Ayodhya:భక్తులతో అయోధ్య కిటకిట:ప్రయాగ్రాజ్లో జరుగుతోన్న మహాకుంభమేళా జనజాతరను తలపిస్తోంది. ఇప్పటి వరకూ దాదాపు 28 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించగా… ఒక్క మౌని అమావాస్య రోజే సుమారు 8 కోట్ల మంది వచ్చినట్టు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. కుంభమేళాకు వచ్చినవారు అక్కడ పుణ్య స్నానాల అనంతరం అయోధ్యకు బారులు తీరుతున్నారు. దీంతో అయోధ్య వీధులు భక్తులతో కిటికిటలాడుతున్నాయి. జై శ్రీరామ స్మరణలతో అయోధ్య నగరం మారుమోగుతోంది. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ సర్కారు అప్రమత్తమైంది.
భక్తులతో అయోధ్య కిటకిట
అయోధ్య , ఫిబ్రవరి 1
ప్రయాగ్రాజ్లో జరుగుతోన్న మహాకుంభమేళా జనజాతరను తలపిస్తోంది. ఇప్పటి వరకూ దాదాపు 28 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించగా… ఒక్క మౌని అమావాస్య రోజే సుమారు 8 కోట్ల మంది వచ్చినట్టు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. కుంభమేళాకు వచ్చినవారు అక్కడ పుణ్య స్నానాల అనంతరం అయోధ్యకు బారులు తీరుతున్నారు. దీంతో అయోధ్య వీధులు భక్తులతో కిటికిటలాడుతున్నాయి. జై శ్రీరామ స్మరణలతో అయోధ్య నగరం మారుమోగుతోంది. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ సర్కారు అప్రమత్తమైంది. రద్దీ నియంత్రణకు కేంద్ర బలగాలను రంగంలోకి దింపింది. కేవలం నాలుగు రోజుల్లోనే బాల రాముడిని దర్శనాలకు 65 లక్షల మంది అయోధ్య నగరంలోకి ప్రవేశించినట్లు ప్రభుత్వం వెల్లడించిందిఉదయం 4 గంటల నుంచి సరయూ నదిలో స్నానాలు ఆచరించి.. హనుమాన్ గర్హి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత బాలక్ రామ్ దర్శనాలకు వెళ్తున్నారు. రామ్పథ్, భక్తిపథ్లు జనసంద్రంలా మారిపోతున్నాయి. అర్ధరాత్రి వరకూ భారీ క్యూలైన్ సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దర్శన సమయాలను అధికారులు పెంచారు. రోజులో 18 గంటల పాటు దర్శనాలకు అవకాశం కల్పించినట్టు తెలిపారు. ప్రతిరోజు రామాలయం, హనుమాన్ గర్హిని దర్శించే సుమారు 3 లక్షల మంది భక్తులకు వసతి కల్పిస్తుంది. భక్తుల రద్దీ నేపథ్యంలో స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్న సీఎం యోగి ఆదిత్యనాథ్… వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని అధికారులకు సూచనలు చేస్తున్నారు.ఆలయ ప్రాంగణంలో మెడికల్ క్యాంపులను ఏర్పాటుచేశారు. అధికారులు, పోలీసులతో పాటు రామమందిర ట్రస్ట్ వాలంటీర్లు నిరంతరాయంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. అటు, కుంభమేళాకు కేవలం మౌని అమావాస్య రోజే దాదాపు 8-10 కోట్ల మంది వచ్చినట్లు అంచనా. అక్కడ నుంచి భక్తులు అయోధ్యకు వెళ్లడంతో గోండా, అంబేద్కర్ నగర్, సుల్తాన్పుర్, లక్నో రోడ్ల వద్ద రద్దీని నియంత్రిస్తున్నామని పోలీసులు వెల్లడించారు. రైల్వే స్టేషన్ల వద్ద కూడా యాత్రికులకు సహాయ కేంద్రాలను పెంచినట్టు అధికారులు తెలిపారు.దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటకతో పాటు గోవా, మహారాష్ట్ర, గుజరాత్ నుంచి రామమందిర దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నట్లు అయోధ్య డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాళ్ తెలిపారు. రోజుకు దాదాపు 3 లక్షల మంది దర్శించుకుంటున్నారని.. రద్దీ నేపథ్యంలో దర్శన సమయాన్ని 18 గంటలకు పెంచామన్నారు.కాగా, కుంభమేళాలో వరుస ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. మౌని అమావాస్య రోజున తొక్కిసలాట చోటుచేసుకుని 30 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. గురువారం ఓ క్యాంపులో గుడారాలకు మంటలు అంటుకున్నాయి