Bandi Sanjay:దేశంలో రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారిపో్యాయి

The appearance of railway stations in the country has changed Union Minister Bandi Sanjay

నేను కార్పొరేటర్ గా వున్నప్పుడు పార్టీ వేరైనా మా అన్న మంత్రి శ్రీధర్ బాబు నాకు ఎంతో సహకరించారు. పార్టీ వేరు కాబట్టి పొగిడితే ఇబ్బంది వస్తదేమోనని ఆగుతున్నానని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. చర్లపల్లి నూతన రైల్వే టెర్మినల్ స్టేషన్ ప్రారంభోత్సవం సందర్బంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడారు.

దేశంలో రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారిపో్యాయి
కేంద్ర మంత్రి బండి సంజయ్

హైదరాబాద్

నేను కార్పొరేటర్ గా వున్నప్పుడు పార్టీ వేరైనా మా అన్న మంత్రి శ్రీధర్ బాబు నాకు ఎంతో సహకరించారు. పార్టీ వేరు కాబట్టి పొగిడితే ఇబ్బంది వస్తదేమోనని ఆగుతున్నానని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. చర్లపల్లి నూతన రైల్వే టెర్మినల్ స్టేషన్ ప్రారంభోత్సవం సందర్బంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మాట్లాడారు. ఇక ఈ కార్యక్రమానికి వస్తే
సరిగ్గా పదేళ్ల క్రితం ఏ రైల్వే స్టేషన్ గుర్తుకొచ్చినా కంపు కొట్టే టాయిలెట్లు, అశుద్ధంతో నిండిపోయిన రైల్వే ట్రాక్ లు, కనీస సౌకర్యాల్లేక ఇబ్బంది పడుతున్న జనం, ఎప్పుడు ట్రైన్ వస్తుందో తెలియక టెన్షన్ పడుతున్న ప్రయాణీకులే కన్పించే వాళ్లు. వందేళ్ల నాటి రైల్వే స్టేషన్లు కూడా కనీస అభివ్రుద్ధికి నోచుకోక, కొత్త రైల్వే స్టేషన్ల నిర్మాణం లేక బ్రిటీష్ కాలం, నిజాం కాలం నాటి రైల్వే స్టేషన్లున్నీ శిథిలావస్థలో కన్పించేవి. కానీ మన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పుణ్యమా? అని దేశంలో రైల్వే స్టేషన్ల, రైల్వేల రూపురేఖలే మారిపోయినయ్. ముఖ్యంగా తెలంగాణలో రైల్వే లేన్ల నిర్మానం, రైల్వే స్టేషన్ల రూపురేఖలే మరుతున్నయ్. గత పదేళ్లలోనే ఏకంగా 32 వేల కోట్ల రూపాయలకు పైగా తెలంగాణలోని రైల్వేల అభివ్రుద్ధికి ఖర్చు చేశారు. ఈ ఒక్క ఆర్ధిక సంవత్సరంలోనే 5 వేల 336 వేల కోట్లు తెలంగాణలో రైల్వేలకు కేటాయించారు. రాష్ట్ర చరిత్రలో బహుశా ఇంత పెద్ద మొత్తంలో నిధులను కూడా ఎన్నడూ కేటాయించలేదు. దటీజ్ మోదీ. మొన్నా మధ్య సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను చూసి ఆశ్చర్యపోయా. 720 కోట్లతో సికింద్రాబాద్ స్టేషన్ ను వరల్డ్ క్లాస్ సేవలందించేలా అద్బుతంగా నిర్మిస్తున్నరు. అట్లాగే 350 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ రూపు రేఖలు మారుస్తున్నరు. ఇవే గాకుండా అమృత్ భారత్, పథకం కింద రాష్ట్రంలోని దాదాపు 40 రైల్వే రైల్వే స్టేషన్లను దాదాపు 2 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి అభివృద్ధి చేస్తున్నరు. మా కరీంనగర్ రైల్వే స్టేషన్ కు వెళితే ఆ స్టేషన్ రూపురేఖలే మారిపోయినయ్. అద్బుతంగా ఆధునీకరిస్తున్నరు. అట్లాగే మన రాష్ట్రం నుండే 5 వందే భారత్ ట్రెయిన్లు నడుస్తున్నయ్. ఈ ట్రైన్లలో వెళ్లే వారు తక్కువ సమయంలోనే గమ్యస్థానాలకు వెళుతూ, అద్బుతమైన సౌకర్యాలను ఆస్వాదిస్తున్నారు. ఇయాళ మన వందేభారత్ ట్రైయిన్లను చూసి ఇట్లాంటి వరల్డ్ క్లాస్ స్థాయి రైల్వే స్టేషన్లను చూసి ఔరా శభాష్ అంటూ మాట్లాడుకునే పరిస్థితి వచ్చిందంటే అది మోదీ చలువే. చర్లపల్లి టెర్మినల్ కోసం ఎన్వీ ఎస్ ఎస్ ప్రభాకర్ చేసిన కృషి గుర్తుకొస్తోంది.

హైదరాబాద్ లో రోజు రోజుకూ పెరుగుతున్న ప్రయాణీకుల రద్దీ, గూడ్స్ ట్రైన్ల రద్దీ, ప్రజల అవసరాలను ద్రుష్టిలో ఉంచుకుని ఈ చర్లపల్లిలో నూతన రైల్వే టెర్మినల్ సేవలు అందు బాటులోకి తీసుకువస్తుండటం చాలా ఆనందంగా ఉంది. ఈ రైల్వే స్టేషన్ నిర్మాణాన్ని, అందిస్తున్న సేవలను చూస్తుంటే ఎయిర్ పోర్ట్ సేవలను తలపిస్తోంది. దాదాపు 430 కోట్ల రూపాయల తో నిర్మించిన ఈ రైల్వే టెర్మినల్ అద్బుతంగా ఉంది. నాకు తెలిసి స్వాతంత్ర్యం వచ్చాక తెలంగాణలో కొత్తగా నిర్మించిన మొట్టమొదటి రైల్వే టెర్మినల్ కూడా ఇదేనేమో.
ఈ చర్లపల్లి టెర్మినల్‌ ప్రారంభమైతే సుమారు 50 వేల మందికి పైగా ప్రయాణికులకు ట్రాఫిక్ భారం తగ్గే అవకాశముంది. గంటల తరబడి ట్రాఫిక్ సమస్య నుంచి వారికి విముక్తి కలుగుతుంది. ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే వేగంగా గమ్య స్థానాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ కొత్త టెర్మినల్ రాక తో సికింద్రబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ లపై ఒత్తిడి చాలా మేరకు తగ్గనుంది. బాగుంది. ఈ టెర్మినల్ లో ప్రయాణికుల కోసం అత్యాధునిక సేవలతో నిర్మించిన ఏసీ వెయిటింగ్ హాళ్లు, నాన్‌ ఏసీ హాల్స్, ఫుడ్‌ కోర్టులు, రెస్టారెంట్లు, రిజర్వేషన్‌ కౌంటర్లు, టికెట్‌ కౌంటర్లను చూస్తుంటే ముచ్చటేస్తోంది. ఇవన్నీ ఎందుకంటే, ఏ దేశంలోనైనా రైల్వే, రోడ్లు, ఏవియేషన్ వ్యవస్థ బాగుపడితేనే ఆ దేశ ఆర్ధిక వ్యవస్థ పరుగులు పెడతుంది. అమెరికాలాంటి దేశంలో కూడా మొదట ఈ మూడు రంగాలను అభివ్రుద్ధి చేసిన తరువాతే ఆ దేశం ఆర్ధికంగా పరుగులు పెట్టి అగ్రదేశంగా మారింది. దురుద్రుష్టమేందంటే. ఈ మూడు రంగాలు గతంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైనయ్. బీజేపీ తొలిసారి అధికారంలోకి వచ్చాక వాజ్ పేయి ఆధ్వర్యంలో స్వర్ణ చతుర్భుజీ పేరుతో జాతీయ రహదారుల విస్తరణకు శ్రీకారం చుడితే మన ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలో రోడ్లు, రైల్వే, ఏవియేషన్ రంగాలపై ప్రత్యేక ద్రుష్టి పెట్టి మౌలిక సదుపాయలు కల్పించేందుకు అత్యధిక నిధులను ఖర్చు చేస్తూ అభివ్రుద్ధి వైపు పరుగులు తీయిస్తున్నారరని అన్నారు.
Read:Hyderabad:ఒక్క విద్యార్థి కూడా లేని 2097 పాఠశాలలు

Related posts

Leave a Comment