AP farmers : రైతులకు యూనిక్ ఐడీతోనే సేవలు

ap formers
  • రైతులకు యూనిక్ ఐడీతోనే సేవలు

రాజమండ్రి, ఫిబ్రవరి 28, (న్యూస్ పల్స్)
ప్ర‌భుత్వ డిజిట‌ల్ మిష‌న్‌లో భాగంగా రైతులకు ఇప్పుడు కేంద్రప్రభుత్వం యూనిక్‌ ఐడీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభించింది.. భూమి ఉన్న ప్రతీ ఒక్క రైతుకు పదకొండకెల నెంబరు, రిజిస్ట్రర్‌ ఐడీద్వారా పీఎం కిసాన్‌ పథకాన్ని అమలు చేయబోతుంది.. అంతేకాకుండా ఇకపై ఈ ఐడీ ఆధారంగానే రైతుకు సంబందించిన అన్ని కార్యకలాపాలు నిర్వహించబోతున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగా గత 20 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఈప్రక్రియ వేగవంతంగా పూర్తిచేస్తోంది.. ఇప్పటికే 50 శాతం రిజిస్ట్రేషన్లు పూర్తికాగా మరింత వేగవంతం చేస్తోంది.. ఇకపై ఈ యూనిక్‌ ఐడీ జనరేట్‌ అయితేనే పథకాలు వర్తిస్తాయి..వెబ్‌ల్యాండ్‌ డేటాను అగ్రి స్టాగ్‌ అనే వెబ్‌ సైట్‌కు ఫార్మర్‌ రిజిస్ట్రీ అనుసంధానించారు.. ఆధార్‌ నెంబర్‌ ఎంటర్‌ చేసిన వెంటనే ఆధార్‌తో లింక్‌ అప్‌ అయిన భూమి తాలూకా డీటైల్స్‌ వస్తాయి.. ఈభూమికి సంబందించి ఏయే సర్వే నెంబర్లు ఉన్నాయో సంబందిత రైతుకు ఓటీపీ జనరేట్‌ అవుతుంది.. ఆ ఓటీపీ ఎంటర్‌ చేసిన వెంటనే పదకొండంకెట సంఖ్య క్రియేట్‌ అవుతుంది. ఆ నెంబరే యూనిక్‌ ఐడీ.. ఈ ఐడీ ద్వారానే ఇకపై రైతు సంబందింత పథకాలన్నీ వర్తింపచేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాహాలుచేస్తోంది..

అయితే ఇందులో ఇప్పటికే తమ భూములు వెబ్‌ల్యాండ్‌ డేటాలో తమ పేరున ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవుకానీ కొత్త గా కొనుగోలుచేసుకునే వారికి మాత్రమే ఇబ్బందులు ఉండవచ్చు.. ప్రస్తుతం మనం ఏప్రభుత్వ పథకాన్ని పొందుకోవాలన్నా, లేదా ఎటువంటి లావాదేవీలు చేయాలన్నా ఆధార్‌ సంఖ్య అత్యంత అవసరం.. అలాగే ఇప్పుడు రైతులు తమకు ప్రభుత్వం ద్వారా అందించే ఏ పథకం అయినా వర్తించాలంటే ఈ ఫార్మర్‌ రిజిస్ట్రీలో యూనిక్‌ ఐడీ కలిగి ఉండాలి.. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ద్వారా పీఎం కిసాన్‌ పథకం అమలు అవుతుండగా వ్యవసాయ భూమి ఉన్న రైతులకు ఏటా రూ.6 వేల పెట్టుబడి సాయం అందిస్తోంది.. ఒక కుటుంబానికి రూ.6 వేలు చొప్పున అందిస్తున్న ఈ పెట్టుబడి సాయం మాత్రమే కాకుండా కేంద్రం అమలు చేసే ప్రతీ రైతు సంబందిత పథకాలకు ఈయూనిక్‌ ఐడీ ద్వారానే మంజూరు అయ్యే పరిస్థితి ఉంటుంది.అదే విధంగా భవిష్యత్తులో అన్నదాత సుఖీభవ, పంట నష్టం, క్రాప్‌ ఇన్యూరెన్స్‌ మాత్రమే కాకుండా ధాన్యం కొనుగోళ్లు తదితర కార్యకలాపాలకు ఈ యూనిక్‌ ఐడీ ప్రాతిపదికన అమలు కానున్నాయి.. గ్రామస్థాయిలో ఉన్న రైతు భరోసా కేంద్రాల్లో గ్రామ వ్యవసాయ సహాయకులు ద్వారా రైతులు ఈ రిజిస్ట్రీ ప్రక్రియ పూర్తిచేసుకోవచ్చు.

Read : Suryapet:సూర్యాపేటలో పంటలు ఎండిపోతున్నాయి.. మంత్రి ఉత్తమ్ కు ఉసురు తగులుతుంది

 

Related posts

Leave a Comment