కలెక్టర్ కు రాఖీలు కట్టిన బాల సదనం బాలికలు
సిద్దిపేట
Bala Sadan girls who tied rakhis to the collector
రాఖి పౌర్ణమి పండగ సందర్భంగా సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ సముదాయం బాలసదనం చిన్నారులతో సందడిగా మారింది. రాఖీ పౌర్ణమి పండుగను పురస్కరించుకొని సోమవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బాలసదనం బాలికలు జిల్లా కలెక్టర్ ఎం. మనుచౌదరి కి రాఖీలు కట్టారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కు ప్రతి ఒక చిన్నారి రాఖీ కట్టగా జిల్లా కలెక్టర్ చాలా సంతోషించి ప్రతి ఒక చిన్నారికి స్వయంగా స్వీట్స్ తినిపించి అక్షింతలు వేసి ఎల్లప్పుడూ ఆనందంగా, సంతోషంగా ఉండాలని ఆశీర్వదించారు. వారితో కాసేపు సంభాషించి ఎలా చదువుకుంటున్నారు అని, రాఖీ పండుగ సందర్భంగా ఏం కావాలని ఆప్యాయంగా పిల్లలను అడగగా ఐస్ క్రీమ్స్ కావాలని కోరారు. వెంటనే జిల్లా కలెక్టర్ పిల్లలందరిని షాప్స్ కి తీసుకు వెళ్ళి వారికి నచ్చిన దుస్తులను తీసుకోవాలని, స్వీట్ షాప్, ఐస్ క్రీమ్ పార్లర్లలో వారికి నచ్చిన ఐస్ క్రీమ్స్, స్వీట్స్ కొనివ్వాలని అందుకు అవసరమైన డబ్బులను నేను వ్యక్తిగతంగా ఇస్తానని జిల్లా సంక్షేమ అధికారి శారదకు సూచించారు. బాలసదనం విద్యార్థుల జీవితాలు ఎల్లప్పుడూ ఆనందం, సుఖసంతోషాలతో విలసిల్లాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు.
అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ రెవిన్యూ శ్రీనివాస్ రెడ్డికి, గ్రీవెన్స్ లో వివిధ శాఖల అధికారులకు చిన్నారులు రాఖీలు కట్టారు.