Argument between Revanth Reddy and KTR on central budget | కేంద్ర బడ్జెట్ పై.. రేవంత్ రెడ్డి, కెటిఆర్ మధ్య వాగ్వాదం | Eeroju news

Argument between Revanth Reddy and KTR on central budget

కేంద్ర బడ్జెట్ పై.. రేవంత్ రెడ్డి, కెటిఆర్ మధ్య వాగ్వాదం

హైదరాబాద్ జూలై  25

Argument between Revanth Reddy and KTR on central budget

రేవంత్ రెడ్డి పక్కనే మానవ బాంబులు!: నీళ్లివ్వడం చేతకాదంటూ కేటీఆర్ విమర్శలు | KTR criticizes cm revanth reddy for water crisis in telangana - Telugu Oneindiaకేంద్ర బడ్జెట్ పై తెలంగాణ రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నేడు అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బిఆర్ ఎస్ నాయకుడు కెటిఆర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కెటిఆర్ అవగాహనా రాహిత్యంతో సభను తప్పుదోవ పట్టిస్తున్నారని అనడమే కాకుండా, సభకు కెసిఆర్ ఎందుకు రాలేదని నిలదీశారు. దానికి స్పందించిన కెటిఆర్ ‘‘ మాకు జవాబు చెప్పండి చాలు. మీకు కెసిఆర్ అవసరం లేదు’’ అన్నారు. దాంతో రెచ్చిపోయిన రేవంత్ రెడ్డి ‘‘ తండ్రి పేరు చెప్పుకుని మంత్రిని కాలేదు.

కింది స్థాయి నుంచి పైకి వచ్చాను. కెటిఆర్ ది మేనేజ్ మెంట్ కోటా అనుకున్నా, అంతకంటే దారుణం’’ అన్నారు. దానికి కౌంటర్ గా కెటిఆర్ ‘‘ రేవంత్ పేమెంట్ కోటాలో సిఎం అయ్యారని మేమూ అనొచ్చు’’ అని కౌంటర్ ఇచ్చారు.

Revanth Reddy News in Telugu | Latest Revanth Reddy Telugu News Updates, Videos, Photos - Oneindia Telugu

ఆ తర్వాత రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఇప్పటి వరకు ఓ విద్యుత్ విధానమే లేదన్నారు. రూ. 7 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్లిపోయారన్నారు. గత ప్రభుత్వ పాలనలోనే విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్నదన్నారు. తర్వాత కెటిఆర్ మాట్లాడుతూ  ‘‘మోడీ ప్రభుత్వాన్ని దెబిరించొద్దు. యాచిస్తే ఏమీ రాదు…శాసించి సాధించుకోవాలి.

ఢిల్లీ తత్వం ఇంత కాలానికి కాంగ్రెస్ కు బోధపడింది. కేంద్ర వివక్షను ఎండగట్టడంలో సహకరిస్తాం. గతంలో కేంద్రం సాయం చేయకపోయినా ఎంతో అభివృద్ధి చేశాం. ధైర్యం ఉంటే మోడీని విమర్శించండి. చీకటి ఒప్పందాలు మాకు అలవాటు లేదు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి ఏమీ కేటాయించకుంటే మేమేం చేస్తాం?’’ అని కెటిఆర్ చెప్పుకొచ్చారు.

Argument between Revanth Reddy and KTR on central budget

 

KTR PA in scam? | గొర్రెల స్కామ్ లో కేటీఆర్ పీఏ ? | Eeroju news

Related posts

Leave a Comment