజ్ పండుగ జరపాలని అందరి అభిప్రాయాలు సేకరించి చివరికి నిర్ణయం తీసుకుంటారు. ఈ పండుగ రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క మాసాలలో నిర్వహించుకుంటారు. పూర్వం నుంచి కీర్తనల ఆధారంగా పండుగ శ్రావణ, భాద్రపద మాసాలలో నిర్వహించాలని పూర్వీకుల నుంచి వస్తున్న ఆనవాయితీ.

ఈ పండుగ జరపడం వల్ల గోధుమ మొక్కలు గంప (బుట్ట)లో ఏ రకంగా అయితే పచ్చగా మొలకెత్తి పెరుగుతాయో అలా బంజారాల గ్రామలు, సమాజం, పంట పొలాలు, జీవజాతులు అన్ని కూడా సస్యశ్యామలంగా ఉండాలన్న ఆలోచనతో పండుగ నిర్వహిస్తారు.ఈ పండుగ తలపెట్టే బంజారా యువతులు (పెళ్లి కాని యువతులు ) 11 రోజులపాటు వ్రతము అనుసరిస్తూ ఆహార నియమాలను పాటించి భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరి కుటుంబాలు బాగుండాలని నవతరానికి బీజం లాంటిది తీజ్ పండుగని బంజారా నేతలు పేర్కొన్నారు.

గంపలలో మొలకెత్తిన గోధుమ మొక్కలను తుల్జా భవాని సామా సంగ్ మహారాజ్ లను పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించి గంపలో పెరిగిన తీజ్ మొక్కలను బంజారా నేతలకు తమ తలపాగలు ఉంచుతారు. ఈ మొక్కలను బంజారా లు భక్తిశ్రద్ధలతో తమ ఇండ్లలో భద్రపరచుకుంటారు. ఆ మొక్కలు ఎవరింట్లో అయితే ఉంటదో వారింట్లో సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలు వర్ధిల్లుతాయని బంజారాల విశ్వాసం. ఉత్సవాల ఆఖరి రోజు గోధుమ మొక్కలు ఉన్న గంపలను శోభాయాత్రగా ప్రదర్శన నిర్వహించి గ్రామ నాయక్ బావిలో నిమజ్జనం చేస్తారు.

అనంతరం బంజారా కన్యల సోదరులు తెచ్చిన తిను బండారాలు గుగ్గులను ఒకచోట చేరి ఆరగిస్తారు. ఇంతటితో ఈ పండుగ ముగిస్తుంది. తీజ్ పండుగ తిలకించడానికి రూపా నాయక్ తండాకు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి బంజారాలు వచ్చి పండుగలు పాల్గొంటారు. రూపా నాయక్ తండాలోని నాయక్ డావో కార్ భారీ చౌహాన్ రాథోడ్ పమార్ జాదవ్ గోత్రాల వారు సమిష్టిగా పాల్గొని పండుగను జరుపుతారు. రూపా నాయక్ తండాకు అనుబంధంగా ఉన్న కలగల తండా, జేరుట్ల రాంపురం తండా, వెంకటం పల్లి చిన్న తండా, పందికుంట తండా బంజారా లు అధికంగా పాల్గొంటున్నారు.

Banjara festival

 

Ganesh festival | గణేష్ ఉత్సవాలకు అన్నీ ఏర్పాట్లు | Eeroju news

Related posts

Leave a Comment