భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తక్కువ కాలంలో అత్యంత క్లిష్టమైన కీలకమైన ప్రయోగాలను సక్సెస్ చేసి అగ్రదేశాల సరసన నిలబడగలిగింది. ఒకప్పుడు స్పేస్ లో అద్భుతాలు చేయడం అంటే రెండు మూడు దేశాలకు మాత్రమే పరిమితం.
రెడీ అవుతున్న ఇస్రో బాహుబలి
బెంగళూరు, జనవరి 18
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తక్కువ కాలంలో అత్యంత క్లిష్టమైన కీలకమైన ప్రయోగాలను సక్సెస్ చేసి అగ్రదేశాల సరసన నిలబడగలిగింది. ఒకప్పుడు స్పేస్ లో అద్భుతాలు చేయడం అంటే రెండు మూడు దేశాలకు మాత్రమే పరిమితం. అమెరికా, రష్యా, చైనా లాంటి దేశాలకు మాత్రమే సాధ్యమైన అనేక ప్రయోగాలను ఇప్పుడు ఇస్రో చేసి చూపిస్తోంది. నాలుగు దశాబ్దాల క్రితం అంతరిక్ష ప్రయోగాలు చేపట్టేందుకు శ్రీకారం చుట్టిన భారత్‌ను చూసి చాలా దేశాలు అవహేళన చేశాయి. అలాంటి దేశాలకు ఏమాత్రం తీసిపోని విధంగా కీలకమైన ప్రయోగాలను సొంతంగా భారత్ సక్సెస్ చేసి ప్రపంచానికి చాటింది. మ్యాన్ మిషన్ కు సిద్ధమైన ఇస్రో అందుకోసం సొంతంగా భారీ లంచ్ ప్యాడ్ ను సిద్ధం చేస్తోంది. బాహుబలి లాంచ్ ప్యాడ్‌ను ఇస్రో కొత్తగా నిర్మిస్తుంది. ఈ లంచ్ ప్యాడ్ గురించి ఇటీవల పలు ఆసక్తికర వివరాలను వెల్లడించింది.కేంద్రం ఇందుకోసం ఇప్పటికే నిధులను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. రూ.3,985 కోట్లను మూడో లాంచ్ ప్యాడ్ కోసం ఆమోదం తెలిపింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలో ఇప్పటికే రెండు లాంచ్ ప్యాడ్లు అందుబాటులో ఉన్నాయి. మొదటి లాంచ్ ప్యాడ్ 30 ఏళ్ల క్రితం ఏర్పాటు చేయగా రెండో లాంచ్ ప్యాడ్ 20 ఏళ్ల క్రితం నిర్మించింది ఇస్రో. అయితే భారత్ భవిష్యత్తులో చేపట్టనున్న కీలక ప్రయోగాలకు ఇప్పుడు ఉన్న లాంచ్ ప్యాడ్లకు మించిన కెపాసిటీతో కూడిన లాంచ్ ప్యాడ్ అవసరం ఉంది.
ప్రస్తుతం ఇస్రో ప్రయోగిస్తున్న రాకెట్ల ద్వారా రెండు నుంచి నాలుగు టన్నుల బరువున్న ఉపగ్రహాలను మాత్రమే నింగిలోకి పంపగలిగే సామర్థ్యం ఉంది. ఇస్రో త్వరలో చేపట్టనున్న మ్యాన్ మిషన్ గగన్‌యాన్ ప్రాజెక్టు కోసం భారీ రాకెట్ ద్వారా వ్యోమ నౌకలను అంతరిక్షంలోకి పంపాల్సి ఉంటుంది. అందుకోసం అత్యంత బరువైన మాడ్యూల్ ను అంతరిక్షంలోకి పంపాల్సి ఉంటుంది. అలాగే 235 కి భారత్ అంతరిక్షంలో సొంతంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటు కూడా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2040లో చంద్రుడిపై భారత్ చెందిన వ్యోమగాములు అడుగు పెట్టాలని లక్ష్యంగా ఉంది. అలాంటప్పుడు రాకెట్ బరువు కాకుండా రాకెట్ ద్వారా తీసుకెళ్లే మాడ్యూల్ దాదాపు 70 నుంచి 75 టన్నుల బరువు ఉన్న పేలోడ్‌ని సైతం అంతరిక్షంలోకి పంపే సామర్థ్యం గల రాకెట్లను తయారు చేయాల్సి ఉంటుంది.ఇలాంటి న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్ ఇస్రో రూపొందించాలన్నీ, ఇతర రాకెట్లను ప్రయోగించాలన్నా భారీగా లాంచ్ ప్యాడ్ సామర్థ్యం కూడా పెంచాల్సి ఉంటుంది. అలాగే అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి భూమి మీదకు వచ్చే స్పేస్ షటిల్ ల్యాండ్ అయ్యేందుకు ఒక రన్ వే కూడా అవసరం. ఆ రన్ వే కూడా నిర్మించేందుకు ఇస్రో ప్లాన్ చేసుకుంటుంది. తాజాగా నిర్మించనున్న మూడో లాంచ్ ప్యాడ్ అందుబాటులోకి వస్తే తక్కువ సమయంలో ఎక్కువ ప్రయోగాలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఒక్కో రాకెట్ తయారీ పూర్తయిన తర్వాత లాంచ్ ప్యాడ్ తీసుకువెళ్లి ప్రయోగం పూర్తి చేసేందుకు వారం నుంచి పది రోజులు సమయం పడుతుంది. ప్రస్తుతం రెండు లాంచ్ ప్యాడ్లు మాత్రమే ఉండగా మూడో లాంచ్ ప్యాడ్ అందుబాటులోకి వస్తే ప్రయోగాల సంఖ్య మరింత పెంచే అవకాశం ఉంటుంది. ఇస్రో ఇప్పటివరకు రూపొందించిన పీఎస్ఎల్వీ , జీఎస్ఎల్వి, మార్క్ 3 తరహా వాహక నౌకలు ఉండగా ఇటీవల ఎస్ఎస్ఎల్వి పేరుతో చిన్న తరహా రాకెట్లను రూపొందించి ప్రయోగం చేసింది. ఈ తరహా రాకెట్ల ప్రయోగం కోసం ప్రత్యేకంగా తమిళనాడులోని కులశేఖర పట్టణంలో లాంచ్ ప్యాడ్ ను ఏర్పాటు చేస్తోంది. అంటే ఇస్రో చేపట్టే రాకెట్ ప్రయోగాల కోసం మొత్తం నాలుగు లాంచ్ ప్యాడ్లు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఏడాదికి 10 నుంచి 15 వరకు మాత్రమే ఉన్న ఇస్రో చేపట్టే ప్రయోగాల భవిష్యత్తులో 100కు మించి ఉండేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి