AP New Liquor Policy | ఏపీలో కిక్కే కిక్కు | Eeroju news

ఏపీలో కిక్కే కిక్కు

ఏపీలో కిక్కే కిక్కు

నెల్లూరు, అక్టోబరు 22, (న్యూస్ పల్స్)

AP New Liquor Policy

కొత్త సీసా..కొత్త మందు..తగ్గిన రేటు. ఇక కిక్కే కిక్కు. ఏపీలో కొత్త మద్యం పాలసీ మందు బాబులకే కాదు..లిక్కర్ వ్యాపారులకు, ప్రభుత్వానికి కూడా మంచిరోజులు తీసుకొచ్చింది. గత ఐదేళ్లలో టేస్ట్‌ లేని మందు..నోటితో పలకలేని బ్రాండ్లు చూసి చిర్రెత్తిపోయిన మందుబాబులు..ఇప్పుడు లో కాస్ట్‌కే ప్రీమియం లిక్కర్‌ను తాగి ఎంజాయ్ చేస్తున్నారు. టెండర్లలో షాపులు దక్కించుకున్న వ్యాపారులకు కూడా మంచిగానే బిజినెస్ అవుతోంది. ఇక ప్రభుత్వానికి టెండర్ ఫీజ్‌ నుంచి సేల్స్‌ వరకు ఖజానాలో కాసులు వచ్చి పడుతూనే ఉన్నాయి. కొత్త లిక్కర్ షాపులు తెరుచుకుని వారం రోజులే అయింది. ఇప్పటికే రికార్డు స్థాయి సేల్స్ జరుగుతున్నాయి.

ఏకంగా ఆరు వందల కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగినట్లు అంచనా. ఇలా తెరుచకున్నాయో లేదో.. కొత్త మద్యం షాపులు సందడిగా మారాయి. పాత బ్రాండ్ల రావడంతో పాటు..రూ.99కే క్వార్టర్‌ మందు దొరుకుతుండటంతో ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు మందుబాబులు.అయితే కొన్ని షాపుల్లో ఇప్పటికీ కూడా రూ.99కే క్వార్టర్ మద్యం అందుబాటులో లేదు. రూ.145కు క్వార్టర్ మద్యం అంటూ షాపుల నిర్వహకులు అమ్మకాలు చేస్తున్నారు. ఈ విషయంలో కొంత అసంతృప్తి వ్యక్తమవుతున్నా వైన్‌ షాపుల దగ్గర రద్దీ మాత్రం తగ్గడం లేదు.ఏపీ ఆబ్కారీ శాఖకు కాసుల మత్తు కిక్కెస్తోంది. కొత్త మద్యం పాలసీ స్టార్టింగ్‌లోనే రికార్డు స్థాయి ఆదాయం రాబడుతోంది ఆబ్కారీ శాఖ.

మద్యం అమ్మకాల్లో సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. కొత్త లిక్కర్ షాపులు మొదలైన వారం రోజుల్లోనే రూ.6వందల కోట్లకు పైగా విలువ చేసే సరుకు గౌడన్ల నుంచి బయటకు వెళ్లింది.రాష్ట్రంలోని మద్యం డిపోల నుంచి 6లక్షల 77వేల 511 కేసుల మద్యం, లక్షా 94వేల 261 బీర్ల కేసులు అమ్మారు. బార్ల కంటే మందు బాబులు మద్యం షాపుల వైపే వెళ్తున్నారు. ఆబ్కారీ శాఖ ప్రకటించినట్లు రూ.99లకే క్వార్టర్ పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోయినా..ఇంకా కొన్ని షాపులు ప్రారంభించనప్పటికీ..అమ్మకాలు మాత్రం భారీగానే జరుగుతున్నాయి.గతంలో ప్రభుత్వ మద్యం షాపుల్లో కొన్ని బ్రాండ్లు మాత్రమే దొరికేవి. పైగా రేట్లు కూడా ఎక్కువే. దీంతో మద్యం ప్రియులు వైన్‌ షాపుల కంటే బార్లకే వెళ్లేవారు.

వివిధ పన్నుల పేరుతో బార్లలో క్వార్టర్ బాటిల్‌కు రూ.80 వరకు వసూలు చేసేవారు బార్ల నిర్వహకులు. గత ప్రభుత్వంలో మద్యం షాపుల కంటే బార్లకే ఎక్కువ ఆదాయం వచ్చిందని చెప్పొచ్చు.కొత్త మద్యం పాలసీలో పాత బ్రాండ్లు వచ్చేశాయ్. ప్రీమియం బ్రాండ్లు కొన్ని అందుబాటులో ఉన్నాయ్. పైగా రేట్లు కూడా తక్కువే. దీంతో బార్ల కంటే వైన్‌షాపులకే వెళ్తున్నారు పబ్లిక్. ఇలాగే కొద్ది రోజులు కొనసాగితే మందుబాబులు షాపులకు అలవాటు పడతారనే టెన్షన్ బార్ల నిర్వహకుల్లో కనిపిస్తోంది. దీంతో క్వార్టర్‌ బాటిల్‌పై రూ.30 వరకు తగ్గిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారు.కొత్త మద్యం పాలసీతో ప్రభుత్వానికి అయితే ఆదాయం భారీగా పెరిగింది. టెండర్ ఫీజు రూపంలోనే ప్రభుత్వానికి దాదాపు రూ.18 వందల కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు రికార్డు స్థాయి లిక్కర్‌ సేల్స్‌తోనూ ఆబ్కారీ శాఖ ఇన్‌కమ్‌ పెరిగిపోయింది. ఇలా కొత్త లిక్కర్‌ స్కీమ్‌ ఇటు జనాలకు..అటు వ్యాపారులకు..ప్రభుత్వానికి అందరికీ ఉపయోగకరంగా మారింది.

కొత్త నిబంధనలతో చిక్కులు
ధ్రప్రదేశ్ లో కొత్త ఎక్సైజ్ పాలసీ మద్యం దుకాణదారులకు లాభాల పంట తెచ్చిపెడుతుంది. అదే సమయలో ప్రజల ఆరోగ్యాలను చెడగొడుతుంది. వైన్ షాపులు నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నప్పటికీ ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. చూసీ చూడనట్లు కొందరు వదలిస్తున్నారు. మరికొందరు ఎక్సైజ్ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వైన్ షాపుల్లోనే బహిరంగంగా మద్యాన్ని సేవిస్తుండటం, అనుమతి లేకుండా పర్మిట్ రూమ్‌లను ఏర్పాటు చేసుకోవడం, అక్కడే బార్ తరహా వాతావరణం నెలకొల్పడంతో తాగుబోతులను ఆకట్టుకునేందుకు ఎక్కువగా మద్యం దుకాణాలు ప్రయత్నిస్తున్నాయి. దీంతో కొన్ని చోట్ల ప్రజలు తిరగబడుతున్నారు.

మద్యం దుకాణాల వద్దనే మంచింగ్ కోసం ఫుడ్ స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేసుకుని బహిరంగంగా మద్యాన్ని సేవిస్తున్నప్పటికీ ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదు. మద్యం దుకాణల్లోనే వాటర్ బాటిల్స్ తో పాటు సోడాలు కూడా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం వైన్ షాపుల వద్ద మద్యాన్ని సేవించకూడదు. పర్మిట్ రూంలకు ప్రభుత్వం నుంచి లైసెన్స్ పొందిన తర్వాతనే వాటిని నడుపుకోవాల్సి ఉంది. అయితే కొత్తగా ప్రారంభించిన మద్యం దుకాణాల్లో ఎక్కువ శాతం అంటే విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో మాత్రమే కాకుండా రూరల్ ఏరియాల్లోనూ పర్మిట్ రూంలను ఏర్పాటు చేసుకున్నారుమద్యం అక్కడే సేవిస్తూ అక్కడే కొందరు ఉంటున్నారు.

ఈ సందర్భంగా కొన్ని చోట్ల ఘర్షణలు కూడా తలెత్తుతున్నాయి. సొంత వాహనాలను తీసుకు వచ్చి అక్కడే గంటల పాటు కూర్చుని మద్యం తాగుతుండటంతో ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. సిట్టింగ్ ల కోసం ప్రత్యేకంగా వైన్ షాపుల పక్కనే షెడ్లను ఏర్పాటు చేసుకున్నారు. అయినా ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోసం ప్రవేశపెట్టిన కొత్త పాలసీతో సర్కార్ కు ఏమో కాని వైన్ షాపుల యజమానులకు మాత్రం కాసుల పంట పండుతోంది. లక్షలు వెచ్చించి షాపులు దక్కించుకున్న వారు వెంటనే దానిని తిరిగి సంపాదించుకునే ప్రయత్నంలో అడ్డదారులు తొక్కుతున్నారు. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఏపీలో కిక్కే కిక్కు

 

AP Liquor Prices | ఏపీలో లిక్కర్ ధరలు | Eeroju news

Related posts

Leave a Comment