AP News | ఆ రెండు పార్టీల మధ్య సోషల్ వార్… | Eeroju news

ఆ రెండు పార్టీల మధ్య సోషల్ వార్...

ఆ రెండు పార్టీల మధ్య సోషల్ వార్…

గుంటూరు, నవంబర్ 11, (న్యూస్ పల్స్)

AP News

అధికార టీడీపీ, వైసీపీ మధ్య ట్వీట్ల వార్ నడుస్తోంది. అటు సోషల్ మీడియాలో దుష్ప్రచారం, దారుణమైన పోస్టింగ్ పెట్టిన వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్, దారుణమైన ప్రచారం, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ చేసిన పోస్టులపై ఏపీ పోలీసులు ఫోకస్ చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హోం మంత్రి వంగలపూడి అనిత కూడా తాము సైతం బాధితులమేనని.. అందుకే వీటిని సీరియస్ గా తీసుకుని, బాధ్యుతలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు వైసీపీ, టీడీపీ సోషల్ మీడియా వార్ కొనసాగుతోంది.సోషల్ మీడియాలో మురికి పోస్టులు పెడితే ఊరుకునేది లేదు.. చర్యలు తప్పవు.. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే చర్యలు మొదలవుతున్నాయి. ఇప్పటికే 1500కు పైగా సోషల్ మీడియా అకౌంట్స్‌ను వివాదాస్పదమైనవిగా గుర్తించిన పోలీసులు.. 100 మందికి పైగా ఖాతాదారుల్ని అదుపులోకి తీసుకున్నారు.

కేవలం నోటీసులిచ్చి వదిలేస్తారని భ్రమపడొద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అటు.. మాజీ సీఎం జగన్‌పై ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ.. విశాఖలో నిరసనకు దిగారు వైసీపీ నేతలు. కేవలం టీడీపీ-జనసేన నేతలపై పెట్టిన పోస్టుల్నే చూడ్డం తగదని, జగన్‌పై సోషల్‌ మీడియాలో జరిగిన అసత్య ప్రచారం సంగతేంటని రివర్స్‌ గేర్ వేస్తోంది వైసీపీ. వైసీపీ నేతలపై జరిగిన ట్రోలింగ్ చూశారా అంటూ ఆధారాలతో సహా గుంటూరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. తమ కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని, తీవ్రవాదుల్లా హింసిస్తున్నారని ఆరోపించారు.ఎవర్నీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఏకంగా డీజీపీ నుంచే వార్నింగ్ వచ్చేసింది కనుక.. యాక్షన్ కూడా అదే రేంజ్‌లో మొదలైంది. రాష్ట్రస్థాయి ప్రముఖనేతల పర్సనల్ అసిస్టెంట్లకు సైతం నోటీసులు వెళ్లాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని హోం మంత్రి అనిత దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

హైకోర్టులో వరుస కేసులు రిజిస్టర్ కావడంతో.. ముఖ్యమంత్రి సైతం ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని రివ్యూ చేస్తున్నారు.సోషల్‌మీడియాలో అసభ్య పోస్టులు పెట్టే వాళ్లకు మరోసారి సీఎం చంద్రబాబు దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చారు. ఆడబిడ్డల జోలికి వస్తే వదిలిపెట్టేది లేదన్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. రౌడీలు రాజకీయ ముసుగులో ఉన్నారు.. వాళ్ల ముసుగులు తీస్తామన్నారు. లాలూచీ పడే అధికారులపైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎవరైనా తప్పుడు ధోరణితో ఉంటే.. ఇప్పటికైనా మానుకోండి.. మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటామంటూ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఫేక్ అడ్రస్‌లతో పోస్టులు పెట్టే వాళ్లను వదిలిపెట్టమని.. వైసీపీ నేతల కుటుంబాలపై పోస్టులు పెట్టినా వదిలిపెట్టమంటూ వార్నింగ్ ఇచ్చారు.

నిక్క‌ర్ మంత్రి లోకేష్, నువ్వు మంత్రివి ఎలా అయ్యావు? సీఎం కార్యాల‌యంలో పెన్నులు, పేప‌ర్ల కోసం కోట్లు దుర్వినియోగం అంటూ దుష్ప్రచారం చేస్తున్న నిన్ను ఏ జైల్లో పెట్టాలి? నీకు ఏ శిక్ష వేయాలని వైసీపీ ఎక్స్ ఖాతాలో ప్రశ్నించింది. నీ బ‌తుకంతా కూడా వైయస్ జ‌గ‌న్ పై, గత వైసీపీ ప్ర‌భుత్వంపై దుష్ప్ర‌చారం చేయ‌డ‌మేనా? నిక్క‌ర్ మంత్రీ.. ప్ర‌తిసారీ నీ అజ్ఞానాన్ని ఇలా బ‌య‌ట‌పెట్టుకోవ‌డానికి సిగ్గుగా లేదా? అని లోకేష్ ట్వీట్ కు వైసీపీ ఘాటు రిప్లై ఇచ్చింది. ముఖ్య‌మంత్రి క్యాంప్ కార్యాల‌యం అంటే అక్కడే ఐదారుగురు ప్రిన్సిపల్ సెక్రటరీలు.. వాళ్ల దగ్గర స్టాఫ్ ఉంటారు. వారు రాష్ట్ర పరిపాలనను పర్యవేక్షిస్తుంటారు.ఏపీ మంత్రి నారా లోకేష్ ను నిక్కర్ మంత్రి అని వైసీపీ అధికారిక ఎక్స్ ఖాతాలో చేసిన పోస్ట్ దుమారం రేపుతోంది.

మాజీ సీఎం జగన్ ను అసెంబ్లీ అంటే భయపడే పులివెందుల పిల్లి అని, కట్ డ్రాయర్ ఎమ్మెల్యే అంటూ టీడీపీ సైతం అదే స్థాయిలో బదులిచ్చింది. నీకు ఆత్రం ఎక్కువ తప్ప, ఏమి చెప్తున్నావో నీకే అర్ధం కావటం లేదు.. ఒక పక్క పెన్నులు, పేపర్ల కోసం కోట్లు ఖర్చు పెట్టలేదు అని జగన్ అంటాడు, ఇంకో పక్క స్టాఫ్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఖర్చు పెట్టాను అంటావ్. బుర్రలో గుజ్జు పెంచుకునే మాత్రలు వాడాలని, రూ.9.84 కోట్లతో కొన్న పెన్నులతో స్క్రిప్ట్ ఎలా రాయాలో నేర్చుకోవాలంటూ టీడీపీ పోస్ట్ చేసింది. ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన ట్వీట్ తో టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇంతకీ నారా లోకేష్ ఏమన్నారంటే.. ఏపీ విద్యార్థులకు ఓ ప్రశ్న. మీరు వాడే పెన్ను ధర ఎంత ఉంటుంది చెప్పాలని లోకేష్ ప్రశ్న అడిగారు.

వైఎస్ జగన్ అయితే తాడేపల్లి ప్యాలెస్ లో పేపర్లు, పెన్నులకు ఏకంగా రూ.98,400,000 (రూ.9 కోట్ల 84 లక్షలు) ఖర్చు చేశారు. ఈ మొత్తాన్ని సరిగ్గా ఖర్చు చేసింటే ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్ కు బాటలు పడేవని లోకేష్ ట్వీట్ చేశారు.ఏపీ సీఎంఓలో స్టేషనరీ, నాన్ స్టేషననరీ ఖర్చులు కలిపి మొత్తం రూ.9.84 కోట్లు ఖర్చు చేశారంట, వైఎస్ జగన్ నిజంగానే పెన్నుతో రాస్తున్నారని భావిస్తున్నారా అని లోకేష్ ఏపీ విద్యార్థులను అడుగుతూ మాజీ సీఎంపై సెటైర్లు వేశారు. ఈ ట్వీట్ వైసీపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పించడంతో సోషల్ మీడియాలో ట్వీట్ వార్ మళ్లీ మొదలైంది.

ఆ రెండు పార్టీల మధ్య సోషల్ వార్...

Social war started | ప్రారంభమైన సోషల్ వార్…. | Eeroju news

Related posts

Leave a Comment