– తెలంగాణలో తగ్గిపోతున్న అడవుల విస్తీర్ణం… హైదరాబాద్, డిసెంబర్ 26, (న్యూస్ పల్స్) తెలంగాణ అడవులు గత కొన్నేళ్లుగా బాగా పెరగడం లేదు. థిక్ ఫారెస్ట్ అన్నది లేదు. అంతా పలుచబడి పోయాయి. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ప్రకారం, రాష్ట్రంలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో కేవలం 454 చదరపు కిలోమీటర్లలోనే పాతవిగా పరిగణించే చెట్లున్నాయి. వన్యప్రాణి అభయారణ్యాలు, నేషనల్ పార్క్ వంటి రక్షిత ప్రాంతాలకు వెలుపల ఉన్న మిగిలిన అడవులు చాలా చిన్న చెట్లతోనే కనిపిస్తున్నట్లు రిపోర్ట్ తెలిపింది. పాత అడవులు క్రమంగా కనుమరుగవుతున్న విషయాన్ని రిపోర్ట్ స్పష్టంగా ప్రస్తావించింది. అంతే కాదు తెలంగాణలోని 13,480 చదరపు కిలోమీటర్ల రేంజ్ లోని రిజర్వ్ ఫారెస్ట్‌లలో చెట్ల బెరడును తీసేసి, చెట్టు మొదలులో లోపలికి కోత పెట్టి.. దాన్ని డెడ్ వుడ్ గా మార్చే…
Read MoreAuthor: Admin
Hydra ; రెడీ అవుతున్న హైడ్రా యాప్
రెడీ అవుతున్న హైడ్రా యాప్ హైదరాబాద్, డిసెంబర 26, (న్యూస్ పల్స్) చెరువులు, కుంటలను ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలపై గత కొన్ని నెలలుగా హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. హైదరాబాద్ నగరంలో చెరువుల ఆక్రమణ, ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు తొలగించేందుకు ఏర్పాటైన హైడ్రా.. భవిష్యత్తు తరాలకు ఓ మంచి నగరాన్ని అందించాలన్న సంకల్పంతో ఏర్పాటైందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. సరైన ప్రణాళికతో నిర్మాన అనుమతితో సంబంధం లేకుండా ముందుకు సాగుతున్నారు. ఇప్పటివరకు 27 ప్రాంతాల్లో కూల్చివేతలు చేపట్టి సంచలనం సృష్టించిన రంగనాథ్.. పలు జిల్లాల్లోనూ హైడ్రా ఏర్పాటు చేయాలనే అభ్యర్థనపై ఆయన స్పష్టమైన వివరణిచ్చారు.హైడ్రా ఏర్పాటుకు ముందు ఇచ్చిన అనుమతులు చెల్లుతాయని, ఆ నిర్మాణాలను కూల్చబోమని రంగనాథ్ స్పష్టం చేశారు. కాలనీ సంఘాలు చేస్తున్న ఫిర్యాదులకు తొలి ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఎఫ్టీఎల్లో…
Read MorePawan Kalyan : ఏజెన్సీ ప్రాంతాలపై పవన్ ఫోకస్
ఏజెన్సీ ప్రాంతాలపై పవన్ ఫోకస్ విశాఖపట్టణం, డిసెంబర్ 26, (న్యూస్ పల్స్) పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికలకు ముందు జనసేనను స్థాపించినప్పుడు ఈ పార్టీ ఉంటుందా.. ప్రజారాజ్యం పార్టీలో లాగా కాలగర్భంలో కలిసిపోతుందా? అనే అనుమానాలు చాలామందిలో తలెత్తాయి. కానీ జనసేనానిని రాజకీయాల్లో తన బలమేంటో చూపించుకోవడానికి ఎన్నో ఒడిదుడుకులు చవి చూశారు. జనసేన పార్టీ స్థాపించినప్పుడు టీడీపీ, బీజేపీ కూటమికి 2014 ఎన్నికల్లో మద్దతు ఇచ్చి పోటీ చేయకుండా ప్రభుత్వ ఏర్పాట్లులో కీలకంగా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి దారుణంగా దెబ్బతిని, ఒంటరిపోరుకు తన బలం సరిపోదని అర్థం చేసుకున్నారు.2024 ఎన్నికలకు ముందు కూటమి ఏర్పాటుకు తానే ముందుండి చొరవ తీసుకున్నారు. టీడీపీ, బీజేపీలతో పొత్తు సెట్ చేయడమే కాదు 151 యొక్క సీట్లతో గెలిచామన్నా వైసీపీ గర్వాన్ని అణచివేశారు .. 2024…
Read MoreVizag Steel : ప్రైవేటీకరణ దిశగా విశాఖ స్టీల్ ప్లాంట్
– ప్రైవేటీకరణ దిశగా విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖపట్టణం, డిసెంబర్ 26, (న్యూస్ పల్స్) కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్-ఆర్ఐఎన్ఎల్)ను ప్రైవేటీకరణ చేసేందుకు మొగ్గు చూపుతోంది. ఇప్పటికే కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలపడంతో చర్యలకు పూనుకుంటుంది. అందులో భాగంగానే స్టీల్‌ప్లాంట్‌లోని ఒక్కో భాగం ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధపడింది. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లోని వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి కేంద్ర ప్రకటన వెలువడిన తరువాత ఒక్కొక్క చర్యలు చేపట్టింది.ఇప్పటికే దాదాపు 2,000 మంది ఉద్యోగులను ఛత్తీస్‌గడ్‌లోని నాగర్నర్ స్టీల్‌ప్లాంట్‌కు పంపడానికి సిద్ధపడింది. అలాగే 4,200 మంది స్టీల్‌ప్లాంట్ కాంట్రాక్ట్ వర్కర్స్‌ను తొలగించేందుకు వారికి ఎంట్రీ, ఎగ్జిట్ పాస్‌లను ఇవ్వకుండా కుట్రలు చేసింది. కార్మికులు పోరాటంతో యాజమాన్యం వెనక్కి తగ్గింది. అలాగే బ్లాస్ ఫర్నేస్‌ను నిలిపివేసింది. ఆక్సిజన్ ప్లాంట్‌ను నిలిపివేసింది. మళ్లీ కార్మికుల…
Read MoreAndhra Pradesh : పందెం కోళ్లకు డిమాండ్ షురూ
– పందెం కోళ్లకు డిమాండ్ షురూ… ఏలూరు, డిసెంబర్ 26, (న్యూస్ పల్స్) సంక్రాంతి అంటేనే కోడిపందేలు… కోడి పందేలు అంటే సంక్రాంతి.. అలా వుంటుంది క్రేజ్.. ఏపీలో.. మరీ ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో సంక్రాంతి హడావిడిగురించి ఎంత చెప్పినా తక్కువే.. పండగ మూడు రోజులు కోడిపందేల జోష్ ఇక్కడి ప్రజలను ఊపేస్తుంది..కోడిపందేల పేరుతో కోట్లాది రూపాయలు చేతులు మారతాయి. గోదావరి జిల్లాలకే ప్రత్యేకత తెచ్చిన కోడి పందేలకు కోళ్లు సిద్ధమయ్యాయి. దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేవారు ఇప్పటికే రైలు, బస్సు, ఫ్లైట్ టికెట్లు బుక్ చేసేసుకున్నారు. ఇక పందెం రాయుళ్లు హడావిడి కూడా పండుగ ముందు నుంచే మొదలైంది మరో రెండువారాలు దాటితే….కోడిపుంజులను కొనేందుకు ఎగబడతారు పందెం రాయుళ్లు. కండబట్టి పందేనికి సిద్ధంగా ఉన్న ఒక్కో కోడి పుంజు ధర 50 వేల…
Read MoreAP Roads : ఆంధ్రప్రదేశ్ లో మారిపోతున్న రహదారులు
ఆంధ్రప్రదేశ్ లో మారిపోతున్న రహదారులు విజయవాడ, డిసెంబర్ 26, (న్యూస్ పల్స్) ఆంధ్రప్రదేశ్ లో రహదారులు అన్నీ అద్వాన్నంగా ఉన్నాయి. గత ప్రభుత్వం రహదారులను పట్టించుకోలేదు. దీంతో రహదారులన్నీ గుంతలమయంగా మారాయి. ఎక్కడ చూసినా గుంతలే. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక సంక్రాంతి పండగ నాడు అక్కడకు వెళ్లిన వారంతా ముక్కున వేలేసుకున్నారు. ఏపీ రహదారులపై ప్రయాణించడం కష్టమేనని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ నుంచి అనేక మంది ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అప్పటి మంత్రి కేటీఆర్ కూడా ఏపీ రహదారులపై సెటైర్లు వేశారు. తనకు ఆంధ్రకు వెళ్లివచ్చిన మిత్రుడొకరు చెప్పారని, ఏపీ రహదారులపై ప్రయాణించడం నరకమేనని అన్నారన్నారు. తెలంగాణలో రహదారులను చూసి గర్వంగా ఉందని కూడా కేటీఆర్ అన్నారు.. అప్పట్లో ఏపీలో రహదారుల పరిస్థితిపై సోషల్ మీడియాలో పెద్దయెత్తున చర్చ జరిగింది.…
Read MoreAllu Arjun Press Meet over Sandhya Theatre Incident
Allu Arjun Press Meet over Sandhya Theatre Incident
Read MoreTelangana Assembly : రణరంగంగా మారిన అసెంబ్లీ
– రణరంగంగా మారిన అసెంబ్లీ హైదరాబాద్ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ఆరో రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. వాయిదా తీర్మానంపై బీఆర్ఎస్ నేతలు చర్చకు పట్టుపట్టారు . ఈ ఫార్ములా కార్ రేసింగ్‌పై చర్చ కోసం బీఆర్ఎస్ నేతలు వాయిదా తీర్మానం ఇచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అక్రమ కేసు పెట్టారంటూ నల్ల బ్యాడ్జీలతో మండలికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వచ్చారు. సభలో ఫార్ములా- ఈ అంశంపైన వెంటనే సభలో చర్చకు బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. నల్ల బ్యాడ్జీలు, ఫ్లకార్డ్లతో అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 420కాంగ్రెస్ ఇచ్చిన బూటకపు హామీలను ప్రశ్నించినందుకే అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. ఫార్ములా- ఈ పైన కేసు అక్రమం అంటూ ప్లకార్డుల ప్రదర్శన, నినాదాలు చేశారు. దీంతో అసెంబ్లీ రణరంగంగా…
Read MoreCharlapalli Railway Station : 28న చర్లపల్లి రైల్వేస్టేషన్ ప్రారంభం
– 28న చర్లపల్లి రైల్వేస్టేషన్ ప్రారంభం హైదరాబాద్, డిసెంబర్ 20, (న్యూస్ పల్స్) చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభానికి ముహూర్తం ఖరారు అయ్యింది. ఈ నెల 28న కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కిషన్‌రెడ్డి దీన్ని ప్రారంభించనున్నారు. దాదాపు రూ.430 కోట్ల వ్యయంతో చర్లపల్లి టెర్మినల్‌ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. ఇక్కడ ప్రయాణికులకు ఉచిత వైఫై సదుపాయం కల్పించనున్నారు.ఇక్కడ ఫుడ్ కోర్టులు, రెస్టారెంట్లు, ప్రయాణికుల కోసం వెయిటింగ్ ఏసీ, నాన్ ఏసీ హాల్స్, రిజర్వేషన్ కౌంటర్లు, టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రెండు ఎంఎంటీఎస్ ప్లాట్‌ఫాంలతో కలిపి 9 ప్లాట్‌ఫాంలు, 2 ఫుట్ఓవర్ బ్రిడ్జిలు, 6 ఎస్కలేటర్లు నిర్మించారు.చర్లపల్లి టెర్మినల్ ప్రారంభమైన తర్వాత 50 రైళ్లు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించనున్నాయి. ప్రతిరోజూ దాదాపు 50 వేల మంది ప్రయాణికులు రాకపోకలు…
Read MoreDelhi Air Pollution : డేంజర్ జోన్ లో ఢిల్లీ
– డేంజర్ జోన్ లో ఢిల్లీ న్యూఢిల్లీ, డిసెంబర్ 20, (న్యూస్ పల్స్) దేశ రాజధానిని పొంగమంచు, కాలుష్యం ఇబ్బంది పెడుతున్నాయి. నెల రోజులుగా ఇబ్బంది పడుతున్న ఢిల్లీ వాసులను మూడు రోజులుగా పరిస్థితులు మరింత కష్టంగా, కఠినంగా మార్చాయి. మారిన వాతావరణం, పడిపోతున్న ఉష్ణోగ్రతలు ఊపిరి సడలకుండా చేస్తున్నాయి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం, ఢిల్లీలో మొత్తం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఉదయం 7:15 గంటలకు 442 వద్ద నమోదైంది, జాతీయ రాజధానిలోని అనేక ప్రాంతాలు 400 నుంచి 500 మధ్య స్థాయిలను నమోదు చేస్తున్నాయి.పొగ మంచు కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో విజిబిలిటీ 300 మీటర్లకు పడిపోయిన తర్వాత తక్కువ–విజిబిలిటీ విధానాలతో ప్రాంతం అంతటా దృశ్యమానత గణనీయంగా తగ్గింది. ఆనంద్ విహార్ (481), అశోక్ విహార్ (461), బురారీ క్రాసింగ్ (483), మరియు నెహ్రూ…
Read More