రోజాకు బిగిస్తున్న ఉచ్చు తిరుపతి, ఫిబ్రవరి 15, (న్యూస్ పల్స్) ఆర్కే రోజా టీడీపీ హిట్ లిస్ట్ లో అగ్రభాగాన ఉన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ టీడీపీ నేతల చెవుల్లో మారుమోగిపోతున్నాయి. దీంతో రోజా విషయంలో కూటమి సర్కార్ సీరియస్ గానే ఉందని తెలిసింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆర్కే రోజాను కూడా త్వరలో అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదన్నది పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. నగరి ఎమ్మెల్యేగా ఉన్న ఆర్కే రోజా తర్వాత మంత్రిగా నాటి వైసీపీ హయాంలో బాధ్యతలను స్వీకరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 2019 నుంచి 2024 వరకూ ఆర్కే రోజా టీడీపీముఖ్య నేతలపై వ్యక్తిగత విమర్శలు చేశారు. ప్రధానంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ లపై ఆమె చేసిన వ్యాఖ్యలతో నాడే టీడీపీ…
Read MoreAuthor: Admin
Vallabhaneni Vamshi : వంశీని పక్కాగా బుక్ చేస్తున్నారా ?
వంశీని పక్కాగా బుక్ చేస్తున్నారా ? విజయవాడ, ఫిబ్రవరి 15, (న్యూస్ పల్స్) వల్లభనేని వంశీ అరెస్టుపై టీడీపీ, వైసీపీ మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. వంశీ అరెస్టును వైసీపీ నేతలు ఖండిస్తుంటే.. లోకేష్ రెడ్ బుక్ ఓపెన్ అయ్యిందని టీడీపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. లిస్టులో మరికొందరు ఉన్నట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. కిడ్నాప్, దాడికి సంబంధించిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి.. వంశీకి నోటీసులు ఇచ్చారు. వంశీని అరెస్టు చేస్తున్నట్టు ఆయన భార్యకు పోలీసులు తెలియజేశారు. అయితే ఈ వ్యవహారంపై వైసీపీ, టీడీపీ మధ్య డైలాగ్ వార్ జరుగుతోంది. వంశీ అరెస్టును వైసీపీ ఖండించగా.. టీడీపీ నాయకులు సమర్థిస్తున్నారు.’వంశీ అరెస్ట్‌ను ఖండిస్తున్నాం. ఉపసంహరించుకున్న కేసులో అరెస్ట్ ఏంటి. కక్షపూరిత రాజకీయాలు…
Read MoreBRS : కారు పార్టీ ఎందుకిలా!
కారు పార్టీ ఎందుకిలా హైదరాబాద్, ఫిబ్రవరి 13, (న్యూస్ పల్స్) తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి మొదలైంది. ఉత్తర తెలంగాణ పరిధిలో జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను జాతీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించి… దూకుడుగా ప్రచారాన్ని నిర్వహిస్తోంది. మరోవైపు బీజేపీ సైతం అంజిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది.ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల కోసం అందరికంటే ముందే బీజేపీ అభ్యర్థిని ప్రకటించి… ప్రచారాన్ని కూడా షురూ చేసింది. ఈ ఎన్నికల్లో తమదే విజయమని చెబుతోంది. అయితే కాంగ్రెస్ నుంచి ఒక్కరిద్దరూ టికెట్ కోసం ప్రయత్నించినప్పటికీ…. చివరగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని అభ్యర్థిని ఖరారు చేసింది. పార్టీ నుంచి అధికారిక ప్రకటన రావటంతో నరేందర్ రెడ్డి… ప్రచారంలో దూసుకెళ్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో విజయం సాధించి… కాంగ్రెస్ పార్టీకి గిఫ్ట్ ఇస్తానని చెబుతున్నారు.…
Read MoreKamal Hassan : తీరనున్న కమల్ కల…
తీరనున్న కమల్ కల… చెన్నై, ఫిబ్రవరి 13, (న్యూస్ పల్స్) తమిళ సూపర్ స్టార్, విలక్షణ నటుడు కమల్ హాసన్ రాజ్యసభలోకి అడుగుపెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే పార్టీ కమల్‌ను రాజ్యసభకు నామినేట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది జులైలో జరిగే రాజసభ్య ఎన్నికల్లో డీఎంకే తమ అభ్యర్థిగా కమల్‌ను ప్రతిపాదించే అవకాశం ఉంది. ఇప్పటికే తమిళనాడు మంత్రి పీకే సేకర్ బాబు కమల్ హాసన్‌తో ఆయన నివాసంలో బుధవారం భేటీ అయ్యారు. రాజ్యసభ అంశం గురించే వీరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. కాగా కమల్ హాసన్ మక్కల్ నిధి మయం(ఎంఎన్ఎం) పేరుతో రాజకీయ పార్టీ స్థాపించి.. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో డీఎంకేతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ పొత్తులో భాగంగానే ఎంఎన్ఎంకు ఒక రాజ్యసభ…
Read MoreKumbhamela : కుంభమేళకు హెలికాఫ్టర్ సేవలు
కుంభమేళకు హెలికాఫ్టర్ సేవలు లక్నో, ఫిబ్రవరి 13, (న్యూస్ పల్స్) మహాకుంభమేళా ఈ సారి కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు కోట్ల సంఖ్యలో వెళ్తున్నారు. ఇప్పటికే దాదాపు 42 కోట్ల మంది కుంభమేళాలో పాల్గొని.. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్లు సమాచారం. అయితే.. దేశవిదేశాల నుంచి భక్తులు కుంభమేళాలో పాల్గొనేందుకు వస్తుండటంతో.. ఉత్తరప్రదేశ్‌కు వెళ్లే దారులన్నీ వాహనాలతో నిండిపోయాయి. కొన్ని చోట్ల అయితే.. వంద కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ముందుకు వెళ్లే పరిస్థితి లేదని.. దాదాపు 300 కిలో మీటర్లు ట్రాఫిక్ జామ్ అవ్వడంతో.. చాలా మందిని వెనక్కి వెళ్లిపోవాల్సిందిగా భక్తులకు పోలీసులు సూచినలు చేస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంత భారీ ఎత్తున్న భక్తులు కుంభమేళా కోసం వెళ్తున్నారు.చాలా మంది మార్గమధ్యలోనే ట్రాఫిక్‌లో గంటల…
Read MoreVallabhaneni Vamshi : వల్లభనేని వంశీ అరెస్ట్.
వల్లభనేని వంశీ అరెస్ట్. విజయవాడ, ఫిబ్రవరి 13, (న్యూస్ పల్స్) గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ పటమట పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. ఆయన్ని అక్కడి నుంచి విజయవాడకు తరలిస్తున్నారు. వంశీపై BNS సెక్షన్ 140(1), 308, 351(3), రెడ్ విత్ 3(5) కింద కేసులు నమోదు చేశారు పోలీసులు. అలాగే వంశీపై ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ కేసు.. కిడ్నాప్, హత్యాయత్నం, బెదిరింపు కేసులు కూడా పెట్టారు. అటు వంశీ ఇంటికి నోటీసులు అంటించారు. ఇదిలా ఉంటే.. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కొద్దిరోజుల కిందట ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది.గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి జరిగిందని ఫిర్యాదు చేసిన సత్యవర్థన్.. కేసు వెనక్కు తీసుకుంటున్నట్లు అఫిడవిట్ దాఖలు చేశారు. సత్యవర్థన్ హఠాత్తుగా పిటిషన్ విత్‌డ్రా చేసుకోవడం ఇప్పటికే సంచలనమైంది. ఈ కేసులో ఇవాళ…
Read MorePawan Kalyan : ఆలయాల సందర్శన వెనుక….
ఆలయాల సందర్శన వెనుక…. తిరువనంతపురం, ఫిబ్రవరి 13, (న్యూస్ పల్స్) ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలయాల సందర్శనను ప్రారంభించారు. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రముఖ ఆలయాలను సందర్శించనున్నారు. అందులో భాగంగా ఈరోజు ఆయన కేరళ చేరుకున్నారు. మూడు రోజులపాటు కేరళ తో పాటు కర్ణాటకలో ప్రముఖ ఆలయాలను సందర్శిస్తారు పవన్. ఆయన వెంట కుమారుడు అకిరా నందన్ కూడా ఉన్నారు. ఈరోజు హైదరాబాద్ నుంచి బయలుదేరిన పవన్ కళ్యాణ్ కొచ్చి విమానాశ్రయంలో దిగారు. అక్కడ నుంచి నేరుగా అగస్త్య మహర్షి ఆలయం, ఆశ్రమాన్ని సందర్శించారు. మూడు రోజులపాటు పవన్ దక్షిణ భారతదేశ ఆలయాల సందర్శన ఉంటుంది. అయితే పవన్ ఆలయ సందర్శన వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు ప్రచారం నడిచింది. సనాతన ధర్మ పరిరక్షణకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తోనే ఆయన ఈ…
Read MoreBird Flue : రంగంలోకి దిగిన ర్యాపిడ్ టీమ్స్…కిలో మీటర్ పరిధిలో రెడ్ జోన్….
రంగంలోకి దిగిన ర్యాపిడ్ టీమ్స్… కిలో మీటర్ పరిధిలో రెడ్ జోన్… ఏలూరు, ఫిబ్రవరి 13, (న్యూస్ పల్స్)’ రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున కోళ్ల మరణాలు సంభవిస్తోన్నాయి. తొలుత నాటుకోళ్లు, ఆ తరువాత పందెం కోళ్లకు వ్యాపించిన ఈ వైరస్… చివరికి కోళ్ల ఫామ్‌లనే చుట్టేసి విలయతాండవం చేస్తోంది.ఉభయగోదావరి జిల్లాల్లో ఇప్పటి వరకు దాదాపు 30 లక్షల కోళ్లు మృతి చెందాయి. దీంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ఈనెల 6, 7 తేదీల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు 60కు పైగా శాంపిల్స్‌ను సేకరించాయి. వాటిని విజయవాడలోని రాష్ట్ర పశువ్యాది నిర్ధారణతో పాటు భోపాల్‌లోని హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (ఎన్ఐహెచ్ఎస్ఏడీ)కి పంపాయి. దీంతో కొన్ని శాంపిల్స్ లో బర్డ్‌ఫ్లూ పాజిటివ్ వచ్చింది. ఆ శాంపిల్స్ తీసుకున్న ప్రాంతాలను గుర్తించి… అక్కడ…
Read MorePawan Kalyan : ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ సమావేశం…
ఎమ్మెల్యేలు, ఎంపీలతో పవన్ సమావేశం… విజయవాడ, ఫిబ్రవరి 13, (న్యూస్ పల్స్) జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇరవై మూడో తేదీన పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు. ఇరవై నాలుగో తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాన్ని పవన్ సిద్ధం చేసుకునే అవకాశం ఉంది. అదే సమయంలో కూటమి పార్టీ ఎమ్మెల్యేల సమావేశం కూడా జరిగే అవకాశం ఉంది. పవన్ కల్యాణ్.. అనారోగ్యంతో ఇటీవలి కాలంలో అధికార కార్యక్రమాల్లో లేరు. ఆయన నాలుగు రోజుల పాటు పుణ్యక్షేత్రాల పర్యటనకు కేరళ, తమిళనాడు వెళ్లారు. అక్కడి పర్యటన పూర్తయిన తర్వాత స్పాండిలైటిస్ కు కేరళ వైద్యం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన అక్కడి వైద్యం గురించి ఆరా తీశారు. ఇటీవలి కాలంలో పవన్ కల్యాణ్ పంథా…
Read MoreWork From Home Policy for Women in AP : మహిళల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్…
మహిళల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్… జీసీసీ పాలసీ 4.0 కోసం కసరత్తు కాకినాడ, ఫిబ్రవరి 13, (న్యూస్ పల్స్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్క్ ఫ్రం హోమ్ జాబ్‌ను ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా మహిళలకు ఇంటి నుంచి పని చేయడం సౌలభ్యంగా ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇంట్లో నుంచి పని చేయడం వల్ల శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పెరిగే అవకాశం ఉంటుందని ట్విట్టర్ వేదికగా సీఎం వ్యాఖ్యానించారు.రాష్ట్రంలోని మహిళల కోసం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని ప్రారంభించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. అంతర్జాతీయ సైన్స్ లో మహిళలు, బాలికల దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. రోజురోజుకీ అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఇంటి నుండి పని చేసే సంస్కృతి పెరిగిందన్నారు. సైన్స్ రంగంలో విజయం సాధిస్తున్న మహిళలను…
Read More