Balineni vs Chevireddy | బాలినేని వర్సెస్ చెవిరెడ్డి | Eeroju news

Balineni vs Chevireddy

బాలినేని వర్సెస్ చెవిరెడ్డి

ఒంగోలు, జూలై 17 (న్యూస్ పల్స్)

Balineni vs Chevireddy

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత.. ఒంగోలు ఎమ్మెల్యేగా 5 సార్లు గెలిచిన ఆ కీలక నేత మొన్నటి ఎన్నికలే తనకు చివరి ఎన్నికలని ప్రకటించారు. అయితే ఇప్పుడు అటు వైసీపీ అధ్యక్షుడు తీసుకుంటున్న నిర్ణయాలు, ఇటు ఒంగోలులో తనపై వస్తున్న ఆరోపణలతో తాను రాజకీయాల్లోనే ఉంటానని ప్రకటించారు. జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి చెవిరెడ్డికి కట్టబెడతారన్న ప్రచారంపై ఆయన తనదైన స్టైల్లో రియాక్ట్ అయ్యారు. జగన్‌కి సమీపబంధువు అయిన బాలినేని రాజకీయాల్లో ఉంటానంటూనే.. అవసరమైతే వైసీపీని వీడతానని ప్రకటించి ఆ పార్టీలో కలకలం రేపారు. ప్రజలు, కార్యకర్తల కోసం రాజకీయాల్లో కొనసాగుతానని ప్రకటించారు.

ఒంగోలు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వాస్తవానికి మొన్నటి ఎన్నికలే తనకు చివరివని ప్రకటించారాయన. ఒంగోలు ఎమ్మెల్యేగా 5 సార్లు విజయం సాధించి జగన్ కేబినెట్లో పనిచేసిన బాలినేని ఈ సారి భారీ ఓటమి చవి చూశారు. దాంతో ఆయన రాజకీయ ప్రస్థానం ముగిసినట్లే అని అందరూ భావించారు. దానికి తగ్గట్లే ఓటమి పాలైన దగ్గర నుంచి ఆయన హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. ఆ క్రమంలో ఆయనపై ఒంగోలులోని ప్రత్యర్ధులు అవినీతి ఆరోపణలు గుప్పించి.. పార్టీ మారబోతున్నారని ప్రచారం నిర్వహించారు. వాటన్నిటిని ఖండిస్తూ ఆయన తన నిర్ణయం ప్రకటించారు.

తన కెరీర్‌లో 2014 ఎన్నికల్లో తొలిసారి ఓడిపోయిన బాలినేని నాలుగున్నరేళ్ల పాటు క్యాడెర్‌కు అందుబాటులో లేరు. అప్పటితో పోలిస్తే ఈ ఎన్నికల్లో మరింత ఘోరంగా ఓడిపోయారు. దాంతో ఇప్పుడు కూడా పార్టీ కార్యకలాపాలను పెద్దగా పట్టించుకోరన్న అభిప్రాయం వ్యక్తమైంది. దానికి తగ్గట్లే జగన్ సమీక్షలకు కూడా ఆయన హాజరు కాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా పార్టీ బాధ్యతలను ఎంపీగా ఓటమిపాలైన చెవిరెడ్డి భాస్కరరెడ్డికి కట్టబెడతారన్న ప్రచారం మొదలైంది. దాంతో జిల్లా వైసీపీ శ్రేణుల్లో తీవ్ర గందరగోళం కనిపిస్తుంది. జగన్ నిర్ణయాలు ప్రకాశం జిల్లా నేతల మధ్య సమన్వయ లోపాన్ని పెంచుతున్నాయి.

ఎన్నికలకు ముందు నుంచే వైసీపీలో ఉన్న నాయకత్వ సంక్షోభం ఎన్నికల తర్వాత కూడా కొనసాగుతోంది. జిల్లా నేతలను కించపరిచేలా అధినేత జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారనే అసం తృప్తి నేతల మధ్య ఉంది. తాజాగా చెవిరెడ్డి భాస్కరరెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా పెట్టాలనే నిర్ణయాన్ని జిల్లాలోని ముఖ్య నేతలకు తెలియజేశారంట. దాంతో జిల్లాలో ఇంత మంది సీనియర్ నాయకులుంటే ఎక్కడో చిత్తూరు జిల్లా నుంచి తెచ్చి ఇక్కడ అధ్యక్షుడిని పెట్టడం ఏమిటనే చర్చ మొదలైంది.ఆ క్రమంలో జిల్లాకు వచ్చిన బాలినేని భగ్గుమంటున్నారు. ఎన్నిక ల్లోనే చెవిరెడ్డిని ఎంపీ అభ్యర్ధిగా పెట్టడాన్ని తీవ్రంగా తప్పుపట్టిన బాలినేని ఇప్పుడు ఏకంగా పార్టీ అధ్యక్షుడిగా పెట్టడం ఏంటని మండిపడుతున్నారు.

చెవిరెడ్డి వల్లే ఎన్నికల్లో నష్టపోయామనే భావనలో ఉన్న బాలినేని  జగన్ నిర్ణయాల పట్ల అసంతృప్తిగానే కనిపిస్తున్నారు. జిల్లా నేతలతో చర్చిం చి ఏదైనా నిర్ణయాలు తీసుకోకుండా ఏకపక్షం గా ఎక్కడో పొరుగు జిల్లాల నేతలను ప్రకాశం జిల్లాకు తెచ్చి జిల్లా అధ్యక్షుడిగా పెడితే తాము ఏముఖం పెట్టుకుని తిరగాలనే భావనలో జిల్లా వైసీపీ ముఖ్యనేతలున్నారు. దీనిపై పార్టీలో ఇప్పటికే తీవ్ర చర్చ మొదలైంది. ఇదే జరిగితే తాను పార్టీకి రాజీనామా చేస్తానని బాలినేని తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారంఎంపీ అభ్యర్ధిగానే చెవిరెడ్డిని బాలినేని తీవ్ర స్ధాయిలో వ్యతిరేకించారు. ఒంగోలులో వైసీపీ కార్యాలయం వద్ద చెవిరెడ్డి ఫ్లెక్సీలను బాలినేని అభిమానులు తగలబెట్టారు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో జగన్ నిర్ణయాన్ని బాలినేని గౌరవించి చెవిరెడ్డికి మధ్దతివ్వాల్సి వచ్చిది.

ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే అభ్యర్ధులకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా చెవిరెడ్డి బాగా ఇబ్బంది పెట్టారంట. ఇటీవల ఒంగోలులో కోట్ల ఖరిదైన ఆర్టిసీ స్థలాని టెండర్స్ పేరుతో.. బాలినేనికి తెలియకుండా దక్కించుకొవటం. మరింత కోపం తెప్పించిందట.టీడీపీ అధికారంలోకి వచ్చి చెవిరెడ్డి వ్యవహారం బయటపెట్టడంతో బాలినేని షాక్ అయ్యారట. అలాంటి చెవిరెడ్డికి ప్రకాశం జిల్లా వైసీపీ పగ్గాలు అప్పగిస్తే.. రేపు జిల్లాలో ముఖం ఎలా చూపించాలని సన్నిహితులతో అంటున్నారంట. ఎక్కడో చిత్తూరు జిల్లా కు చెందిన చెవిరెడ్డి ప్రకాశం జిల్లాలో పెత్తనం ఏంటని  చెవిరెడ్డికి జగన్ ప్రకాశం జిల్లా బాధ్యతాలు అప్పగిస్తే బాలినేని నిర్మోహమాటంగా వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరతారని ఆయన అనుచరులు ఆఫ్ ద రికార్డ్‌గా చెప్పుకొస్తున్నారు.

తాజాగా మీడియా ముందు కొచ్చిన బాలినేని ఇదే విషయమై ప్రశ్నిస్తే.. చెవిరెడ్డి పేరెత్తడానికి కూడా ఇష్టపడకుండా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. రాష్రంలో వైసీపీ ఇంత ఘోరంగా ఓడిపోయాక కూడా జగన్ పార్టీ సీనియర్ల మాట వినటం లేదన్నది బాలినేని అవేదనగా తెలుస్తుంది. ఎన్నికల ఫలితాలు వచ్చాక ఆయన్న జగన్‌ను ఇప్పటి వరకు కలవలేదు. అధికారంలో ఉన్నప్పుడు అపాయింట్‌మెంట్లు ఇవ్వకుండా.. తన మంత్రి పదవి మధ్యలో తీసేసి అనేక అవమానాలకు గురిచేశాడని జగన్‌పై బాలినేనికి కోపం ఉంది.. చెవిరెడ్డి విషయంలో జగన్ నిర్ణయంపై ఆయన తీవ్ర ఆగ్రహంతో ఉన్నారంట. ప్రకాశం జిల్లా బాధ్యతాలు జిల్లాకు చెందిన వ్యక్తులకు ఇవ్వాలని సజ్జల రామకృష్ణారెడ్డికి బాలినేని చెప్పారంట.

చెవిరెడ్డి, గీవిరెడ్డి పేర్లు వస్తే జిల్లాలో తీవ్ర పరిణామాలు ఉంటాయని బాలినేని సజ్జలకు చెప్పటంతో  చెవిరెడ్డి పేరు ప్రస్తుతానికి పెండింగ్‌లో పెట్టారంటున్నారు. 2014సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఓడిపోయాక ప్రకాశం జిల్లాలో పార్టీ పరిస్థితి ఆందోళనకరంగా మారింది. పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు తెలుగుదేశంలో చేరడంతో వైసిపి ఉంటుందాలేదా అనే చర్చ సాగింది. కొద్దిరోజుల తర్వాత బాలినేని జిల్లా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. పార్టీని మళ్లీ బలోపేతం చేశారు. ఎన్నికల నాటికి వైసీపీ పుంజుకుంది. 2019 సార్వత్రి ఎన్నకలలో ఉమ్మడి ప్రకాశం లో 12కి 8 స్థానాలు వైసిపి గెలుచుకుంది. మొన్నటి ఎన్నికల్లో బాలినేనిని పట్టించుకోకుండా జగన్ అభ్యర్ధులను ప్రకటించడంతో వైసీపీ జిల్లాలో 2 స్థానాలకే పరిమితమైంది.

సీనియర్ నేతలు, మంత్రులుగా చేసిన నేతలు అందరూ ఓడిపోయారు. ఎవరూ నియోజకవర్గాల్లో కనిపించడం లేదు. ఆ క్రమంలో వైసీపీ అభిమానులు మళ్లీ బాలినేనికే పగ్గాలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు. బాలినేని దానికి ఒప్పుకోకపోతే.. దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రాసాద్‌రెడ్డికి అధ్యక్ష పగ్గాలు ఇవ్వాలన్న వాదన వినిపిస్తోంది. బూచేపల్లి శివప్రాసాద్ రెడ్డి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తల్లి వెంకాయమ్మ జడ్పీ ఛైర్మన్ గా ఉన్నారు. వైసీపీ పగ్గాలు బూచేపల్లి కుటుంబానికి ఇస్తే తనకు అభ్యంతరం లేదని బాలినేని అంటున్నారు. మరి చూడాలి జగన్ నిర్ణయం ఎలా ఉంటుందో?

 

Balineni vs Chevireddy

 

Minister Balineni disappointed | బాలినేని నైరాశ్యం.. | Eeroju news

Related posts

Leave a Comment