Bangalore:నాసా,ఇస్రో కలిసి ప్రయోగాలు

Experiments by NASA and ISRO

2025లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరింత దూకుడుగా ప్రయోగాలు చేపట్టబోతోంది. ఇప్పటికే చంద్రయాన్‌, ఆదిత్య ఎల్‌-1 మిషన్‌తో ఇస్రో ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది.

నాసా, ఇస్రో కలిసి ప్రయోగాలు

బెంగళూరు, జనవరి 3
2025లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరింత దూకుడుగా ప్రయోగాలు చేపట్టబోతోంది. ఇప్పటికే చంద్రయాన్‌, ఆదిత్య ఎల్‌-1 మిషన్‌తో ఇస్రో ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. అగ్రరాజ్యాల సరసన తలెత్తుకుని నిలబడేలా స్థాయికి వెళ్లింది. సొంత ఉపగ్రహాలనే కాదు… విదేశీ షాటిలైట్స్‌నూ నింగిలోకి పంపి కమర్షియల్‌గానూ సూపర్‌ సక్సెస్‌ అయ్యింది ఇస్రో. అలాగే 2025లో కూడా ప్రపంచం మొత్తం నివ్వెరపోయేలా.. అంతా ఇస్రో వైపు చూసేలా ప్రయోగాలు చేస్తామంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ ఏడాది ఇస్రో నాలుగు PSLV, మరో నాలుగు GSLV, మూడు GSLV మార్క్‌ 3 ప్రయోగాలు చేపట్టబోంది ఇస్రో. ఇందులో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాతో కలిసి ఇస్రో NISAR ప్రయోగం చేపట్టబోతోంది. ఇప్పటికే దీని బడ్జెట్‌ 12వేల 505 కోట్లుగా ప్రకటించారు. ఫిబ్రవరి లేదా మార్చిలో ఈ ప్రయోగం ఉండే ఛాన్స్‌ ఉంది. ఈ నాసా ఇస్రో సింథటిక్‌ అపర్చర్ రాడార్‌ తక్కువ భూకక్ష్యలో తిరుగుతూ భూమిని 12 రోజుల్లో చుట్టేయగలదు. ఇది భూమికి సంబంధించిన విలువైన సమాచారాన్ని అందిస్తుంది. భూమిపై ఉన్న సముద్రాల్లో వచ్చే మార్పులు, భూకంపాలు, సునామీలు వంటి ప్రకృతి విపత్తులను వెంటనే పసిగట్టి సమాచారం ఇస్తుంది. అవసరమైతే షాటిలైట్‌ చిత్రాలను పంగలదు. దీంతో ఈ ప్రయోగాన్ని ఇటు ఇస్రో అటు నాసా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.ఇక గత దశాబ్ధంగా ఇస్రో నాలుగు వందల మిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని కమర్షియల్‌ షాటిలైట్‌ వెహికిల్స్‌ను లాంచ్‌ చేయడం ద్వారా సంపాదించింది. అమెరికాకు కూడా 172 మిలియన్‌ డాలర్ల రెవెన్యూ తెచ్చిపెట్టింది. ఇప్పుడు జీఎస్‌ఎల్వీ, పీఎస్‌ఎల్వీ, ఎస్‌ఎస్‌ఎల్వీ ప్రయోగాలతో సత్తా చాటనుంది. ఎన్‌వీఎస్‌ 2 నేవిగేషన్‌ శాటిలైట్‌, ఎల్‌వీయమ్‌ 3 అండ్‌ ఎమ్‌5 మిషన్‌ను కూడా షెడ్యూల్‌ చేసింది. దీంతో 2025లో కూడా అస్సల్‌ తగ్గేదేలే అంటున్నారు శాస్త్రవేత్తలు.

Read:Kodali Nani: పాపం.. నానిలు

Related posts

Leave a Comment