రోజా క్లారిటీ ఇచ్చేశారుగా…
తిరుపతి, ఆగస్టు 31, (న్యూస్ పల్స్)
AP Roja
జగన్ కు రోజా షాక్ ఇవ్వనన్నారా? వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారా? ఈ మేరకు సంకేతాలు ఇచ్చారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైసిపి ఓటమి తర్వాత రోజా ఎక్కడా కనిపించడం లేదు. జగన్ పెట్టిన సమావేశాలకు హాజరు కావడం లేదు. సొంత నియోజకవర్గం నగిరి వైసీపీని కూడా పట్టించుకోవడం లేదు. ఈ 80 రోజుల్లో ఒకటి రెండు సార్లు మాత్రమే ఆమె స్పందించారు. తరువాత కనిపించకుండా వెళ్ళిపోయారు. అయితే ఆమె భర్త తమిళ దర్శకుడు కావడంతో.. తమిళనాడు వెళ్ళిపోయారని ప్రచారం సాగింది. తమిళ సినిమా రంగం తో పాటు బుల్లితెరపై దృష్టి పెట్టారని.. పనిలో పనిగా విజయ్ కొత్త పార్టీలో చేరుతారని పెద్ద ఎత్తున టాక్ నడిచింది.
సోషల్ మీడియాలో సైతం ఇదే వైరల్ అంశంగా మారింది. అయితే దానికి ఇంతవరకు ఎవరు ధ్రువీకరించలేదు. ఆమె సైతం నోరు తెరవలేదు. కానీ ఆమె స్పష్టమైన సంకేతాలు మాత్రం పంపించగలిగారు. వైసీపీని వీడుతానని పరోక్షంగా సంకేతాలు పంపారు.రోజా సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా పదవి బాధ్యతలు చేపట్టారు. నగిరి నుంచి టిడిపి తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 2009లో వైయస్ రాజశేఖర్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారు. కానీ ఇంతలో వైయస్సార్ అకాల మరణం చెందారు. అటు తరువాత జగన్ వైసీపీని ఏర్పాటు చేశారు. అదే పార్టీలో చేరారు రోజా.
2014, 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున నగిరి నియోజకవర్గం నుంచి రోజా గెలిచారు. మంత్రివర్గ విస్తరణలో జగన్ ఆమెకు ఛాన్స్ ఇచ్చారు. అయితే గత ఐదేళ్లుగా రోజా దూకుడుగా వ్యవహరించారు. చాలా సందర్భాల్లో వివాదాస్పదం అయ్యారు. కానీ ఈ ఎన్నికల్లో ఆమె ఓడిపోయారు. గత ఐదేళ్ల కాలంలో ఆమె వ్యవహరించిన తీరుతో ప్రత్యర్థులకు టార్గెట్ అయ్యారు. అందుకే ఏపీని విడిచి తమిళనాడు వెళ్లిపోయారని ప్రచారం సాగింది.అయితే తమిళనాడులో టీవీ చానల్స్ లో షో చేయనున్నారని కూడా తెలుస్తోంది. ఇంకోవైపు విజయ్ ఏర్పాట్లు చేసిన కొత్త పార్టీలో చేరతారని కూడా ప్రచారం సాగింది.
అయితే వైసీపీని వీడుతానని మాత్రం రోజా ప్రకటించలేదు. అయితే సోషల్ మీడియా ద్వారా మాత్రం సంకేతాలు ఇవ్వగలిగారు. ఫేస్బుక్, ఇన్ స్థా, వాట్సాప్ లలో రోజా యాక్టివ్ గా ఉండేవారు. డీపీలుగా ఆమె వైసీపీ అధినేత జగన్ ఫోటోలతో పాటు పార్టీ జండాలను పెట్టుకునేవారు. కానీ గత రెండు రోజులుగా వాటిని తొలగించారు. ఎక్కడ జగన్ పేరు, ఫోటో లేకుండా జాగ్రత్త పడ్డారు. తరచూ తమిళనాడు సీఎం స్టాలిన్ ను కలుస్తున్నారు. దీంతో ఆమె వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారని ప్రచారం ప్రారంభమైంది. దీనిని కూడా ఆమె ఖండించకపోవడం అనుమానాలు మరింత పెరుగుతున్నాయి.
The stage is set for Roja’s arrest | రోజా అరెస్ట్ కు రంగం సిద్ధం | Eeroju news