AP Liquor | ఏపీలో మద్యం దుకాణాలకు విదేశాల నుంచి అప్లికేషన్స్‌.. | Eeroju news

ఏపీలో మద్యం దుకాణాలకు విదేశాల నుంచి అప్లికేషన్స్‌..

ఏపీలో మద్యం దుకాణాలకు విదేశాల నుంచి అప్లికేషన్స్‌..

అమరావతి అక్టోబర్ 14

AP Liquor

ఏపీలో కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తు గడువు నేటితో ముగియనున్నారు. దరఖాస్తుకు శుక్రవారం చివరిరోజు కావడంతో పెద్ద ఎత్తున ఆశావహులు దరఖాస్తు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాల కోసం ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. శుక్రవారం ఒకే రోజు 20వేల వరకు దరఖాస్తులు రావచ్చని అంచనా. దాంతో ప్రభుత్వానికి రూ.1600కోట్లకుపైగానే ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు.

ఇప్పటి వరకు అత్యధికంగా ఎన్టీఆర్‌ జిల్లాలో అత్యధికంగా, అల్లూరి జిల్లాలో అత్యల్పంగా దరఖాస్తులు వచ్చాయి. నిన్నటి వరకు ఎన్టీఆర్‌ జిల్లాలో 113 మద్యం దుకాణాలకు 4,839 మంది.. అల్లూరి జిల్లాలో 40 మద్యం దుకాణాలకు 869 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు.అయితే, అమెరికా, యూరప్‌ నుంచి సైతం పలువురు మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మద్యం దుకాణాల కోసం శుక్రవారం రాత్రి 7 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఎక్సైజ్‌ కమిషనర్‌ నిశాంత్‌ కుమార్‌ తెలిపారు.

రిజిస్ట్రేషన్‌ అనంతరం 12 గంటలలోగా డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు డీడీలతో ఎక్సైజ్‌ స్టేషన్‌కు వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. కార్యాలయాలకు వచ్చే వారంతా తప్పనిసరిగా సాయంత్రం 7లోగా చేరుకోవాలని.. టికెట్లు అందించి.. దరఖాస్తులను స్వీకరిస్తామని.. ఆ తర్వాత వచ్చే వారికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు.

ఏపీలో మద్యం దుకాణాలకు విదేశాల నుంచి అప్లికేషన్స్‌..

 7న మద్యం షాపుల బంద్ | AP Political News | Eeroju News

Related posts

Leave a Comment